Saturday, March 31, 2012

తాయ్ లాండ్ లో నీటిమీద తేలే సినిమా హాలు...ఫోటోలు

తాయ్ లాండ్ లోని కుడూ ద్వీపంలో రెండు పెద్ద కొండ రాళ్ళకు మధ్య నీటిలో తేలే సినిమా హాలుని నిర్మించేరు. ఇక్కడ ఇలా సినిమా చూడటం ఒక కొత్త అనుభూతి అంటున్నారు ఈ తెలే సినిమా హాలులో సినిమా చూసిన ప్రేక్షకులు.

2012 లో సూపర్ డూపర్ హిట్ అవుతాయంటున్న హాలీవుడ్ సినిమాలు...ట్రైలర్ వీడియోలు

The Avengers
Men in Black III
Madagascar 3: Europe’s Most Wanted
The Expendables 2
G.I. Joe: Retaliation
The Dark Knight Rises

Friday, March 30, 2012

ప్రపంచవ్యాప్తంగా మర్మమైన 10 రహస్య సంఘాలు...వీడియో

తమ నీడలో ప్రపంచాన్ని నడిపిస్తున్న మర్మమైన మత సంఘాల దగ్గరనుండి మర్మమైన రాజకీయ ఆలోచనా సంఘాల వరకు.

256 సంవత్సరాలు జీవించిన మనిషి?...జీవన విధాన రహస్యాలు...ఫోటోలు

లీ-చింగ్-యున్, భూమి మీద ఎక్కువ కాలం బ్రతికిన మనిషి అని చెబుతున్నారు.ఈయన 256 సంవత్సరాలు బ్రతికేడని చెబుతున్నారు. 1933 లో ఆయన చనిపోయేరన్న సమాచారాని టైం మాగజైన్ పత్రిక మరియూ న్యూయార్క్ టైంస్ పత్రిక ప్రచురిస్తూ ఎక్కువ కాలం భూమి మీద బ్రతికిన మనిషి అని వివరించేరు.అయితే వారు వివరించిన దానిలో చనిపోయిన ఈయనకు 122 సంవత్సరాల,164 రోజుల వయసు అని వ్రాసేరు. ఈయన 1734 లో పుట్టేరని చెబుతూ కానీ రికార్డులలొ ఆయన పుట్టిన సంవత్సరం 1677 గా రాయబడి ఉందని, ఈయన అప్పుడే పుట్టేరని మరికొన్ని రెకార్డులు తెలుపుతున్నాయని వివరించేరు.కనుక ఈయన 1677 లోనే పుట్టి ఉంటారని, ఈయన ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతకగలిగేరనే రహస్యాన్ని తెలుసుకునేందుకు విచారణ చేసేరు.
ఈయన ఒక డాక్టర్. మూలికల నిపుణులు. కై గాంగ్ మాస్టర్( ఒక విధమైన యోగా). ఆయన తన జీవిత రహస్యానికి కారణం "శాంతిపరమైన హ్రుదయం, తాబేలు లాగా కూర్చోవడం, పావురాయి లాగా నడవటం, సునకములాగా నిద్రపోవడం" అని 1916 లో రాజు గారి శభలో ప్రసంగంలో చెప్పేరట. అప్పుడు తీసిన ఫోటో ఇది.
ఈయన చిన్న తనపు రికార్డులు ఎక్కువగా దొరకపోయినా పత్రికల విచారనలో ఈయన చిన్నతనంలోనే పెద్ద పేరు సంపాదించుకున్నారనీ, 10 ఏళ్ల వయసులోనే ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో రకాల వన మూలికలను సంపాదించేరని,ఆ వన మూలికలను అందరికీ ఇస్తూ మార్షియల్ ఆర్ట్ లో మాస్టర్ గా ఉండేవారనీ తెలిసింది.1749 లో ఆయన చైనా మిలటరీలో జేరినట్లు రికార్డులు ఉన్నాయట. అదేలాగా ఆయన 150 వ పుట్టిన రోజున, 200 పుట్టిన రోజున చైనా ప్రభుత్వం ఆయనకు పుట్తిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఉత్తరాలు ఉన్నాయట.
ఆయన ఒక మిలటరీ శభలో మాట్లాడుతూ తను ఈ వయసులోనూ ఆరొగ్యంగా ఉండటానికి ధ్యానం ఒక ముఖ్య కారణమనిచెప్పేరట.
ఎక్కువకాలం బ్రతికిన మరికొంతమంది Jeanne Calment 122 సంవత్సరాలు, 164 రోజులు
Sarah Knauss 119 సంవత్సరాలు, 97 రోజులు
Lucy Hannah 117 సంవత్సరాలు, 248 రోజులు
María Capovilla 116 సంవత్సరాలు, 347 రోజులు

