Monday, April 9, 2012

2012 అంతర్జాతీయ రోబోల ఫుట్ బాల్ పోటీలు ఇరాన్ లో మొదలయ్యేయి.... ఫోటోలు మరియూ వీడియో

ఇరాన్ దేశంలో 2012 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ రోబోల ఫుట్ బాల్ పోటీలు మొదలయ్యేయి. ఇందులో 359 టీములు పోటీచేస్తున్నాయి. 1993 లో మొదటి సారిగా రోబోల ఫుట్ బాల్ పోటీలు జపాన్ దేశంలో మొదలుపెట్టేరు. 2050 లో రోబోలకూ, మనుష్యులకూ ఫుట్ బాల్ పోటీలు జరపాలని నిర్ణయించుకున్నారు. అందుకు గానూ వివిధ దేశాలు రోబోలను తయారుచేసి(లేక కొనుక్కుని) వాటితో పోటీలు మొదలుపెట్టేరు. 1995 నుండి రోబోల ఫుట్ బాల్ మ్యాచ్ లు జరిగేయి. 1997 లో అంతర్జాతీయ రోబో ఫుట్ బాల్ ఫెడరేషన్ స్థాపించేరు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఈ రోబో ఫుట్ బాల్ పోటీలు జరుపబడ్డాయి. ఆ తరువాత అంతర్జాతీయ రోబో ఫుట్ బాల్ పోటీలు జరుపుతున్నారు.ఈ పోటీలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో జరుపుతున్నారు.ఈ సంవత్సరం ఇరాన్ దేశం లో జరుపుతున్నారు.
ఇది రోబోల ఫుట్ బాల్ మ్యాచ్ వీడియో

No comments:

Post a Comment