Tuesday, March 27, 2012

అసాధారణమైన/అపూర్వమైన వంతెనలు...ఫోటోలు మరియూ వీడియో

ఉత్తమమైన నిర్మాణ సాధనలో అతి ఉత్తమమైనవి ఇవి.

Kawazu-Nanadaru Loop Bridge, Japan...1.1 కిలోమీటర్ పొడవుకు, 80 మీటర్ల వెడల్పుతో రెండు స్పైరల్ గా కట్టేరు

Wind-Rain Bridge, China....దీనిని ఫెంగ్యూ వంతెన అని కూడా అంటారు

Ponte Vecchio, Italy.....ఇది మధ్య యుగం నాటి వంతెన. ఈ వంతెన మీద చాలా కొట్లు ఉన్నాయి. మొదట్లో కసావు అంగడులు ఉండేవి.ఆ తరువాత బాంగారు నగల కొట్లు, ఫాన్సీ షాపులూ ఉన్నాయట

Langkawi Sky Bridge, Malaysia.....410 అడుగుల పొడవు గల వంతెన.పాదచారులకు మాత్రమే కట్టబడినడి.సముద్ర మట్టానికి 2,300 అడుగుల ఎత్తులో కట్టబడిన ఈ వంతనకు వెళ్లాలంటే కేబుల్ కార్ల మూలంగానే వెళ్లాలి

Aiola Island Bridge, Austria.....ఆస్ట్రియాలోని ముర్ నది మీద కట్టబడినది.సన్ బాత్ చేయడానికి వీలుగా కట్టబడినది. ఈ వంతెనలో హోటల్ కూడా ఉన్నది

Tianjin Eye bridge, China....హైహే నది మీద కట్టబడిన ఈ వంతెనతో 120 మీటర్ల ఎత్తుకు జైంట్ వీల్ అమర్చేరు. ఇలా జైంట్ వీల్ తో కట్టబడిన వంతెన ప్రపంచంలోనే ఇది ఒక్కటేనని అంటారు

Henderson Waves, Singapore....900 వందల అడుగుల పొడవుగల ఈ వంతెన పాదచారులకోసం కట్టబడిన వంతెన


Tokyo Bay Aqua-Line, Japan.....వంతెన మరియూ టనల్ కలిగిన వంతెన.మొత్తం 14 కిలోమీటర్ల పొడవులో 4.4 కిలోమీటర్లు వంతెన,9.6 కిలోమీటర్లు టనల్


Falkirk Wheel, Scotland....రెండు నదులను కలిపే వంతెన.ఒక నడి నుండి మరొక నదికి పడవలను పంపించడానికి వలయాకారంలో తిరిగే వంతెన.(వీడియో చూడండి)




Banpo Bridge, South Korea...రెండు జిల్లాలను కలిపే వంతెన.ఇది డబుల్ డెక్కర్ వంతెన.క్రిందది జంసూ వంతెన, పైనున్నది బాంపో వంతెన.నదిలో నీరు ఎక్కువైనప్పుడు క్రింద వంతెనను మూసేస్తారు.38 నీళ్ళ పంపులు కలిగినది.నిమిషానికి 190 టన్నుల నీటిని క్రింద నది నుండి తీసుకుని ఫౌంటన్ మూలం విరజిమ్ముతుంది (వీడియో చూడండి)




Magdeburg Water Bridge, Germany....బెర్లిన్ నగరంలోని హార్బర్లను కలపడానికి కట్టబడ్డ వంతెన

No comments:

Post a Comment