చైనాలొ రోడ్లను క్లీన్ చేసే కొత్త విధానాన్ని చూడండి...ఫోటోలు మరియూ వీడియో

Thursday, March 29, 2012

బాలి(ఇండోనేషియా)లో(ఉగాది?)సంవత్సరాదిని ఎలా జరుపుకుంటారో తెలుసుకోండి...ఫోటోలు మరియూ వీడియో

బాలి ఇండోనేషియా లోని ఒక ద్వీపం. ప్రముఖ ప్రపంచ పర్యటక ప్రాంతమైన ఈ ధ్వీపం ప్రాచీన హిందు సంస్కృతికి, ఆలయాలకు ప్రసిద్ది గాంచింది. ఇక్కడ 90% హిందువులు ఉన్నారు. ఇక్కడ...ఇండోనేషియాలో హిందువులు మైనారిటీలే అయినా బాలీలో హిందువులు 93.18 శాతం ఉన్నారు.వీరిని బాలినీస్ హిందూస్ అంటారు. ఇక్కడకూడా సంవత్సరాది జరుపుకుంటారు. అది కూడా మన ఉగాది రోజునే. ఈ సంవత్సరం మార్చ్ 23 న వారు సంవత్సరాది జరుపుకున్నారు. వారు వారి సంవత్సరాదిని "నెయేపీ" అంటారు. నెయేపీ అంటే "మౌనం" అని అర్ధం. "మౌనంగా ఉండవలసిన రోజు" అని జరుపుకుంటారు. నిజమే. ఆ రోజు బాలీ మొత్తం మౌనంగా ఉంటుంది.ఉదయం 6 గంటల నుండి మరిసటి రోజు ఉదయం 6 గంటల వరకు బాలీలో ఉన్నవారందరూ మౌనంగా ఉంటారు. ఒక విధంగా చూస్తే ఆ రోజు మౌన వ్రతం పాటిస్తారు అని చెప్పవచ్చు. ఆ రోజు ఎవరూ వీధులలోకి రారు. ఇళ్ళలోనే ఉంటారు.ఇళ్ళలో కూడా ఎవరూ మాట్లాడుకోరు.టీ.వీ లు పెట్టరు.రేడియోలు వినరు. అందరికీ ఆ రోజు సెలవు రోజు. బాలీ విమానాశ్రయం గూడా మూసే ఉంటుంది. విదేశీయులు కూడా ఎక్కడికీ ప్రయాణం చేయకూడదు. ఎమర్జన్సీ పనులకు తప్ప మిగిలినవాటికి అనుమతిలేదు. బాలీ మొత్తం నిశ్శబ్ధం గా ఉంటుంది. అయితే కొంతమంది సెక్యూరిటీ గార్డులు మాత్రం వీధులలో తిరుగుతారు. బాలీ మొత్తం నిర్మానుశ్యమైన వాతావరణం కలిగియుంటుంది. ముందు రోజు మాత్రం వారు వేడుకలు చేసుకుంటారు.రాక్షసుని విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెడతారు.ఊరేగింపు తరువాత ఆ విగ్రహాన్ని తగలబెడతారు. మరిసటి రోజు పవిత్రత కోసం,శుద్దిచేసుకుంటారు.అదే మౌన వ్రతం రోజు. ఆ రోజు నుండి వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ముందురోజు వేడుకలు
మౌనం పాటించే రోజు(సంవత్సరాది)

టూత్ పిక్స్ తో చేసిన పడవలు...ఫోటోలు

చికాగో లో నివసిస్తున్న కళాకారుడు వైనే కుసీ టూత్ పిక్స్ తో పడవలను తయారుచేసేడు. కొన్ని సంవత్సరాల స్రమ కు దొరికిన ఫలితం ఈ అద్భుతమైన పడవలు.