Monday, April 30, 2012

అత్యంత ఆశ్చర్యపరిచే హోటల్లు.....ఫోటోలు

ఆకాశ బోజన హోటల్(బెల్జియం)...బ్రుసెల్స్ లో ఉన్న ఈ హోటల్ ఒక సారికి 22 మందికి మాత్రమే బోజనం పెట్టగలదు. ఎందుకంటే ఈ హోటల్ ఆకాశంలో, అంటే 150 అడుగుల ఎత్తున గాలిలో ఉంటుంది. స్పెషల్ గా తాయారుచేసిన టేబుల్స్ మరియూ కుర్చీలు కలిగి ఉన్న ఈ హోటల్ ను ఒక క్రేన్ పైకి తీసుకు వెడుతుంది. సీటు బెల్ట్ లు వేసుకుని తినాలి. ఫోర్క్ లు ఎట్టి పరిస్తితులలోనూ క్రింద పడేయకూడదు.
చీకటి హోటల్(చైనా).....చైనాలోని బీజింగ్ నగరంలో ఉన్న ఈ హోటల్ చీకటిగా ఉంటుంది. లైట్లు ఉండవు. హోటల్ లోకి అడుగు పెట్టిన వెంటనే నైట్ విజన్ కళ్లజోళ్ళు వేసుకున్న వైటర్స్ వచ్చిన వారిని బద్రంగా టేబుల్ దగ్గరకు తీసుకు వెడతారు. మెనూ కార్డ్ లోపల ఉండదు. తినడానికి వచ్చినవారు అడిగిన వాటిని వైటర్స్ తీసుకువచ్చి పెడతారు. చీకటిలోనే తినాలి. ఫ్లాష్ లైట్లు, మొబైల్ ఫోన్లు, రేడియం గడియారాలూ లోనికి తీసుకు రాకూడదు. చీకటిలో వాసన చూసి మాత్రమే తినడం వలన తినే పదార్ధాల రుచి బాగా తెలుస్తుందని అలా హోటల్ పెట్టేరు. మళ్ళీ వాష్ రూం లో మాత్రం పెద్ద లైట్లు ఉంటాయి.
శ్మాశాన హోటల్(ఇండియా).......అహమదాబాద్ లో ఉన్న ఈ న్యూ లకీ రెస్టారెంట్ టీ, బటర్ రోల్స్ మరియూ టేబుల్ల మధ్య ఉన్న సమాధులు వలన ప్రఖ్యాతి పొందింది. క్రిష్ణన్ కుట్టీ నాయర్ అనే ఆయన పురాతనమైన, పాడుబడిపోయిన మరియూ ఉపయోగంలోలేని ముస్లీం ల శ్మశాన చోటును ఉన్న రెస్టారెంట్ నడపడానికి సహాయపడ్డారు. రెస్టారెంట్ మధ్యలో ఉన్న సమాధులు ఎవరివో ఆయానకు తెలియదు. సమాధులకు పచ్చరంగు పైంట్ వేసి అలంకరించేరు. "శ్మాశానంలోకి రావడానికి అందరూ భయపడతారు. కానీ శ్మాశానంలో కూర్చుంటే మంచిదని అందరికీ తెలుసు. అక్కడ రెస్టారెంట్ మొదలుపెట్టేక అందరూ రావడం మొదలుపెట్టేరు. వ్యాపారం బాగా సాగుతోంది. ప్రఖ్యాతి పొందింది. సమాధుల మధ్య తినడానికి అందరూ ఇష్టపడుతున్నారు" అని ఆయన తెలిపేరు.
జైలు హోటల్...ఇటాలీ......ఇటాలీలోని హై సెక్యూరిటీ జైలులో Fortezza Medicea అనే హోటల్ ఉన్నది. ఆ రెస్టారెంట్ లో హత్యానేరం క్రింద యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ రోజూ పియానో వాయిస్తాడు. అతని పియానో సంగీతం అక్కడున్న జైలు అధికారులకు బాగ నచ్చింది. బయటి ప్రజలు కూడా అతని పియానో వినాలని బయట ప్రజలను జైలు రెస్టారంట్ లోకి అనుమతించేరు. అక్కడి వాతావరణం, జైలు చుట్టూ ఉన్న ఎత్తైన గోడలూ, సెక్యూరిటీ టవర్లు బయట నుండి వచ్చిన జనానికి నచ్చింది. అలా ఆ హోటల్ ప్రసిద్ది చెందడంతో, జైలు అధికారులు ఆ జైలు పేరుతో పలుచోట్ల బ్రాంచీలు తెరిచినా ప్రజలు జైలులో ఉన్న రెస్టారెంట్ కే ఎక్కువగా వస్తున్నారు. అక్కడ తినడాని ఆశ పడితే 15 రోజులకు ముందే టేబుల్ బుక్ చేసుకోవాలట.
టాయ్ లెట్ హోటల్(తైవాన్)......టాయ్ లెట్ లో హోటల్ పెట్టలేదండి... టాయ్ లెట్ ఆకారంతో హోటల్ పెట్టేరు. ఫోటోలు చూస్తున్నట్లు, అక్కడున్న ప్లేట్లూ, ఆహారం పెట్టే బొవల్స్ అనీ వెస్ట్రన్ టాయ్ లెట్ ఆకారాలలో ఉంటుంది. కుర్చీలు టాయ్ లెట్ సీట్లలాగా ఉంటాయి. టేబుల్లు బాత్ టబ్ లతో చేసినవి. ఇది అక్కడి ప్రజలకు బాగా నచ్చింది. టాయ్ లెట్ లో తినడం ఒక త్రిల్లింగ్ గా ఉన్నదని చెబుతున్నారు.
రోబో దంపతుల హోటల్(చైనా)..... పొట్టకూటికోసం మొట్టమొదట మామూలు పేరుతో ఇద్దరు అన్నదమ్ములు మొదలుపెట్టబడిన ఈ హోటల్ ప్రజలచే రోబో దంపతుల హోటల్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది. కారణం, అన్నదమ్ములిద్దరూ కవలలు, వారు పెళ్ళిచేసుకున్న అమ్మాయలూ కవలలు. ఈ విషయం మొదట్లో ప్రజలకు తెలియదు. దంపతులిద్దరే హోటల్ ను 24 గంటలు ఎలా నడుపుతున్నారో అర్ధం కాలేదు. ఎప్పుడు వెళ్ళినా వారే అక్కడ కనబడేవారు. మిషన్ లాగా విశ్రాంతి తీసుకోకుండా 24 గంటలు పనిచేస్తున్న ఆ దంపతులిద్దరినీ చూసి వీరు రోబోలని తీర్మానించుకుని ప్రజలు ఆ పేరు పెట్టేరు. కొన్ని రోజుల తరువాత ఒక న్యూస్ రిపోర్టర్ ఆ దంపతులను ఇంటర్వ్యూ చేయడాని వెళ్ళినప్పుడు విషయం తెలిపేరు. దంపతులిద్దరే కాదు, మరో జంట కూడా ఉన్నదని. వారు కవలలు కావడంతో ఎవరు ఎప్పుడుంటున్నారో ప్రజలు కనుక్కోలేకపోయేరు.ఈ విషయం ప్రజలకు తెలిసింది. కానీ వారికి కోపము రాలేదు. కవల దంపతులను చూడటానికి ఆ హోటల్ కు వెలుతున్నారు. కవలలు చేత ఆహారం తింటే అద్రుష్టం వస్తుందని వారి నమ్మకం.
భూతాల హోటల్(జపాన్)...ఈ హోటల్ పూర్తిగా నెత్తుటి రంగు తో ఎర్రగా కనబడుతుంది. ఒక శవ పేటిక, దాని పైన భూతాల మాంత్రీకుని వస్తువులూ ఉంటాయి.

