Sunday, March 25, 2012

తల ఒక దేశంలోనూ, కాళ్లు ఒక దేశంలోనూ పెట్టుకుని పడుకోవాలంటే ఈ హోటల్లో బస చేయాలి...ఫోటోలు

హోటల్ ఆర్బెజ్ ఫ్రాంకో-సుసీ అనే ఈ 2 స్టార్ హోటల్ లాకూర్ అనే ఒక సరిహద్దు గ్రామంలో ఉన్నది. ఈ సరిహద్దు గ్రామమ స్విజర్లాండ్ దేశానికి, ఫ్రాన్స్ దేశానికి సరిహద్దు. ఈ గ్రామంలో కట్టబడిన హోటల్ ఆర్బెజ్ ఫ్రాంకో-సుసీ సగం స్విజర్లాండ్ దేశంలోనూ, మరో సగం ఫ్రాన్స్ దేశంలోనూ ఉన్నది. చూడటానికి మామూలు హోటల్ లాగా ఉండే ఈ హోటల్ ఈ తేడాలవలన ప్రక్యాతి చెందింది. బహుశ ప్రపంచంలోనే 2 దేశాల అంతర్జాతీయ సరిహద్దులలో ఉన్నటువంటి భవనం ఇది మాత్రమే.

దీనికి చాల చరిత్ర ఉన్నది. 1862 లో సిజర్లాండ్ ప్రభుత్వమూ, ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశ సరిహద్దులను సరిచేసుకున్నారు.అప్పుడు ఇరుదేశాలూ వేసుకున్న ఒప్పందంలో ముఖ్య అంశం ఏమిటంటే సరిచేసుకున్న సరిహద్దులో ఉన్నటువంటి భవనాలు అలాగే ఉండాలని, వాటిని ఏమీచేయకూడదని. ఆ సమయాన మాన్సియర్ పోంతస్ అనే ఒక బిజినస్ మాన్ కు ఒక స్థలం ఉన్నది. అందులో సగం భాగం స్విజర్లాండ్ లోనూ, సగం ఫ్రాన్స్ లోనూ ఉన్నది. ఓప్పందం సంతకాలు అయ్యేలోపు ఆ బిజినస్ మాన్ తన స్థలంలో హోటల్ కట్టేడు.అందువలన ఆ హోటల్ ను ఏమీచేయలేదు.1921 న జ్యూల్స్ జీన్ ఆర్బెజ్ అనే ఆయన ఈ హోటల్ ను కొనుక్కుని దానికి ఆర్బెజ్ ఫ్రాంకో-సుసీ అని పేరు పెట్టేడు.











6 comments:

  1. brazil ? But it is switzerland..?

    ReplyDelete
    Replies
    1. Sujata gaariki,

      Yes it is switzerland...not brazil..I have corrected the mistake.

      మీకోసం

      Delete
  2. మీరు చాలా శ్రమ తీసుకుని మంచి సమాచారమిస్తున్నారు.కానీ...కొన్ని సార్లు సమాచారంలో చిన్న చిన్న పొరబాట్లు దొర్లుతూనే ఉన్నాయి.ఈ సంగతి గతం లో కూడా మీకు రాసాను.ఈ టపాలో ఫ్రాన్సు పక్క దేశం బ్రిజిల్ అన్నారు.అసలా పేరుతో యే దేశమూ లేదు.ఉంది బ్రెజిల్ అది సౌత్ అమెరికాలో ఉంది.ఫ్రాన్సు ఇరుగుపొరుగు దేశాలు....
    Metropolitan France has land borders with:

    Andorra,
    Belgium,
    Germany,
    Italy,
    Luxemborg,
    Monaco,
    Spain and
    Switzerland. While French Guiana is bordered by Brazil and Suriname.
    France's neighboring countries are Germany Italy Spain Monaco Belgium Andorra Switzerland and Luxemburg
    http://wiki.answers.com/Q/Nearest_neighboring_countries_of_France

    ReplyDelete
    Replies
    1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారికి,
      క్షమించాలి.స్విజర్లాండ్ మరియూ ఫ్రాన్స్ సరిహద్దులో ఉన్న హోటల్ అది.రెండు రోజులుగా బ్రిజిల్ మీద ఒక ఆర్టికల్ ప్రిపార్ చేస్తున్నాను. దాంట్లో ఎక్కువసార్లు బ్రిజిల్ అని టైపుచేయడంతో ఈ టపాలో కూడా స్విజర్లాండ్ కు బదులు బ్రిజిల్ అని టైపుచేసేను. ఇప్పుడే టపాను ఎడిట్ చేసేను.

      మీకోసం.

      Delete
  3. అంతా బావుంది కాని... 6వ ఫోటోలో ' బార్ 'ను ' బ్రాసరీ 'అనడం నాకంతగా నచ్చలేదు. అవిరెండూ వేరేనేమో అని నా అనుమానం. :) భాణపు గుర్తుల్లో తేడాలున్నాయి.

    ReplyDelete
  4. The CERN campus in Geneva is also partially in Switzerland & partially in France.

    ReplyDelete