Wednesday, March 28, 2012

తిరుమలలో స్వామి వారి దర్శనం తొందరగా చేసుకునేదెలా?

తిరుమలలో స్వామి వారి కళ్ళకు భక్తులందరూ ఒకటే. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్లకు మాత్రం భక్తులు రెండు వర్గాలు. సాధారణ భక్తులు మరియూ వి.ఐ.పి భక్తులు. వారు సాధారణ భక్తులకంటే వి.ఐ.పి భక్తుల మీద ఎక్కువగా శ్రద్ద చూపుతారు. మార్చ్ 18 వ తారీకున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తులు పెద్దగా నినాదాలు చేసేరు.కారణం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసిం హన్ గారు స్వామివారి దర్శనార్ధం గుడిలో ఉన్నారు. అందువలన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని భక్తులు బలవంతంగా వేచియుండవలసి వచ్చింది. ఎంతసేపు అలా సాధారణ భక్తుల క్యూ ని ఆపేరో తెలియదు గానీ, క్యూ లోని భక్తుల నినాదాలు వింటే వారు చాలా సేపటినుండి వేచి ఉన్నారని ఎవరికైనా అర్ధమైపోతుంది. గవర్నర్ నరసిం హన్ గారు గత రెండున్నర నెలలో 6 సార్లు స్వామి వారి దర్శనముకు తిరుమల వచ్చేరు.జనవరి 8,29, ఫిబ్రవరి 5,6 మరియూ మార్చ్ 18,19 వ తారీకులలో తిరుమలకు వచ్చేరు.ఆయన్ తిరుమలకు ఎప్పుడువచ్చినా సాధారణ భక్తులకు కష్టాలే.
వి.ఐ.పి దర్శానార్ధం సాధారణ భక్తుల దర్శనాన్ని ఆపుతారు. దీనిని వి.ఐ.పి బ్రేక్ అంటారు. ఈ బ్రేక్ లో 1200 మందిని మాత్రమే అనుమతించాలి. అదిగూడా ప్రొద్దున కొంతమందిని, సాయంత్రం కొంతమందిని అనుమతించాలి. కానీ రోజుకు 3,000 నుండి 4,000 మందిని వి.ఐ.పి దర్శనంలో అనుమతిస్తున్నారట. దీని వలన సాధారణ భక్తులకు 3 నుండి 4 గంటలు ఆలశ్యం అవుతున్నది. నిజానికి ఈ వి.ఐ.పి భక్తులు ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం వారి కట్టుబాట్ల ప్రకారం వి.ఐ.పి ల లిస్ట్ చాలా పెద్దది. ఎం.పి, ఎం.ఎల్.ఏ, మంత్రులు, చీఫ్ మినిస్టర్లు,గవర్నర్లూ,ఆంధ్రప్రదేశ్ జడ్జీలూ, జిల్లా జడ్జీలూ, ఐ.ఏ.ఎస్ ఆఫీసర్లూ మరియూ కోటి రూపాయలు విరాలం ఇచ్చినవారూ,పరిరక్షణ సమితి. ఇందులో సినిమా వ్యక్తులూ,పారిశ్రామకవేత్తలూ,కార్పరేట్ అధికారులూ మరియూ క్రీడాకారులు కూడా ఉన్నారు.వీరందరినీ వి.ఐ.పి లుగానే చూస్తారు.ఈ వి.ఐ.పి లందరూ ఒక్కరోజే రాకపోయినా, ఒక్కొక్కరే వస్తే ఇబ్బంది ఉండదు.కానీ వీరంతా వారితో వారి పరివారాన్ని తీసుకువస్తారు. దీనితో సాదారణ భక్తులకు తిప్పలే.
పుండు మీద కారం జల్లినట్లు దీనికి తోడు వి.ఐ.పి ల రెకమండేషన్ ఉత్తరాలు. రెకమండేషన్ ఉత్తరం ఉన్న భక్తులను కూడా వి.ఐ.పి లుగానే చూస్తారు.ఈ వి.ఐ.పి ఉత్తరాలు నిజమైనవో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరట. వి.ఐ.పి ఉత్తరాలను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. ఒకసారి పారిశ్రామకవేత్త విజయ్ మల్లయ్య వచ్చినప్పుడు ఆయన స్వామివారిని దర్శనం చేసుకోవటం కోసం సాధారణ భక్తులకు 2 గంటలసేపు దర్శనం ఆపేరట. కనుక మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఒక వి.ఐ.పి రెకమండేషన్ ఉత్తరం సంపాదించుకోండి. స్వామి వారి దర్శనం తొందరగ చేసుకోండి.

7 comments:

  1. వి.ఐ.పి దర్శనాలు స్టాప్ చేయాలి.. అయిన అలా (వి.ఐ.పి) వెళ్లేవారికి తెలియాలి మనం ఎంత పాపం చేస్తున్నామో అని ..

    ReplyDelete
  2. "సాదారన" ను సాధారణగా మార్చండి.

    ReplyDelete
    Replies
    1. చిలమకూరు విజయమోహన్ గారికి

      మీరు చెప్పినట్లు మార్చేను.


      మీకొసం

      Delete
  3. ఈ వి ఐ పి లను చూడ్డానికి క్యూ లైన్లలో తొక్కిసలాటలు ఒక బోనస్.
    భక్తులు మాత్రం, గుడిలో నైనా దేవుడి మీద ధ్యాస పెట్టలేరా?

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  5. Stop the VIP Recommendation Letters and decrees the VIP Darshan from 1200 to 400 daily and implemented strictly.

    Seshu-Bhadrachalam

    ReplyDelete