50 సంవత్సరాలుగా కాలుతున్న టౌన్......ఫోటోలు

కొలంబియా దేశంలోని పెన్సిల్ వేనియా లో ఉన్న సెంట్రాలియా అనే టౌన్ గత 50 సంవత్సరాలుగా కాలుతునే ఉన్నదట. 1962 మే నెలలొ టౌన్ లోని ఒక గోతిలో పనికిరాని వస్తువులను గుంపుగా చేర్చి తగలబెట్టేరు. వస్తువులు కాలి బూడిదైనా ఆ మంటలను ఆర్పలేదు. ఆ టౌను క్రింద ఒక బొగ్గు గని ఉన్నది. ఇది అక్కడి ప్రజలకు తెలుసు. అయినా నిర్లక్ష్యంగా, మంటలను ఆర్పకుండా ఉండిపొయేరు. ఆ గొతిలోని మంటలు క్రింద ఉన్న బొగ్గు గనిలోకి చొచ్చుకుపోయింది. మరుసటిరోజు ప్రొద్దున కూడా అక్కడ దట్టమైన పోగ వస్తూ ఉండటంతో విషయం గ్రహించిన అధికారులు ఫైర్ సర్వీస్ వారికి ఫోన్ చేసేరు. ఎన్ని నీళ్ళుపోసినా పొగ తగ్గలేదు. కొన్ని వారాలు ప్రయత్నంచేసినా పొగ ఆగలేదు సరికదా గాలిలో విషపూరిత వాయువు నిండుకున్నదని తెలుసుకున్నారు. కొన్ని రోజులకు టౌన్ లోని ఇళ్ళల్లో, షాపులలో భూమి క్రింద వేడి మొదలైంది. అప్పుడు తెలుసుకున్నారు క్రింద బొగ్గు గనిలోకి మంటలు వెళ్ళి బొగ్గు గని తగలబడుతోందని. కొందరు ఇళ్ళు కాలీచేసి దూరంగా వెళ్లేరు. టౌను లో అక్కడక్కడా చిన్న చిన్న రంద్రాలు చేసి వాటి గుండా నీళ్ళు పోసేరు. ఎంత ప్రయత్నించినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. గాలిలో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువైంది.టౌన్ కాలీ చేసి వెళ్ళవలసి వచ్చింది. 1980 లో మొత్తం 200 ఎకరాల మేరకు భూమిక్రింద బొగ్గు గని తగలబడింది. భూమి క్రింద వేడి ఎంత ఉన్నదో, పైన ఎంత ఉన్నదో తెలుసుకునే సామగ్రిని ఉంచేరు. ఇంకా అక్కడ మంటలు ఆరిపోలేదని చెబుతున్నారు.
ఈ క్రింది ఫోటోలు టౌన్ కాలక ముందు తీసినవి. తారీఖు తెలుపలేదు.

