Thursday, March 8, 2012

కొన్ని దేశాలలో పిల్లలు పుట్టిన తరువాత జరుపుకునే ఆచారాలు...ఫోటోలు

మనదేశంలో పిల్లలు పుట్టిన తరువాత జరిపే ఆచార వ్యవహారాలు మనలొ చాలామందికి తెలిసుంటుంది. ఈ క్రింది దేశాలలొ వారి ఆచారాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

నెదర్లాండ్:.... బిడ్డ పుట్టిన వెంటనే ఏ బిడ్డ పుట్టిందో తల్లికి తప్ప మరెవరికీ తెలుపకూడదు. ఈ దేశంలో పురుడు పోసె ముందు, పురుడు పోసిన తరువాత ఆ హాస్పిటల్ నర్స్ కు ఎక్కువ పాత్ర ఉంటుంది. బిడ్డను చూడటానికి వచ్చే వారిని ఈ నర్స్ గమనించి గౌరవించాలి.వారికి కావలసిన సదుపాయాలు చేయాలి.డచ్ ఆచారవ్యవహారాల ప్రకారం ఈ నర్స్ ఫలహారం తయారుచేయాలి.అది తీపి మిఠాయలు.రెండు రంగులతో చేయాలి.బ్లూ మరియూ తెలుపు, పింక్ మరియూ తెలుపు.బిడ్డను చూడటానికి వచ్చేవారికి ఈ నర్స్ బ్లూ మరియూ పింక్ మిఠాయలు అందిస్తే మొగ బిడ్డ పుట్టినట్లూ, పింక్ మరియూ తెలుపు మిఠాయలు అందిస్తే ఆడ బిడ్డ పుట్తినట్లూ తెలుసుకుంటారు.ఆ మిఠాయలు తీసుకునేంతవరకూ ఏ బిడ్డ పుట్టిందో వచ్చేవారికి తెలియదు.


జెర్మనీ....పుట్టిన పిల్లలకు తల్లితండ్రులు వారికి ఇష్టమైన పేరు పెట్టకూడదు. జెర్మన్ ప్రబుత్వం కొన్ని పేర్లను లిస్ట్ వేసి పెట్టేరు. తల్లితండ్రులు ఆ లిస్ట్ లోనుండి ఒక పేరు సెలక్ట్ చేసుకుని పెట్టాలి.ఆ లిస్ట్ లో లేని పేరు పెట్టదలుచుకుంటే ఆ తల్లితండ్రులు ప్రబుత్వానికి ఆ పెరు ఎందుకు ఎన్నుకున్నారో వివరణ అందజేయాలి. ప్రభుత్వం వారి వివరణను అంగీకరిస్తే ఆ పేరు పెట్తుకోవచ్చు. అంగీకరించకపోతే వారు పెట్తుకోదలచిన పేరు కాకుండా ప్రభుత్వ లిస్ట్ లో నుండే పేరు తీసుకుని పెట్టాలి.దీనికి ఒక ముఖ్య కారణం ఉన్నది.పేరు గనుక వ్యత్యాసంగా ఉంటే అక్కడ అందరూ ఆ పిల్లలను వెక్కిరించి ఆటపట్టిస్తారట. అది ఆ పిల్లలకు మానసిక ఒత్తిడిని ఇస్తుందనే అలా చేసేరట.

జపాన్....బిడ్డ పుట్టిన తరువాత మహిళలు వారి పుట్టింటికి ఖచ్చితంగా వెళ్లాలట. 21 రోజులు తల్లి మంచం దిగకూడదట.బంధువులూ, స్నేహితులూ మరియూ అతిధులూ తల్లీ బిడ్డలను అక్కడికి వచ్చే చూస్తారట. అలా వచ్చిన వారికి వారి ఆచారం ప్రకారం "ఒసెకిన్" అనే ఫలహారం పెడతారట. ఆ ఫలహారాం ఎర్ర బియ్యం మరియూ ఎర్ర బీన్స్ తో తయారుచేస్తారట.

బ్రెజిల్......ఈ దేశంలో కడుపుతో ఉన్న మహిళను మహారాణి లాగా చూస్తారట. బిడ్డ పుట్టి ఆమె హాస్పిటల్ వదిలి వెళ్లిన తరువాత ఆ బిడ్డను చూడటానికి భందువులూ, స్నేహితులూ వస్తే వచ్చిన వారు ఒక బహుమతి అందించాలి.చూడటానికి వచ్చిన వారికి ఆ బిడ్డ తల్లితండ్రులు బహుమతి అందిస్తారు.

టర్కీ.....ఈ దేశంలో బిడ్డ పుట్టేంతవరకూ మహిళలు పురిటి స్నానం చేయరట. బిడ్డ పుట్టిన 20 రోజుల వరకు చూడటానికి భందువులూ, స్నేహితులూ రారట. 21 రోజు నుండి వస్తారట. వచ్చినవారికి వారి ఆచారం ప్రకారం "లోహూసా సర్బేటీ" అనే విశేషమైన పానీయం ఇస్తారట.బిడ్డను చూడటానికి వచ్చేవారు బహుమతిగా ఒక చేతి రుమాలలో ఒక గుడ్డు మరియూ పంచదార బిల్లలూ చుట్టి తీసుకు వస్తారట. అలా తేస్తే ఆ బిడ్డ ఆరోగ్యంగానూ, మంచి నడవడికలోతోనూ పెరుగుతుందని వారి నమ్మకం.అలాగే బిడ్డ తలమీద, కళ్లమీద తెల్ల పిండి అద్దుతారు. ఇలా చేస్తే బిడ్డ దీర్ఘాయుషుగా ఉంటుందట.

చైనా....ఈ దేశంలో బిడ్డ పుట్టెంతవరకూ ఏ పేరూ సూచించ కూడదట. బిడ్డ పుట్టిన తరువాత ఒక నెల రోజులు ఆ తల్లికి ఎటువంటి పనులూ చెప్పరట. కొన్ని ప్రదేశాలలో భర్తను కూడా రానివ్వరట.బిడ్డ పుట్టిన తరువాత తండ్రి మాత్రమే బిడ్డ పుట్టిందని తెలియజేస్తాడట. భందువులకు డబ్బూ, వైన్ బాటిల్స్ పంపిస్తారట.అన్నిటికంటే ఆసక్తికరమైన విషయమేమిటంటే చైనా పిల్లలకు 5 రకాల పేర్లు ఉంటాయి.పిల్లలుగా ఉన్నప్పుడు ఒకటి,ఎలిమంటరీ స్కూలుకు వెళ్లెటప్పుడు ఒకటి, హై స్కూల్కు వెళ్లేటప్పుడు ఒకటి,కాలేజీకి వెళ్ళిన తరువాత ఒకటి, చనిపోయిన తరువాత ఒకటి.

No comments:

Post a Comment