Sunday, March 4, 2012

ఈ స్కూల్లో పిల్లలను చేర్చాలంటే ఇంట్లో "టీవీ" ఉండకూడదట...!!!

తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో ఉన్న ఒక పేరు పొందిన కిండర్ గార్డన్ స్కూల్ అడ్మిషన్ ఫారంలో అతి ముఖ్యమైన కండిషన్ "నో టీవీ అట్ హోం". అడ్మిషన్ ఫారంలోని ఈ కండిషన్ దగ్గర "ఎస్" అని టిక్కు పెట్టిన అడ్మిషన్ ఫారంలను మాత్రమే అడ్మిషన్ కన్సిడరేషన్ కు తీసుకుంటారట.

"నిజమే. ఇంట్లో టీవీ లేకపోవడం అనేది పిల్లలమీద మనం పెట్టిన ఒక అతి పెద్ద పెట్టుబడి.ఈ పెట్టుబడి వలన పిల్లలు చైల్డ్ హుడ్ స్వాతంత్రయం పొందుతారు.ఇది వారి లర్నింగ్ ప్రోసస్ ని పటిష్ఠంగా ఉంచుతుంది. అది వారి జీవిత ఆదర్శాలకు బాగా ఉపయోగపడుతుంది" అని ఒక పేరంట్ అన్నారు.

"టీవీలో చూసే విషయాలు పిల్లల మనసులలో బలంగా నాటుకుపోతుంది.ఈ రోజు టీవీలలో వాయిలన్స్ ఎక్కువగా చూపిస్తున్నారు.పిల్లలుచూసే ప్రొగ్రాంలలో కూడా హింసాత్మక ఘటనలు చూపిస్తున్నారు. మధ్యలో వేసే వ్యాపర ప్రకటనలు పిల్లలకు అవసరంలేని,పెద్దలకు మాత్రమే అవసరమైనవి వేస్తున్నారు. పిల్లలు చూసే కార్టూన్ ప్రొగ్రాంలలో కూడా "రెవెంజ్" అనేదే మూలకధగా ఉంటోంది. ఇవి పిల్లల మనసులపై అత్యధిక ప్రభావం చూపిస్తుంది. " అని ఒక సైకాలజిస్ట్ అన్నారు."టీవీ తీసేస్తున్నాను అని చెప్పినప్పుడు నా తల్లితండ్రులు నాకు ఎదురుచెప్పేరు.మేము చూస్తున్న సీరియల్స్ వదులుకోలేమని వాదించేరు.కానీ బలవంతంగా తీసేసేను.ఆ తరువాత వారు ఇప్పుడు మనవులతో కాలక్షేపం చేస్తున్నారు. అది వారికి ఎంతో హాయినిస్తోంది. నా పిల్లలకు కూడా నా తల్లితండ్రుల మీద అభిమానం,ప్రేమ,మర్యాద పెరిగింది" అని ఒక చ్చార్టడ్ అకౌంటంట్ అన్నారు.

"సీరియస్ ఆక్సిడెంట్ జరిగినా చోటా బీం కు ఎందుకు దెబ్బలు తగలవు? అని మా అబ్బాయి అడిగిన ప్రశ్నతో టీవీలు పిల్లలను మరో ప్రపంచానికి తీసుకువెడుతున్నాయి.వారు జీవితాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు అని గ్రహించేను" అని మరో తండ్రి చెప్పేడు.

టీవీలు అమ్మే షో రూం పెట్టుకున్న ఒక పేరంట్ "నేను నా షోరూంలోని టీవీలతో పాటూ నా ఇంట్లో టీవీని కూడా అమ్మేసేను. నా 3 ఏళ్ల కూతురు తనకు ఇష్టమైన ప్రోగ్రాం టీవీలో వస్తేనే అన్నం తింటానని మొండికేసిది.తన అన్నయ్యతో ఆడుకునేది కాదు.అప్పుడు గ్రహించేను పిల్లలిద్దరూ అన్ రియలిస్టిక్ అప్రోచ్ తో జీవితాన్ని గడుపుతున్నారు. టీవీలు పిల్లల ఆలొచనా శక్తిని,మిగిలినవారితో కలిసిపోవాలన్న ఆలోచనలనూ పాడుచేస్తోంది. వెంటనే మా టీవీని అమ్మేసేను.మొదట్లో కొంచం కష్టం అనిపించినా ఇప్పుడు హాయిగా ఉన్నది.పిల్లలిద్దరూ కలిసి ఆడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు,పైంటింగ్ చేసుకుంటున్నారు. దీనివలన వారికి శరీర వ్యాయామం దొరుకుతోంది.హెల్తీగా ఉంటున్నారు"

ఇలా ప్రతి పేరంటూ ఆ కిండర్ గార్డన్ స్కూల్ పెట్టిన "నో టీవీ అట్ హోం" అనె కండిషన్ను సపోర్ట్ చేసేరే గాని ఎవరూ ఎదురు చెప్పలేదు, ఎటువంటి గోల చేయలేదు.

4 comments:

 1. నిజమె, ఈ రోజులలో టీవీల వలన వచ్చే దుష్‌పరిణామాలను దృష్టిలో వుంచుకొంటే ఈ నిర్ణయం మంచిదే......పిల్లలకి ఇది శిక్షణలో భాగమే కానీ, మనకి మనంగా దీనిని నియంత్రించుకోలేక వినోదం కూడా ఒక చెడ్డ అలవాటే అన్నంతగా చేసుకొన్న మనని ఎవరు శిక్షించి శిక్షణ ఇస్తారూ...? నియంత్రించే బదులు తొలగించటమే మందా...?

  ఒక చెంప ఉమ్మడికుటుంబాలు పోయి, డబ్బు మాయలో [యావలో] పడి ఎవరి దారిన వారు ఉద్యోగాలకి పోయే తల్లిదండ్రులు, వారిని పిల్లల సంరక్షణా కేంద్రాలలో వదిలి పోయే తల్లిదండ్రులు.....ఇలా ఎవరిదారిన వారు పోతే పిల్లలకి వికాసం మాట అటుంచి కనీసం "మాటలు" కూడా సరిగ్గా రాని పరిస్థితి ఏర్పడుతున్నది. ఆ కొరతను ఎంతలేదన్న టీవీలే పోషిస్తున్నాయన్నది నా ఉద్దేశం.

  కాబట్టి, పిల్లలని కోళ్ళ ఫాంలో గుడ్లు పెట్టే కోళ్ళలాగా చూడకుండా...., పిల్లలే టీవీలను పూర్తిగా త్యాగం చెయ్యాలన్న పెద్దల స్వార్ధ బుద్ధితో కాకుండా....... తల్లో, తండ్రో ఎవరో ఒకరు పిల్లల కోసం త్యాగం చేసి వారి సంరక్షణ పట్ల శ్రద్ధవహిస్తే........ఆ పిల్లలే పెద్దైన తరవాత పెద్దలను "వృద్ధాశ్రమంలో" పడేస్తే పోలా అనే "త్యాగం" చెయ్యకుండా ఉంటారు.

  ReplyDelete
 2. ee school ekkada vundi, school peru vanti vivaraalu dayachesi ivvagalaru.

  ReplyDelete
  Replies
  1. గీతా_యశస్వీ గారికి,

   ఈ కిండర్ గార్డన్ స్కూల్ కోయంబత్తుర్ లోని సివానందా కాలనీలో ఉన్నది. పేరు ఎల్లో ట్రైన్ కిండర్ గార్డన్.

   మీకోసం

   Delete