ఈ కుక్కలు నిజమైన స్నేహితులు.....ఫోటోలు


Saturday, April 28, 2012

అట్టపెట్టలతో చేసిన బొమ్మలు.....ఫోటోలు

ప్రస్తుతం ఇటాలీలో ఉంటున్న ఇంగ్లాండ్ దేశస్తుడు క్రిస్ గిల్మొరే అట్టపెట్టలతో(cardboard), బంకను(gum) మాత్రమే ఉపయోగించి చేసిన బొమ్మలు.

పిల్లి ఒడిలో భయంలేకుండా పడుకున్న ఎలుక...వీడియో


Friday, April 27, 2012

చరిత్రకెక్కిన ప్రపంచ రికార్డులు...ఫోటోలు

ప్రపంచంలోనే ఖరీదైన స్టేడియం...న్యూ వెంబ్లే స్టేడియం,ఇంగ్లాండ్...ఖరీదు:1.6 బిల్లియన్ డాలర్లు
ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్ కవేటర్...జర్మనీకి చెందిన క్రుప్ కంపెనీ తయారుచేసింది. బరువు 45,500 టన్నులు. ఎత్తు 95 మీటర్లు. వెడల్పు 215 మీటర్లు.
ప్రపంచంలోనే మొట్టమొదటి పెద్ద బస్సు....జెర్మనీ, 2 ఇన్ 1 డబుల్ డెక్ బస్సు, 170 మంది ప్రయాణం చేయవచ్చు.
ప్రపంచంలోనే పెద్ద షిప్... MS Freedom of the seas…4,300 మంది ప్రయాణం చేయవచ్చు.
ప్రపంచంలోనే అతి పెద్ద విమానం.....ఏర్ బస్ A380.....555 మంది ప్రయాణంచేయవచ్చు.
ప్రపంచంలొనే వెడల్పైన వంతెన.....సిడ్నీ హార్బర్ వంతెన,ఆస్ట్రేలియా. 16 లేన్లు. క్రింద 8 పైన 8 లేన్లు.
ప్రపంచంలోనే పొడవైన వంతెన....డోంగై వంతెన, చైనా.32.5 కిలోమీటర్లు.
ప్రపంచంలొనే అతిపెద్ద ఇండోర్ స్విమ్మింగ్ పూల్... World Water Park. కెనడా. 5 ఎకరాలు.
ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం.... Christ The Redeemer విగ్రహం..బ్రెజిల్.
ప్రపంచంలొనే అతిపెద్ద షాపింగ్ మాల్....సౌత్ చైనా మాల్...6 అంతస్తులలో 8,92,000 చదురపు మీటర్లకు షాపులు
ప్రపంచంలోనే పెద్ద హోటల్... MGM Grand Hotel, లాస్ వేగాస్.....6,276 రూములు.
ప్రపంచంలొనే పెద్ద రాజభవనం....పార్లమెంట్ భవనం, బుచారెస్ట్, రొమేనియా...500 బెడ్ రూములూ, 55 వంట గదులూ, 120 మీటింగ్ హాల్లు.

Thursday, April 26, 2012

స్వాతంత్రం రాకముందు భారత దేశ జెండాలు....ఫోటోలు

1906 కలకత్తా జెండా అంటారు...మధ్యలో "వందేమాతరం" అని దేవనగిరి భాషలో రాసుంటుంది.
1907
1907
1917... home rule movement.
1921...గాంధీ గారి జెండా...ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో పరిచయం చేయబడింది.
1923 నుండి 1947 వరకు "స్వరాజ్ జెండా"
1942 నుండి 1945 వరకు....ఫ్రీ ఇండియా ప్రొవిషనల్ జెండా
1947 నుండి........ప్రస్తుతం
source:..Wikipedia