Sunday, March 11, 2012

నది తీరాన సహస్ర(1000)లింగాలు...ఫోటోలు

ఉత్తర కర్నాటకాలోని సిర్సీ తాలూకా లో ఉన్న షాల్మలా నది(తీరం)లో ఉన్న 1000 రాళ్ళ పై చెక్కబడి యున్న శివలింగాలు అద్భుత అనుభూతినిస్తాయి. ప్రతి రాయిపై చెక్కబడిన శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కూడా ఉంటుంది. సహస్ర లింగాలంటే కన్నడ బాషలో 1000 లింగాలని అర్ధం.ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున వందలాది భక్తులు ఇక్కడికి వస్తారు. నదిలో నీళ్లు తక్కువుగా ఉంటే 1000 లింగాలనూ చూడవచ్చు.శీతాకాలంలో గానీ లేక ఎండాకాలం ప్రారంభంలో గానీ ఈ చోటికి వెడితే నదిలో నీళ్లు తక్కువగా ఉంటాయి గనుక అన్ని లింగాలనూ దర్శనం చేసుకోవచ్చు.సిర్సీ తాలుకా నుండి యల్లాపూర్ కు వెళ్లేదారిలో 17 వ కిలోమీటర్ దగ్గర ఈ స్థలం ఉన్నది.







బాబా బూట్నాద్ మహాకాలేశ్వర్ మందిరంలో ఉన్న శివలింగం

హలేబిద్ కు దగ్గరున్న బేలూర్ లొ ఉన్న శివలింగం.

హలేబిడ్ లో ఉన్న శివలింగం

4 comments:

  1. చాలా బాగుందండీ.. ఈ శివలింగాలు ఏ కాలం నాటివి? ఏ భక్తుడు వీటిని ప్రతిష్ట చేసారు మొదలైన వివరాలు కూడా తెలిస్తే చెప్పండి. చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. శంకరుడు అభిషేక ప్రియుడు అంటారు కదా. ఇక్కడ స్వామి వారికి నిరంతర అభిషేకం అన్నమాట.
    ఈ విధంగా సాధన చేసిన ఆ మహాభక్తుడు ఎంత పుణ్యాత్ముడో కదా..

    ReplyDelete
  2. ఫోటోలు చాలా బాగున్నాయి...అత్యధ్బుతమైన విషయాన్ని పంచుకున్నారు ధన్యవాదములు..

    ReplyDelete
  3. chaa adbhuta kshetram gurchi cheppaaru.

    nijamgaa aachota abhishekam chesukune bhaagyam kaligite adi adrushtame manaku

    ReplyDelete
  4. shivalingam Rudraram chaalabagunae

    ReplyDelete