Thursday, March 22, 2012

గూగుల్ మ్యాప్ మూలంగా మనం చూడటానికి అనుమతించని ప్రదేశాలు....ఫోటోలు

కొన్ని ప్రదేశాలను మనం చూడకూడదని వాటిని గూగుల్ మ్యాప్ లో అస్పష్టంగా చూపుతారు. ఇలాంటి ప్రదేశాల లిస్ట్ చాలా ఉన్నది. అందులో కొన్నిటిని గురించి తెలుసుకుందాము.

నెదర్లాండ్ రాజ భవనం....నెదర్లాండ్ లోని ఆంశ్టర్డాం లో ఉన్న డచ్ రాజకీయ వంశానికి చెందిన కోనిన్ క్లిజిక్ పలిస్ అనే రాజభవనం. దీనిని చూడటానికి అనుమతి లేదు.గూగుల్ మ్యాప్స్ లొ ఈ ప్రదేశాన్ని అస్పష్టంగా చూపిస్తారు.

బఫ్ఫాలో నయగారా అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూయార్క్,అమెరికా...గూగుల్ మ్యాప్లో ఈ చోటంతా తెల్లగా కనబడుతుంది.జూం చేసినా వివరాలు కనబడవు.

టాంటౌకో నేషనల్ పార్క్, చిలి.....ఇది ప్రైవేట్ నేషనల్ పార్క్ అయినా అంతరించిపోయే అరుదైన జంతువులున్న ప్రదేశమైనందున దీనిని గూగుల్ మ్యాప్లో చూపించరు.

కియోవీ డాం, సౌత్ కరోలీనా,అమెరికా.....క్రిస్ట్ మస్ చెట్టు రూపంలో ఉండే ఈ డాం కరెంట్ ఉత్పత్తికోసం డ్యూక్ ఎనర్జీ కంపెనీ వారి ఆద్వైర్యంలో ఉన్నది.

మర్మమైన రష్యా ప్రదేశం....రష్యాలోని సైబీరియా మంచుటెడారి లో ఉన్న ఈ ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్లో ఎందుకు అస్పష్టంగా చూపుతున్నారో తెలియదు.

మినామీ టోరిషీమా విమానాశ్రయం,జపాన్...జపాన్ ఈస్ట్ కోస్ట్ లో ఉన్న ఈ విమానాశ్రయం ప్రస్తుతం జపాన్ నౌకా దళం ఉపయోగిస్తున్నది.

ది మిచాయల్ ఆఫ్ బిల్డింగ్, ఉటా,అమెరికా....ఇక్కడ అమెరికా రక్షక దళాల రసాయణ యుద్ద ఆయుధాలు మరియూ క్రిమి యుద్ద ఆయుధాలను పరిశోధించే భూగర్భం ఉన్నది.

కార్నల్ యూనివర్సిటీ వారి వేడిమి మరియూ విధ్యుత్ కర్మాగరం,న్యూయార్క్,అమెరికా... ఇక్కడ 2010 లో పర్యావరణ సమ్రక్షణ కోసం న్యాచురల్ గ్యాస్ నుండి విధ్యుత్ ను తాయారుచేసే లేటెస్ట్ టెక్నాలజీతో అమర్చిన ఆధునిక కర్మాగారం నిర్మించేరు.

బేబీలాన్,ఈరాఖ్ .....ఈ ప్రదేశం ఈరాఖ్ లోనే ఆధునిక నగరంలా కాకుండా ఒక ముగింపులేని పంటపొలాల భూమిగా కనబడుతుంది.

వ్లిస్సింజెన్,నెదర్లాండ్....ఈ దేశములోని రాజ భవనాలే కాకుండా ఈ దేశపు రక్షక దళాల స్థావరాలను కూడా అస్పష్టత చేసేరు.

1 comment: