Saturday, March 10, 2012

ఎగిరే కార్లు...మొదటిసారిగా న్యూయార్క్ లో జరగబోయే అంతర్జాతీయ ఆటో షో లో ప్రవేశపెడుతున్నారు...ఫోటోలు

100 సంవత్సరాల నుండి సైన్స్ కల్పన కధలు రాసేవారు/ సినిమాలు తీసేవారు ఎగిరే మిషెన్లను(రోడ్డు మీద మరియూ గాలిలో)చూపించి మనల్ని హిసించేవారు.ఎన్నో బిజినస్ సంస్థలు వీటిని నిజంచేయాలని ఎంతో కాలం నుండి ప్రయత్నించేరు. కాని ఫలితం దక్కలేదు.ఇప్పుడు టెర్రాఫ్యూజియా అనే కంపనీ నిజంగానే ఎగిరే కారును డిజైన్ చేసేరు.

ఈ కారును ఏప్రిల్ నెలలో న్యూయార్క్ నగరంలో జరుగబోయే అంతర్జాతీయ ఆటో షో లో ప్రదర్శించబోతున్నారు. "ట్రాన్సిషన్" అని పేరుపెట్టబడిన ఈ కారుకు మడతపెట్టుకునే రెక్కలు అమర్చేరు.రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రెక్కలు ముడుచుకుంటాయి. ఎగరాలనుకున్నప్పుడు ఒక బటన్ నొక్కితే తెరుచుకుంటాయి.

26 అడుగుల పొడవుకలిగిన ఈ రెక్కలు రోడ్దుమీద నడుస్తున్న కారును ఎగిరే కారుగా చేయటానికి 30 సెకండ్లు మాత్రమే పడుతుందట.టాంక్ ఫుల్ చేస్తే ఈ ఎగిరే కారు గంటకు 100 మైళ్ల వేగంతో 480 మైళ్లు ప్రయాణం చేస్తుందట.

ఈ సంవత్సరం ఆఖరున ఈ కారు అమ్మకానికి వస్తుందని, $2,79,000 ఖరీదు చేస్తుందని తెలుపుతూ, ఇప్పటికే 100 కార్లకు బుకింగ్ అయ్యిందని కంపెనీవారు తెలిపేరు.













No comments:

Post a Comment