Wednesday, April 18, 2012

4 లక్షల నల్లరంగు ప్లాస్టిక్ బంతులతో కప్పబడిన మంచినీటి జలాశయం....ఫోటోలు

అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఉన్న ఐవన్ హో రిజర్వాయర్ నుండి దక్షిణ లాస్ ఏంజల్స్ లో నివసిస్తున్న 6,00,000 మందికి మంచి నీరు సరఫరా చేసేవారు. ఇప్పుడు ఆ రిజర్వాయర్ను 4 లక్షల నల్లరంగు ప్లాస్టిక్ బంతులతో కప్పేసేరు. కారణం ఆ రిజర్వాయర్ నీళ్ళలో క్యాన్సర్ వ్యాధిని కలిగించగలిగే కార్సినోజెన్ తయారౌతోందట. భూమిలో దొరికే ఏ మంచి నీటిలోనైనా ప్రక్రుతి పరంగా బ్రోమైడ్ ఉంటుంది. అక్కడ నిలువలో ఉన్న నీటిలో బాక్టీరియా చనిపోవడానికి క్లోరిన్ కలుపుతారు. బ్రోమైడ్ మరియూ క్లోరిన్ కలిసినందువులన నీటిలో ఎటువంటి రియాక్షన్ చోటుచేసుకోదు. కానీ ఆ నీటికి సూర్యరశ్మి తగలడంవలన ఆ నీటిలో కార్సినోజెన్ తాయారౌతోందట. ఇది తెలుసుకున్న అధికారులు ఆ నీటి సరఫరాను ఆపేసేరు.వెంటనే ఆ ప్రక్కనున్న గిరిఫిత్ పార్క్ లో కొత్తగా ఒక అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ కడుతున్నారు.అయితే అది తయారయేంతవరకు ఈ నీటిపై సూర్యరశ్మి పడకుండా ఉండాలని ఎన్నో విధానాలను ఆలోచించేరు. కొన్ని విధానాలు ఖరీదైనవిగా ఉండగా, కొన్ని విధానాలు అమలుపర్చడానికి చాలాకాలం పట్టేవిగా ఉన్నాయట. అప్పుడు బ్రైన్ వైట్ అనే బయాలజిస్ట్ ఈ బంతుల గురించి తెలిపేరట. ఈ బంతులను సాధారణంగా విమానాశ్రయాలలో పక్షులు రాకుండా ఉండేందుకు వాడతారట. ఈ బంతులను పోలీఎతిలిన్ తో తయారుచేస్తారట. ఖరీదు అతి తక్కువ, ఈ బంతులపైన వేసే కార్బన్ మరియూ నల్ల రంగుల కోటింగ్ సూర్యరశ్మి లో నుండి వెలువడే అల్ట్రా వైలట్ రే లను నీటిలోనికి పోకుండా ఆపుతుందని తెలుసుకుని ఆ రిజర్వాయర్ ను 4 లక్షల బంతులతో కప్పేసేరు. అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ తయారైన తరువాత ఈ నీటిని అందులోకి పోయే ఏర్పాట్లు చేస్తారట.

3 comments:

  1. కొత్తది కట్టకా ఆ plastic బంతులు ఏమి చేస్తారు?

    ReplyDelete
  2. హాహాహ ఫణీంద్ర గారు మన అందరికి గిఫ్ట్స్ గా పంపుతారు మంచిగా ఆడుకోవచ్చు కదా...

    ReplyDelete