Wednesday, March 14, 2012

ఆస్ట్రేలియాలో సాలె పురుగుల దాడి...ఫోటోలు

చూసిన వెంటనే అక్కడ బాగా మంచు పడిందేమో అని అనుకుంటారు. కాదు. అక్కడ తెల్లగా కనబడుతున్నది సాలె పురుగుల గూళ్లు. ఇంత పెద్దగా సాలె పురుగులు గూడు కడతాయా అనుకుంటారు. అది ఒక సాలె పురుగు కట్టుకున్న గూడు కాదు. కొన్ని మిలియన్ల సాలె పురుగులు కట్టుకున్నగూళ్లు.

ఆస్ట్రేలియాలో, న్యూ సౌత్ వేల్స్ లో ఉన్న వగ్గా వగ్గా అనే చోట కుండపోతగా వర్షం కురిసింది.దీనితో అక్కడ వరదలు ఏర్పడ్డాయి. వరద నీరు పెరగడంతో, సాలె పురుగులు గ్రామంలోకి వచ్చేసేయి. వందల సంఖ్యలో కాదు. మిల్లియన్ల సంఖ్యలో. వచ్చి గ్రామమంతా గూళ్లు కట్టుకున్నాయి.









1 comment: