Thursday, March 29, 2012

రోజువారి జీవితాన్ని మార్చిన వెబ్ సైట్లు...ఫోటోలు

ఇంటర్నెట్ వలన మానవుల జీవిత విధానం మారిందని అందరికీ తెలుసు. ఇంటర్నెట్ వచ్చిన తరువాత మనం "చేయలేనిది" అంటూ ఏమిలేదు అని చెప్పవచ్చు. ఈనాటి ప్రపంచంలో మనల్ని నడిపించేది టెక్నాలజీ మరియూ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఏప్పటికప్పుడు తాజా మార్పులతొ పెంచుకుంటూ పోవడం. ఇది ముగింపులేని అధ్యాయం.ఇదే వాస్తవం. మన రోజువారి జీవితంలో ఇంటర్నెట్ ఒక భాగం అని చెబితే ఆశ్చర్యపోనక్కరలేదు.అమెరికాలో మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 26,62,24,500 మంది. ఆసియా ఖండంలో 82,50,94,396 మంది వాడుతూంటే ప్రపంచవ్యాప్తంగా 196,65,14,816 వాడుతున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.ఇంటర్నెట్ తో పాటూ కొన్ని మిల్లియన్ల వెబ్ సైట్లు రావడం, వాటిని మనం వాడటం జరుగుతోంది.కొన్ని వెబ్ సైట్లు ప్రజాదరణ పొందలేదు గానీ మిగిలినవి ప్రతిరోజూ కావలసినవైనాయి. 1992 లో ఇంటర్నెట్ ప్రజల ఉపయోగానికి వచ్చినా, గత కొద్ది సంవత్సరాల నుండే కొన్ని వెబ్ సైట్లు మానవుల జీవితాలలోకి చొచ్చుకుపోయినై.ఇప్పుడు ఆ వెబ్ సైట్లు మనం ఆన్ లైన్లో ఉన్నా లేక ఆఫ్ లైన్లో ఉన్నా మన వ్యవహార విధానన్ని మార్చేస్తున్నాయి. Craigslist.....క్లాసిఫైడ్ ఆడ్ ప్రకటనలు.....ఇంటర్నెట్ రాకముందు క్లాసిఫైడ్ ప్రకటనలను ఎక్కువమంది చూసేవారు కాదు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు లోకల్ న్యూస్ పేపర్ కొనుక్కుని చూసేవారు. ఈ వెబ్ సైట్ వచ్చిన తరువాత అవసరమున్నా లేకపోయినా, తెలుసుకోవడానికి, తెలుసుకుని ఉంచుకోవడానికి చాలామంది క్లాసిఫైడ్ ఆడ్ లు చూస్తున్నారు.
Geocities.....ఇంటర్నెట్ ప్రవేశాన్ని అందరికీ అందుబాటుగా ఉండేటట్లు చేసింది.....ఈ రోజు ఇంటర్నెట్ లోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. కాని వెనుకటి రోజులలో, అంటే ఇంటర్నెట్ ప్రజల అందుబాటులోకి వచ్చినప్పుడు దానిని టెక్నాలజీలో ప్రతిభ కలిగినవారూ, శాస్త్రవేత్తలూ మాత్రమే ఎక్కువగా వాడేవారు. వారు కూడా ఇంటర్నెట్ టెక్నాలజీలో తప్పులను సవరించడానికీ, టెక్నాలజీ అభివ్రుద్ది చేయడానికీ వాడేవారు.ఓప్పుడు ఇంటర్నెట్ విరసంగానూ, ఒట్టి గానూ ఉండేది.ఆ తరువాత మెల్లమెల్లగా వెబ్ సైట్లు పెరిగినై.ఇంటర్నెట్ కు వెళ్లే ప్రజల సంఖ్య కూడా మెల్లమెల్లగా పెరిగింది. అప్పుడు జియొసిటీస్ నిర్మితమైనది.మొదట, అంటే 1994 లో దీనిని బెవెర్లీ హిల్స్ ఇంటర్నెట్ అనే వారు. ఈ కంపెనీ ప్రజలకు ఉచిత సేవలను అందించింది. మొదట వారి ప్రాంతం వరకు సేవలు అందించినా ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉచిత సేవలు అందించింది. దీని తరువాత చాలా వెబ్ సైట్లు ఉచిత సేవలు అందించడం మొదలుపెట్టినై.
Blogger....బ్లాగింగ్ శాలను మార్చేసింది.....బ్లాగింగ్ ప్రపంచ మర్గాన్నే మార్చేసింది.నోటు పుస్తకాలలోనూ, డైరీలలోనూ , పేపర్ ముక్కలపైన ఇప్పుడేవరికీ రాసుకోవలసిన అవసరంలేదు.లాగ్ ఇన్ అయ్యి అభిప్రాయాలను, ఆలోచనలనూ కంప్యూటర్లో టైపుచేసి అప్లోడ్ చేస్తే ప్రపంచమంతా మీ ఆలొచనలనూ,అభిప్రాయాలనూ తెలుసుకుంటుంది.1999 లో మొదలుపెట్టబడిన బ్లాగర్ బ్లాగింగ్ ప్రపంచాన్ని ఘనంగా వర్ధిల్లచేసింది. లైఫ్ జర్నల్ మరియూ మరికొన్ని బ్లాగింగ్ వెబ్ సైట్లు బ్లాగింగ్ ప్రపంచాన్ని అభివ్రుద్ది చేసేమని చెప్పుకున్నా బ్లాగర్ కే మొదటి స్థానం ఇవ్వాలి.బ్ల్లగర్ గూగుల్ తో కలిసి పనిచేయడం మొదలుపెట్టిన తరువాత చాలా పాపులర్ అయ్యింది.రోజుకు 388 మిల్లియన్ల పదాలతో, అలెక్సా స్కేలులో 8 వ ర్యాంక్ లో ఉన్నది.
Pandora....మ్యూజిక్ వినే విధానాన్ని మార్చింది....MP3,MP4 మరియూ మరెన్నో రకాలుగా మ్యూజిక్ వినే పరికరాలు వచ్చినా మనం ఇంటర్నెట్ సర్ఫ్ చేసుకుంటూ ఆన్ లైన్ లో పాటలు వినడాన్ని ప్రవెశపెట్టింది.దీనిని ఆన్ లైన్ రేడియో స్టేషన్ అని చెప్పవచ్చు.
Facebook....ఇది మన పరస్పర ప్రతిస్పందనల విధానాన్ని మార్చింది...టెలిఫోన్,పేజర్,సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఇన్ స్టంట్ మెసేజింగ్,చాట్ రూంస్...వీటన్నిటికంటే ముందు ఉత్తరాలు రాసుకోవడం. ఇప్పుడు ఫేస్ బుక్.ఈ సోషియల్ నెట్ వర్కింగ్ సైట్ ప్రపంచాన్ని తుఫాన లాగా ఊపేసింది.ఇది మొదటి సోషియల్ నెట్ వర్క్ సైటు కాకపోయినా ప్రజలలో ముద్ర వేసుకున్నది.ఈ రోజు ఫేస్ బుక్ లేనిదే పనిజరగటంలేదు. ప్రతిదానికీ ఫేస్ బుక్. ఫేస్ బుక్ లో వేసేను, ఫేస్ బుక్ లో రాసేను, ఫేస్ బుక్ చూడు, చూడండి ఇలా ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్ అంటున్నారు.
Wikipedia....రీసెర్చులనూ, నేర్చుకోవడాన్నీ మార్చింది......వికీపీడియా రాక ముందు హైస్కూల్ విధ్యార్ధులూ, కాలేజీ విధ్యార్ధులూ సమాచారం సేకరించుకోవడానికి చాలా కష్టపడేవారు. వికీపీడియా రాకముందు, ఈ-ఎన్ సైక్లోపీడియా ఉండేది. దీనినుండి సమాచారం తీసుకోవాలంటే డబ్బులు కట్టవలసి వచ్చేది.అయినా ఒక్కోసారి కావలసిన సమాచారం దొరికేది కాదు. వికీపీడియా వచ్చిన తరువాత సమాచారం వెతుక్కోవడం అందరికీ సులభమయ్యింది. ఉచిత ఈ-ఎన్ సైక్లోపీడియా కావటం వలన అందరికీ అందుబాటులో ఉన్నది.ఏప్రిల్ 16,2010 న మొదలుపెట్టబడిన ఈ వెబ్ సైట్ ఒక బిల్లియన్ ఎడిట్ లతో అలెక్సా 7 వ స్థానం పొందింది.అద్భుతమైన విషయమేమిటంటే వికీపీడియాలో దొరకని సమాచరం ఉండదు. ప్రస్తుతం 34,10,052( రోజూ ఈ సంఖ్య పెరుగుతూ) ఆర్టికల్స్ తో,అనేక భాషలో ప్రచురిత మౌతొంది.
Amazon....రీటైల్ షాపింగ్ విధానాన్ని మార్చింది...మన దేశంలో ఇంకా పూర్తిగా మార్చకపోయినా, చాలా దేశాలలో మార్చింది.ఏ వస్తువైనా, ఎన్ని రకాల వస్తువులైనా ఒకేచోట కొనుక్కునే ఏర్పాటుచేసింది.
YouTube....ప్రతిరోజూ ఎంటర్ టైన్మెంట్ విధానాన్ని మార్చింది.....ఒకప్పుడు వీడియోలను చూడాలనుకున్నప్పుడు పెద్దగా సదుపాయం ఉండేది కాదు.ఇతరులు తమ వీడియోలను చూడాలని ఎవరైనా వీడియోను అప్ లోడ్ చేస్తే బాండ్ విడ్త్ చాలని కారణంగా చూడలేకపోయేవారు.కానీ 2005 లో యూట్యూబ్ దీనిని పరిష్కరించింది.ఈ రోజు యూట్యూబ్ చూడని వారు తక్కువనే చెప్పాలి.
eBay....ఈ వెబ్ సైట్ అమ్మటం,కొనటం విధానాన్నే మార్చింది. ....ఆన్ లైన్ షాపింగ్ విధానంలో కొత్త మార్పు తెచ్చింది.సెంటు బాటిల్స్, గుడ్డలూ, షూ, ఇలా ఎన్నో వాటిని మనకు కావలసిన ధరకు కొనుక్కునే అవకాసం, ఏ వస్తువునైనా అమ్ముకునే అవకాసం అందించింది.
Google....అన్నిటినీ మార్చింది.... ఇంటర్నెట్ తెరిస్తే గూగుల్ కనబడని చోటే ఉండదు. మనం దేనికోసమైన వెదకాలనుకుంటే మొదట ఇక్కడే మొదలుపెడతాం. గూగుల్ సర్వీస్ ను ఉపయోగించుకోనివారు ఉండరు.

1 comment:

  1. hii.. Nice Post Great job.

    Thanks for sharing.

    Best Regarding.

    More Entertainment

    ReplyDelete