Monday, March 5, 2012

యూ.ఎఫ్.ఓ మెక్సికోలో దిగిందా?...2012 లో కనబడ్డ యూ.ఎఫ్ ఓ లు....ఫోటోలు మరియూ వీడియో

2012 లో అనేక యూ.ఎఫ్.ఓ లు భూమికి దగ్గరగా రావడాన్ని ఎంతొమంది వివిధ దేశాలలొ చూసేరు. కొంతమంది వాటిని వీడియోలలో బంధిచేరు.ఫిబ్రవరి నెలలో ఒక యూ.ఎఫ్.ఓ న్యూ మెక్సికోలో నిజంగానే దిగిందని ఒక వీడియో మూలంగా చూసిన ప్రజలు ఆశ్చర్యపోవడమే కాకుండా, అవి ఎందుకు భూమికి వస్తున్నాయనే ప్రశ్నతో సతమతమౌతూ, అసలు అది యూ.ఎఫ్. ఓ నేనా లేక మనవాల్లే యూ.ఎఫ్.ఓ రూపంలో తయారుచేసిన అంతరిక్ష నౌకా? లేక అన్యదేశస్తులు మానవులతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నంచేస్తున్నారా? అనే చర్చలు మొదలుపెట్టేరు. దీనికి ముఖ్య కారణం 2012 లో యూ.ఎఫ్.ఓ లు పలుచోట్ల,పలు దేశాలలో కనబడటమే.



కొత్తగా వెలువడిన ఈ యూ.ఎఫ్.ఓ వీడియో ఇంటర్నెట్ లో సంచలనం స్రుష్టిస్తోంది.మరోసారి యూ.ఎఫ్.ఓ న్యూ మెక్సికోలో దిగిందా? లేక అమెరికన్స్ యూ.ఎఫ్.ఓ లను తయారుచేసే టెక్నాలజీ కనుగొన్నారా? లేక ఇదంతా ఒక మోసమా? అనే సందేహాలు చాలామందికి ఏర్పడింది.ఈ వీడియో చూస్తే మీకూ ఇలాంటి సందేహాలు రావచ్చు.



ఈ వీడియోను ఒక కదిలే వాహనం నుండి తీసేరు.ఈ యూ.ఎఫ్.ఓ ఒక భవనం పైన తిరగడం చూడవచ్చు. వాహనంలో వెడుతూ వీడియో తీసేవారు అందరిలాగే ఆశ్చర్య పోయుండవచ్చు.అయినా నిశ్చలతతో సాహసంగా ఆ యూ.ఎఫ్.ఓ ను వీడియో తీసేరు.



ఈ వీడియోను చూసిన వారు చాలా అనుమానాలు వ్యక్తం చేసేరు..దిగినది న్యూ మెక్సికో కాదు, అది బ్రిటన్ అని తెలిపేరు. వీడియోలో భవనాలు న్యూ మెక్సికో నగరంలొ ఉన్నటువంటివి కావు, రోడ్డు మీద కార్లు కుడిచేతివైపు పోతున్నాయి కనుక అది ఇంగ్లాండ్ అంటున్నారు. అలాగే యూ.ఎఫ్.ఓ మీద ఒక చిన్న నక్షత్ర గుర్తు ఉన్నందున అది అమెరికా వారిదని చెబుతున్నారు. కొందరు ఇదంతా ఒక మోసం అంటున్నారు.



అయితే ఈ వీడియోల గురించి ఏ దేశ ప్రభుత్వమూ ఎటువంటి కామెంట్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. కానీ అనేక దేశాలు యూ.ఎఫ్.ఓ ల గురించి చేసే పరిశోధనలను తీవ్ర పరచడం ప్రజలను మరింత కన్ ఫ్యూజ్ చేస్తోంది.

జనవరి 6 న జపాన్ లో



జనవరి 3 న బ్రెజిల్ లో

No comments:

Post a Comment