Sunday, April 8, 2012

గూగుల్ వారి వెబ్ కళ్లద్దాలు...ఫోటోలు మరియూ వీడియో

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్, ఆధునిక టెక్నాలజీతో పనిచేసే వెబ్ కళ్లద్దాలను రూపొందిస్తోంది. దీని ప్రోటోటైప్ ను ఈ మధ్య విడుదల చేసేరు. గూగుల్ మేనేజర్లు ఈ కళ్లద్దాలను త్వరగా మార్కెట్లో ప్రవేశపెట్టాలని ఈ కళ్ళద్దాలను రెడీచేస్తున్న గూగుల్ టీం ని ఒత్తిడిచేస్తున్నారట. ఈ వెబ్ కళ్లద్దాల ప్రాజెక్టులో పనిచేస్తున్న నిపుణులు ఈ కళ్లద్దాలలో ఇంకా మెరుగు పరచవలసి ఉన్నదని, దానికి ఇంకా కొంత సమయం అవసరమని చెబుతున్నా ఎలాగైనా ఈ సంవత్సరం చివరిలో ఈ వెబ్ కళ్ళద్దాలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని గూగుల్ మెనేజ్మెంట్ ఒత్తిడిచేస్తోందట. వివిధ పరిసరాల్లోని ద్ళశ్యాలు వాటికి సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ స్ర్కీన్ పై చూసిన అనుభూతిని ఈ జోడు కలిగిస్తుంది. ఆండ్రాయిడ్ వ్యవస్థ ఆధారితంగా పని చేసే ఈ గ్లాస్లు పరిసరాల్లోని సమాచారాన్ని నేరుగా కంటిలోకి ప్రవహింపజేస్తాయి. దీంతో వీటిని ధరించినవారికి కంప్యూటర్ మానిటర్ ద్వారా చూస్తున్నట్లుగానే అనుభూతి కలుగుతుంది. జీపీఎస్ పరిజ్ఞానం, అనేక సెన్సర్ల ద్వారా సమాచారాన్ని సేకరించే ఈ కళ్లజోడు 3జీ లేదా 4జీ కనెక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు ఉపయోగపడే గూగుల్ లాటిట్యూడ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ గాగుల్స్ వంటి అప్లికేషన్లన్నీ ఈ కళ్లజోడులో కూడా ఉంటాయి. ఇంటర్నెట్ బ్రౌజింగ్కు మౌస్, మానిటర్ల అవసరం లేకుండా వెబ్ ఆధారంగా పనిచేసే నూతన ఆవిష్కరణ ఇది. వీడియో చాటింగ్, మెసేజింగ్, వాతావరణ వివరాలు తెల్సుకోవడం, ఫొటోలు తీసుకోవడం, ఆన్లైన్ సేవలు, నడుస్తూనే దారి తెల్సుకోవడం ఇలా అన్నీ దీంట్లో సాధ్యమని కంపెనీ చెబుతోంది. ఈ కళ్లద్దాలు ఏడాది చివరిలోగా మార్కెట్లోకి రానున్నాయి. మామూలు కళ్లద్దాల పైన కూడా దీనిని అమర్చుకునే వసతులు కలిపిస్తున్నారట.

2 comments:

 1. మీరు చెప్పింది.. చాలా బాగుంది.. ఈ టెక్నాలజీ అందరికీ తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తే చాలా బాగుంటుంది..

  ఏమీ అనుకోకండి... ఈ టెక్నాలజీని వెక్కిరిస్తూ చేసిన పేరడీ వీడియో ఈ లింకులో ఉంది.. ఒక్క లుక్కేయండి..

  http://www.youtube.com/watch?v=t3TAOYXT840

  ReplyDelete
 2. అభ్యర్ధన :

  నమస్తే!
  ' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..
  అయితే.. ఇంకేం ఆలస్యం.. మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.
  మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.

  వ్యాఖ్యానంలో మా అభ్యర్ధనను విన్నపిస్తున్నందులకు అన్యదా భావించ వద్దని కోరుకొంటూ.. మా విజ్ఞప్తిని పదిమందికి తెలిసేలా సహకరించమని అభ్యర్ధిస్తూ...

  సదా సేవలో,
  -కంచర్ల సుబ్బానాయుడు,
  సంపాదకులు, సేవ
  http://sevalive.com/

  ReplyDelete