Wednesday, March 21, 2012

వింత ప్రవాహము గల ఫండీ ఖాతము...ఫోటోలు మరియూ వీడియో

ఫండీ ఖాతము ఉత్తర అమెరికాలోని అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక భాగము. అట్లాంటిక్ మహాసముద్రంలోని నీరు ఈ ఖాతములోకి రోజుకు రెండు సార్లు మాత్రమే ప్రవహిస్తుంది. ఒక సారి అతి ఎక్కువ నీరుతో, మరో సారి అతి తక్కువ నీరుతో.ఇలా 24 గంటలకు ఒక సారి(అంటే రోజుకు ఒకసారి) జరుగుతుంది. ఎక్కువ ప్రవాహముతో వచ్చే నీరు ఎంత ఉంటుందంటే ప్రపంచములోని అన్ని మంచి నీటి నదులలో ఎంత నీరు ఉన్నదో అంత నీరు వస్తుంది. మరో సారి వచ్చే ప్రవహంలో నీరు అతి తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ చోటు ఎండిపోయిన నీటి ప్రదేశముగా కనబడుతుంది.ఇలా రెండు సార్లు వచ్చే నీటి ప్రవాహాల మధ్య సమయం సుమారు 6 గంటలా 13 నిమిషాలు ఉంటుంది.ఈ అతిశయమైన నీటి ప్రవాహాలను చూడటానికి అక్కడికి టూరిస్టులు చాలామంది వస్తారు.ప్రొద్దున నుండి సాయత్రం వరకు అక్కడ ఉండగలిగిన టూరిస్టులు ఈ రెండు ప్రవాహాలనూ చూడవచ్చు.

















1 comment:

  1. that's nothing but high tide & low tide.....The rocks which you have shown were hope well rocks. (moncton,Canada).

    ReplyDelete