Tuesday, March 13, 2012

రైల్వే వసతి లేని కొన్ని దేశాలు...ఫోటోలు

ఈ దేశాలు విశాలమైన దేశాలైనా జనాభా తక్కువగా ఉన్న దేశాలు.లిబియా,ఓమన్ మరియూ ఐస్ లాండ్ దేశాలు తప్ప మిగిలిన దేశాలు పేద దేశాలు.జనాభా తక్కువగా ఉన్నందువలనో లేక పేద దేశాలైనందువలనో లేక ఈ రెండు కారణాలవలనో ఈ దేశాలలో ఇంకా రైల్వే సిస్టం చోటుచేసుకోలేదు.

బూటాన్... 1961 వరకు బూటాన్ లో రోడ్లే సరిగ్గా వేయలేనందున అక్కడి ప్రజలు కాలి నడకనే ఊర్లకు వెళ్లేవారు.భారత సరిహద్దు నుండి బూటాన్ సరిహద్దు ప్రాంతమైన థింపూ(205 కిలోమీటర్లు) కూ వెళ్ళటానికి 6 రోజులు పట్టేది.38,394 చదురపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్న బూటాన్లో ప్రస్తుతం 8000 కిలోమీటర్ల దూరానికి రోడ్లు ఉన్నాయి, 2 విమానాశ్రయాలున్నాయి.కానీ రైల్వే వసతి లేదు.

ఐస్ లాండ్...ఈ దేశంలో ప్రభుత్వ రైల్వే వసతి లేదు.రైల్వే వసతి కల్పించాలని ఎన్నోసార్లు ఆలోచనలు చేసేరు గానీ వేయలేదు.అంతకు ముందు ప్రైవేట్ గా కొన్ని బొగ్గుతో నడిచే రైలు ఇంజెన్లు, చేతితో నడిపే రైల్లు ఉన్నట్లు సూచనలు ఉన్నాయి గాని అవి మ్యూజియంలలోనూ, ఎక్జిబిషన్లలోనూ ఉన్నాయి.

ఓమన్...ఈ దేశంలో నిజమైన రైల్వే వసతి లేదు. తమ దేశంలోనూ, ప్రక్క దేశాలకు వెళ్లటానికి రైల్వే వసతి చేసుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేసుకున్నారు గాని ఆచరనలో పెట్టలేదు.కానీ ఈ దేశంలో టూరిస్ట్ రైలు ఉన్నది.ఆ దేశంలో ఉన్న ఒక గుహలోకి టూరిస్టులను తీసుకువెళ్లడానికి(4 నిమిషాల ప్రయాణం)వేసేరు.

పాపూ న్యూ గుయ్నే....పూర్తిగా కొండ ప్రదేశం కాబట్టి రైల్వే వసతి లేదు. ప్రక్కనున్న గ్రామాలకు వెళ్లాలంటే నడిచే వెడతారు.కొండ పైన ఉన్న గ్రామలకు వెళ్లాలంటే చిన్న విమానాలు వాడతారు.కానీ ఈ దేశంలో ఉపయోగంలోలేని కొన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. అవి ఈ దేశం జర్మనీ కాలనీగా ఉన్నప్పుడు వేసినవి. వాటిని ఎవరూ వాడటంలేదు.

ఏమెన్...పేదరికంతో బాధ పడుతున్న ఈ దేశం ట్రాన్స్ పోర్ట్ మరియూ కమ్యూనికేషన్ వసతులకు దూరంగా ఉన్నది. రోడ్ల వసతులనే ఇంకా మెరుగు పరుచుకోవలసి యున్న ఈ దేశంలో రైల్వే వసతికి ఆలోచనే కష్టమట.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్.....ఈ దేశంలో 2002 లో తమదేశంలోని రాజధానికి మరో నగరానికి రైల్వే లైన్ వేయాలనుకుని ప్రయత్నాలుచేసేరు.

సొమాలియా....ఈ దేశంలో 1910 లో ఇటాలీ వారు కొంత దూరం వరకు రైల్వే వసతి కల్పించేరు. కానీ 1940 లో బ్రిటీష్ వారు దానిని డిస్మాంటల్ చేసేరు.

నైజర్.....ఈ దేశంలో రైల్వే వసతి లేదు. కానీ వీరు వారి సరిహద్దు దేశాలలోని బెనిన్ మరియూ టొగొ రైల్వే వసతులను సరకుల రవాణాకు ఉపయోగించుకుంటారు.

చ్చాడ్....ఈ దేశంలో ఈ సంవత్సరమే(2012) రైల్వే వసతికి పనులు మొదలుపెట్టెరు.పూర్తి కావడాని 4 ఏళ్లు పడుతుంది.

లిబియా...ఎన్నో రైల్వే లైన్లు ఉన్న ఈ దేశంలో 1965 నుండి వాటి ఉపయోగం నిలిపివేయబడింది. 2008 మరియూ 2009 లో వీటిని పునరుద్దించాలనే ప్రయత్నాలు జరిగినై.2011 లిబియన్ సివిల్ వార్ వలన అన్ని ప్రయత్నాలు ఆపబడ్డాయి.

No comments:

Post a Comment