Tuesday, March 13, 2012

యజమానికోసం ఎదురుచుసే హచికో లాంటి మరో కుక్క యొక్క నిజమైన కధ...ఫోటోలు మరియూ వీడియో

జపాన్ కు చెందిన హచికో కుక్క గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. తనని ప్రేమతో పెంచిన యజమాని చనిపోయేడన్న విషయం తెలుసుకోలేక ఆయన తిరిగి వస్తాడనే నమ్మకంతో ఎప్పుడూ ఆయన వచ్చే రైలుకోసం రైల్వే స్టేషన్ దగ్గర ఒక్కరోజు కూడా విడువకుండా కొన్ని సంవత్సరాలు ఎదురుచూసిన హచికో కుక్క చనిపోయిన తరువాత ఆ కుక్క కూర్చునే చోట్లో దాని శిలా విగ్రం పెట్టేరు.



ఈ కుక్కలాగానే చైనాలో వాంగ్ కై అనే కుక్క తన యజమానికోసం రోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒక బ్యాంక్ వాకిట్లే కూర్చుని ఎదురుచూస్తొందిట. రోజూ కొత్త జాకెట్ వేసుకుని పరిశుబ్రంగా ఉండే ఈ కుక్కను చూసినవారు ఈ కుక్కకు యజమానులున్నారని గ్రహించేరు. అయితే ఈ కుక్క ఎవరికోసం ఎదురుచూసి రోజూ బ్యాంక్ ముందుకు వస్తోందో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఆ బ్యాంక్ పక్కనే పనిచేస్తున్న ఈ కుక్క యజమానిని అడిగితే "ఈ కుక్క రోడ్డుమీద అటూఇటూ తిరుగుతూంటే నేనే తీసుకువచ్చి పెంచుతున్నాను. అది నాకోసం మాత్రం రావటంలేదు. బహుశ తన పాత యజమానికోసం వస్తొందేమో" అని తెలిపేరు.



ఏదిఏమైనా ఆ కుక్క ఎవరికోసం తపిస్తోందో వారు కనబడితే దాని ఆశ తీరుతుంది...హచికోకు అయినట్లు వాంగ్ కై కు అవకూడదు.

No comments:

Post a Comment