Thursday, April 5, 2012

ఇంటర్నెట్ ను మార్చిన వ్యక్తులు...ఫోటోలు(పార్ట్-1)

ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్..... ఇంటర్నెట్ ను మనకు అందించిన వ్యక్తులు అంటే వారు చాలా మంది ఉన్నారు. కానీ వింట్ సెర్ఫ్(Vint Cerf)ని ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అంటారు. ఈయన బాబ్ కహన(Bob Kahn)తో కలిసి TCP/IP కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్ ను అందించేరు. దీని మూలంగానే ఒక కంప్యూటర్ మరో కంప్యూటర్తో నెట్ వర్క్ మూలంగా మాట్లాడుకుంటాయి."ఇంటర్నెట్ అనేది ప్రజలయొక్క అద్దం లాంటిది.స్పాం అనేది ఉచిత సేవల యొక్క సైడ్ ఎఫ్ఫెక్ట్" అని ఒక ప్రసంగంలో చెప్పేరు.
WWW ను ఇన్వెంట్ చేసినాయన.... టిం బెర్నర్స్ లీ(Tim Berners-Lee)...ఈయనే వరల్డ్ వైడ్ వెబ్(WWW)ను ఇన్వెంట్ చేసినది. మొదటి వెబ్ క్లయంట్ మరియూ సర్వర్ ను రాసి లింకులూ, హైపర్ లింకులూ మరియూ ఆన్ లైన్ ఇన్ ఫర్మేషన్ ను క్రియేట్ చేసేరు.ఇప్పుడు కూడా ఈయన అంతర్జాల ప్రమాణ సంరక్షడిగా కొనసాగుతూ అంతర్జాల డిజైన్ మెరుగు పరిచే డైరెక్టరుగా వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం (W3C)లో ఉంటున్నారు.
ఫాదర్ ఆఫ్ ఈ-మైల్...... రే టాం లిన్సన్(Ray Tomlinson)...ఈయన ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్మర్. ఫాదర్ ఆఫ్ ఈ-మైల్ అని పిలువబడే ఈయన మెసేజ్ లను ఒక మిషన్ నుండి మరొక మిషన్ కు,ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికీ, ఒక ఖండం నుండి మరో ఖండానికీ సముద్రాలు దాటి వెళ్లే విధముగా చేయగలిగేరు. ఈ మైల్ అడ్రెస్సులలో @ గుర్తును ఈయనే ఫార్మాట్ చేసేరు.ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఒక బిల్లియన్ మంది @ గుర్తును టైప్ చేస్తున్నారు.
ఇ-పుస్తకాల పుట్టుక....... మైకల్ హార్ట్(Micheal Hart)....ఈయనే ఇ-పుస్తకాల పుట్టుకకు కారణం. ఈయనే అజ్ఘ్ణానమూ మరియూ నిరక్షరాస్యతా యొక్క అడ్డుగోడలను చ్చేధించేడు. ప్రపంచ మొట్టమొదటి ఎలక్ట్రానిక్ లైబ్రరీ "ప్రాజక్ట్ గుటెన్ బెర్గ్" ను మొదలుపెట్టి ప్రపంచ ప్రజలు చదువుకునే విధానాన్ని మార్చేరు. కాపీరైట్ పుస్తకాలతో పాటూ పౌరప్రదేశ వ్యాసాలను చేర్చేరు.
మొట్టమొదటి స్పాం ఈ-మైల్....... గారీ తుయేరక్ (Gary Thuerk).....స్పామ్మింగ్ ఒక పాత మార్కెటింగ్ టెక్నిక్. గారీ తుయేరక్ అనే ఈయన మొదటిసారి గుంపుగా ఈ-మైల్స్ ను ఆర్పనెట్ మూలంగా తన వ్యాపర మిత్రులకు పంపించేరు. ఆ రోజు ఈయనకు తెలియని విషయమేమిటంటే ఈయనే ప్రపంచములో మొదటి స్పాం పంపిన ఆయన అని.
మొట్టమొదటి మనోభావ గుర్తు (ఎమోటికాన్స్)....... స్కాట్ ఫాల్ మాన్(Scott Fahlman) అనే ఈయన ASCII అధారంగా నవ్వు ఎమోటికాన్ ను ప్రారంభించేరు.అంతర్జాల వ్యాసాలలో హాస్యాస్పధమైనవీ, శోకంగా ఉన్న వాటిని చదివిన వారు గుర్తించేందుకు గానూ మొదలుపెట్టేరు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరూ దీనిని ప్రతి విషయానికీ వాడుతున్నారు.
నెట్ స్కేప్ నావిగేటర్........ మార్క్ ఆండర్ సన్(Marc Andreessen)......ఈయన అంతర్జాల విహారం లో విప్లవమాత్మక మార్పులు తీసుకువచ్చేరు. అంతర్జాలంలో విస్త్రుతంగా వాడబడిన వెబ్ బ్రౌజర్ "మోసైయక్" ను రూపొందించి, ఆ తరువాతా దానిని నెట్ స్కేప్ నావిగేటర్ గా అందించేరు.ఈయన డిగ్, ప్లాజస్ మరియూ ట్విట్టర్ లో సహ వ్యవస్తాపకులుగా ఉంటున్నారు.
అంతర్జాల రిలే చ్చాటింగ్........ జర్కో ఓయ్కరేనన్(Jarkko Oikarinen).... ఈయన ఫిన్లాండ్లో మొదటిసారిగా ఆన్ లైన్ చ్చాట్ టూల్ రూపొందించేరు.1991 లో ఇది ప్రక్యాతి పొందింది. ఇరాక్ దేశం కువైత్ మీద దాడిచేసినప్పుడు రేడియో మరియూ టీవీ సిగ్నల్స్ మూసివేయబడ్డాయి.అప్పుడు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రపంచ ప్రజలు ఈయన రూపొందించిన చ్చాట్ రూం మూలంగా పొందగలిగేరు.

No comments:

Post a Comment