Thursday, March 8, 2012

మనం తాగుతున్న పాలు పరిశుద్దమైనవేనా?

పాలు వాడని వారు ఉండరు.రోజూ నిద్ర లేచిన తరువాత పాలు తాగేవారు కొందరైతే,నిద్ర పోయేముందు పాలు తాగి పడుకునే వారు కొందరు. పాలుతో కాఫీలూ, టీ లు తాగేవారు కో కొల్లలు. కానీ మనం ఉపయోగిస్తున్న పాలు(ప్యాకెట్ పాలు) పరిశుద్దమైనవేనా?....కాదట...!!!

మనం ఉపయోగిస్తున్న పాలు మనలో క్యాన్సర్ వ్యాధిని కలిగించే ప్రతికూలమైన ఏజెంట్లకు వాషింగ్ సోడా మరియూ యూరియా లాంటి వాటిని ఇచ్చి సహాయపడుతోందట.

మనం తాగుతున్న పాలులో సాదారనంగా వాడే కల్తీ పదార్ధాలు ఏమిటంటే కార్బనేట్, బై కార్బనేట్, స్టార్చ్, యూరియా, హైడ్రేటడ్ లైం, ఫార్మోలిన్ మరియూ అమోనియం సల్ఫేట్ అని నిపుణులు చెబుతున్నారు.

పాలులో ఉండే అసిడిటీని కంట్రోల్ చేయడానికీ, పాడైపోకుండా ఉండటానికీ, ఎక్కువ రోజులు నిలువ చేయడానికీ న్యూట్రలైజర్స్ వాడుతారని ఒక డైరీ టెక్నాలజిస్ట్ తెలియజేసేరు.ఈయన పేరు బయట పెట్టకుండా ఉంటే మరికొన్ని విషయాలు తెలియజేస్తామన్నారు.

మామూలుగా పాలులో వాడే న్యూట్రలైజర్స్ ఏమిటంటే బై కార్బనేట్ నుండి సోడియం బై కార్బనెట్ వరకు వాడతారని తెలిపేరు.అంటే వాషింగ్ సోడా, కాస్టిక్ సోడా, బేకింగ్ సోడా అని తెలిపేరు. ఇందులో కాస్టిక్ సోడా తప్ప మిగిలినవి తినకూడనవిట.

మిగిలిన కల్తీ పదార్ధాలు యూరియా గానీ, టాపియాకో స్టార్చ్ గానీ అయ్యుంటాయట. పాలుకు చిక్కదనం రావడానికి వీటిని కలుపుతారట.ముఖ్యంగా కొవ్వు తీసేసిన పాలుకు ఇవి కలుపుతారట.పాలు యొక్క చిక్క దనాన్ని కొలిచే స్కేల్ ను ఎస్.ఎన్.ఎఫ్(SNF) అంటారు. పాలులో ఎస్.ఎన్.ఎఫ్ కౌంటింగ్ ను బట్టి పాలులో నీళ్లు కలిపేరా లేదా అని తెలుసుకుంటారు.పాలులో ఎస్.ఎన్.ఎఫ్ 8 శాతానికి పైగా ఉంటే ఆ పాలును సరఫరా చేసిన వారి మీద అతి పెద్ద జరిమానా విధిస్తారు. కల్తీ పదార్ధాలు కలపడం వలన ఎస్.ఎన్.ఎఫ్ పెరుగుతుంది. చిక్కదనం పెరుగుతుంది.

ఐ.సి.ఎం.ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వారి రిపోర్ట్ ప్రకారం ఈ కల్తీ పదార్ధాలు మన ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుందట. ఫుడ్ పాయిజనింగ్, గాస్ట్రో ఇంటస్టైన్ కాంప్లికేషన్స్ మరియూ శరీరంలోని ప్రోటీన్లను నాశనం చేయటం జరుగుతుందట.

పాలులో ఉండే యూరియా కిడ్నీలను పాడుచేస్తుంది. కాస్టిక్ సోడా రక్త పోటునూ,హ్రుదయ వ్యాధులను పెంచుతుందని డయటీషియన్ డాక్టర్ మహతి తెలియజేసేరు.

తమ బ్రాండ్ పాలు చిక్కగా ఉంటుందని ప్రకటనలు చేసేవారు తమ పాలులో స్టార్చ్ కలుపుతూ, ఆ పాలు పాడైపోకుండా ఎక్కువకాలం ఉండటానికి కాస్టిక్ సోడా కలుపుతారని డైరీ టెక్నాలజిస్ట్ తెలిపేరు.

ప్రభుత్వ పాల ఉత్పత్తి కేంద్ర అధికారులు తాము తయారుచేస్తున్న పాలును ఎప్పటికప్పుడు పరిశోధణ చేస్తూ ఉంటామని, మేము సరఫరా చేసే పాలులో ఎటువంటి కల్తీ ఉండదని తెలియజేసేరు.

No comments:

Post a Comment