Friday, April 6, 2012

పూర్వకాలం నుండి మారుతూ వస్తున్న భవన నిర్మాణ శిల్ప కళ(వాస్తు శిల్ప కళ)...ఫోటోలు

నాగరికత ను గుర్తించినప్పటి నుండీ భవన నిర్మాణ శిల్ప కళ ఉన్నదనే చెప్పాలి. నాగరికతలో మార్పులు ఎలా వచ్చిందో భవన నిర్మాణ శిల్ప కళలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.ఈనాటి భవన నిర్మాణ శిల్ప కళకు స్పూర్తి పూర్వకాలపు భవన నిర్మాణ శిల్ప కళే. స్టోన్ ఏజ్ ప్రభావం ఈజిప్టియన్ల మీద,ఈజిప్టియన్ల ప్రభావం గ్రీకులమీద, గ్రీకుల ప్రభావం రోమన్ల మీద,రోమన్ల ప్రభావం ప్రస్తుత ప్రజలాందరిమీద. ఇలా భవన నిర్మాణ శిల్ప కళ ఎప్పటికప్పుడు మారుతూ ఈ రోజు ఏన్నో మార్పులతొ దేశాలనూ, నగరాలనూ అలంకరిస్తోంది................................................................................ నియోలితిక్ భవన నిర్మాణ శిల్పకళ....9500 B.C....దీనినే స్టోన్ ఏజ్ అంటారు......ఈ కాలం నుండే మానవులకు టెక్నాలజీ ఆలొచనలు మొదలయ్యేయి. కుమ్మర స్వరూపాలూ, కుండచుట్లు ఈ కాలంలోనే పరిచయం చేయబడ్డాయి. వేటాడటానికీ, భవన నిర్మాణానికీ, వంట చేసుకోవడానికీ సాధనాలు కూడా పరిచయం చేయబడ్డాయి. మట్టితో ఇటికలు తయారుచేసి వాటితో భవన నిర్మాణాలు మొదలుపెట్టేరు.ఈ కాలంలోనే నాగరికత, అధ్యాత్మిక నమ్మకాలూ, జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనే ఆశ మొదలయ్యేయట.
పురాతన మెడిటరేనియన్....3000 B.C.- 300(?)B.C........ఈ కాలంలోనే పురాతన మెసొపొటామియా, పురాతన ఈజిప్ట్, పురాతన గ్రీస్, రోం మరియూ బైజెంటైన్ సామ్రాజ్యం పరిపాలనలు ఉండేవి. ఈ కాలములోనే ఎన్నో చారిత్రాత్మక విషయాలు జరిగినై. మెసొపొటామియా, భారత, చైనా కళాచారాలు ప్రసిద్ది చెందినై. ఈ కాలంలోనే సముద్రపు దారులు కనుగొన్నారు. రాయడం కనుగొన్నారు. తలుపులూ,కిటికీలూ, పిల్లర్లూ, శిల్ప కళ, పైంటింగ్, ఇంజనీరింగ్, అక్షరాలు, వ్యవసాయం ఈ కాలంలోనే పుట్టిందని చెబుతారు.
ఇస్లామిక్ భవన నిర్మాణ శిల్ప కళ 600 A.D..-1700s.....ఈ కాలంలో భవన నిర్మాణం లౌకీకంగానూ, మత సంభంధమైనవిగానూ ఉండేవి.
ఆఫ్రికా 2000 B.C.- 100 A.D.........ఈజిప్ట్ ఒకప్పుడు ఆఫ్రికాలో భాగంగా ఉండేది. ఇది చాలామందికి తెలియదు.ఆఫ్రికాలోనే ఈజిప్ట్ అన్ని విషయాలలోనూ అభివ్రుద్ది చెంది ఉండేది. వారు నిర్మించిన పిరమిడ్లు ఇప్పుడు ప్రపంచ హెరిటేజ్ చోటుగా పరిగనిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న పెద్ద పెద్ద భవనాలూ, కాంప్లెక్స్ లూ వీరి భవన నిర్మాణ పద్దతుల స్పూర్తి వలనే చేయగలిగేరు. ఆఫ్రికా భవన నిర్మాన శిల్ప కల వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్రికా ప్రజలలో రకరకాల ఆచరణ పద్దతులు కలిగున్నాయి.గోపురాల లాగా చిన్న చిన్న ఇళ్ళు, అన్ని ఒకచోటే ఉండేటట్లు కట్టుకుని నివసించేవారు.
ఆసియా 5000 B.C. - 300 A.D. .....పెర్సియన్ల భవన నిర్మాణ శిల్పకళ కూడా కలిసి ఉంటుంది.అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ శిల్ప కళను చూసి, వారివారి పద్దతుల కనుగుణంగా భవన నిర్మాణ శిల్ప కళను మార్చుకున్నారు.అయితే వీరి నిర్మాణాంలో పురాతణ కళను చేర్చుకుని నిర్మించుకున్నారు.
కొలంబియా కు ముందు...200 B.C. - 1600 A.D. .....మెసో అమెరికా, ఇంకాన్,ఆల్మెక్, మాయా మరియూ పురాతణ నార్త్ అమెరికా భవన నిర్మాణ శిల్ప కళ కలిసి ఉన్నది.16 వ శతాబ్ధపు యూరోపియన్ ఆక్రమణల కాలనీలు ఉండేవి.ఈ కాలంలోనే అతి పెద్ద రోడ్లూ, వంతెనలూ మొదలుపెట్టేరు. భవన నిర్మాణ కార్మీకులకు ఈ కాలంలోనే పనితనం నేర్పబడింది.
మధ్య యుగం...500 A.D. నుండి 1600.....ఈ కాలంలోనే ఒక్కొక్క భవన నిర్మాణాంలోనూ తేడాలు కల్పించేరు.రాజ భవనాలు వేరుగా, మత సంభందిత చోట్లూ, మిలటరీ భవనాలూ, మామూలు ప్రజల భవనాలూ వేరుగా కనిపించేటట్లు భవన నిర్మాణం చేసేరు. ఈ కాలం లోనే అనేక యుద్దాలూ జరిగినై.రాజ్యాలు విస్తరించబడ్డాయి. వ్యాధులతో ప్రజలు బాధలు పడ్డారు. అయితే ఆ తరువాత భవన నిర్మాణం మార్పులు చెందింది. భవనాల పైన బొమ్మలూ,దైవ సూక్తులూ,అద్దాలూ పెట్టడం జరిగింది.
వలసపాలన విధానం.. ..16 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం......ఈ కాలం లోనే వలస వచ్చి రాజ్యాలను ఆక్రమించి చేపట్టిన వారు వారి భవన నిర్మాణం తో పాటూ ఆ ఆ రాజ్యాల భవన నిర్మాణాన్ని చేపట్టేరు.
ప్రారంభ ఆధునీకం....1900-1940......ఈ కాలంలోనే ఏందుకోసం భవనం నిర్మించదలుచుకున్నారో ఆ కారణాలకు తగినట్లు భవన నిర్మాణం చేసేరు.
ప్రస్తుత భవన నిర్మాణ శిల్ప కళ....1940---- ఈ కాలంలో భవన నిర్మాణ శిల్ప కళ ఎన్నో మార్పులతో అలంకరించుకుంది.ఈ మార్పులలో అతి ముఖ్యమైనవి వాతావరన కాలుష్య తగ్గుదలకు గ్రీన్ ఆర్కిటెక్చర్,ఎర్త్ క్వాక్ రెసిస్ టన్స్ ఆర్కిటెక్చర్.

No comments:

Post a Comment