Tuesday, February 21, 2012

ఇంటెర్నెట్ ను మార్చిన పైరసీ వెబ్ సైట్ అధినేతలు...ఫోటోలు

ఇంటర్నెట్ ఎన్నో విషయాలను పంచుకునే ఒక పెద్ద చోటు. కానీ ఈ చోటును కూడా చాలామంది తమ స్వార్ధంకోసం ఉపయోగించుకుంట్టున్నారు. తమ తెలివితేటలను తప్పుగా వాడుతున్నారు.వీరి వలన ఇప్పుడు ఇంటర్నెట్, ప్రభుత్వ నియంత్రనలకూ, సెన్సార్ కూ కట్టుబడవలసి వస్తున్నది. అమెరికన్ ప్రభుత్వం కఠినమైన ఇంటర్నెట్ నియంత్రణ బిల్లులను ప్రేవేస పెట్టబోతోందని తెలిసినవెంటనే ఫైల్ షేరింగ్ కోసం మొదలు పెట్టబడిన ఎన్నో పైరసీ వెబ్ సైట్లు, తమ సైట్లను మూసివేయడం మరియూ వారి పాలసీలను మార్చుకోవటం చేసేరు. అందులో ముఖ్యమైన కొన్ని సైట్లు.

కిం డాట్కాం....చిన్న వయసులోనే తన సొంత ఊరైన జెర్మనీలో నుండి అమెరికా కార్పరేట్ పి.బి.ఎక్స్. సిస్టం లను క్రాక్ చేసి గొప్ప పేరు సంపాదించేరు.డాటా సెక్యూరిటీని స్థంభింప జేయడమే తన వ్రుత్తిగా తీసుకున్నారు. 2001 లో అప్పట్లో అప్పుల్లో ఉన్న లెట్స్ బై ఇట్.కాం ను 375,000 డాలర్లకు కొన్నారు.ఆ తరువాత 2005 లో 50 మిల్లియన్ యూరోలతో మెగా అప్ లోడ్ ను మొదలు పెట్టి ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 14 వ స్థానం సంపాదించేరు.

జూలియన్ పాల్ అసంగే.....ఆస్ట్రేలియా ప్రచురణకర్త,పాత్రికేయుడు మరియూ ఇంటర్నెట్ వ్యవస్థాపకుడు. వికీ లీక్స్ అనే ఇంటర్నెట్ సంస్థ ను నడుపుతూ, తనది ఒక నాన్ ప్రాఫిట్ సంస్థగా పేర్కొంటూ వివిధ దేశాల రహస్యాలనూ, ప్రభల వ్యక్తుల అంతరంగిక వ్యవహారాలనూ ఆకాశరామన్నల దగ్గర నుండి పోగుచేసి తన వెబ్ సైట్లో ప్రచురణచేస్తాడు.

షాన్ ఫానింగ్....అమెరికాకు చెందిన ఇతను ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్. వ్యవస్థాపకుడూ మరియూ ఇన్వెస్టర్.1998 లో మొట్టమొదటి పియర్ 2 పియర్ ఫైల్ షేరింగ్ ప్లాట్ ఫార్మ్ ను నాప్ స్టర్ అనే పేరుతో మొదలుపెట్టేడు.ఆ తరువాత ఇతని మీద వివిధ మ్యూజిక్ కంపనీల వారు ఎన్నో దావాలు వేసేరు. ఆ తరువాత ఇతను ఆ వెబ్ సైట్ ను మూసేసేరు.

సీన్ పార్కర్...ఇతను అమెరికన్ టెక్నాలజీ బిజినస్ మాన్ మరియూ వ్యవస్థాపకుడు.నాప్ స్టర్, ప్లాక్సో, కాజస్ మరియూ ఏర్ టైం అనె వెబ్ సైట్ లకు కో-ఫౌండర్.ఇతను కూడా ఒక ఫేస్ బుక్ ఫౌండింగ్ ప్రెసిడెంట్. ఇతని ఆస్తి ప్రస్తుతం 2.1 బిల్లియన్ డాలర్లట.

నిక్ లాస్ జెన్ స్టాం....ఇతను చాలా పలుకుబడి కలిగిన ఇంటర్నెట్ వ్యవస్థాపకుడు. పేరున్న ఎన్నో వెబ్ సైట్ల స్థాపనలలో భాగమున్నవాడు. ముఖ్యంగా స్కైప్ మరియూ కజా.ఇతను స్థాపించిన కజా వెబ్ సైట్ నుండి ఎం.పీ3 మ్యూజిక్ ఆడియోలను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఆడ్వేర్ సపోర్ట్ లేకపోవడంతో స్పైవేర్ ను తట్టుకోలేక కజా సరిగ్గా పనిచేయడం లేదు.

క్రిస్టోపర్ పూలే....అమెరికా ఇంటర్నెట్ సంస్థల వ్యవస్థాపకుడు.4చ్చాన్ మరియూ కాన్వాస్ అనె వెబ్ సైట్లను మొదలుపెట్టినతను. 4చ్చాన్ వెబ్ సైట్ లో ఫోటోలు, చర్చలూ, కమెంట్లూ మారు పేరుతో చేయవచ్చు.

జే ఫ్రీమాన్ సౌరిక్...ఐ ఫోన్ ఇన్ స్టాలర్ అప్లికేషన్ ఆపరేటింగ్ సిస్టం 1.1. కి ఓపన్ సోర్స్ ఫ్రీ అప్లికేషన్ గా సైడియా ని ఇంటర్నెట్లో విడుదలచేసేరు.ఐ ఫోన్ OS 2.0 విడుదలైనప్పుడు ఇతను ఫ్రీ గా అందించిన సైడియా అప్లికేషన్ చాలా పాపులర్ అయ్యింది.4 మిల్లియన్ ఐ ఫోన్ యూజర్స్ తమ ఐ ఫోన్లలో ఈయన అందించిన సైడియా అప్లికేషనే వాడేరు.2010 లో అన్ని ఐ ఫోన్లకూ ఈయన ఆపరేటింగ్ సిస్టం అందించేడు.చివరిగా ఆపిల్ ఫోన్లకు కూడ ఇవ్వడం మొదలుపెట్టేడు.సైడియా మూలంగా ఇతనికి సంవత్సరానికి 10 మిల్లియన్ డాలర్ల ఆదాయం వస్తున్నది.

బ్రాం కోహన్....అమెరికన్ కంప్యూటర్ ప్రొగ్రామర్.పీర్ 2 పీర్ బిట్ టారంట్ ప్రొటోకాల్ ను కనుగొన్నది ఇతనే.ఈ ప్రొటోకాల్ తో ఫైల్ షేరింగ్ వెబ్ సైట్ ను మొదలు పెట్టి పేరు పొందేరు. సాన్ ఫ్రాన్సిస్కో లోని పీర్2పీర్ హ్యాకర్ అసోషియేషన్ అధినేత.కోడ్ విల్లే కో ఫౌండర్.

మార్క్ హోవర్డ్ గార్టన్...లైం వైర్ వెబ్ సైట్ ను స్థాపించి,పీర్2పీర్ ఫైల్ షేరింగ్ వారికి జావా ప్లాట్ ఫార్మ్ అందించేరు.ఎన్నో పైరసీ దావాలను ఎదుర్కొంటూ ఎవరికీ తెలియని పేరుతో లైం వైర్ అనే మరో కంపనీని మొదలుపెట్టేరు.

హనా బెషారా...నింజా వీడియో అనే వెబ్ సైట్ మొదలుపెట్టి టివీ షోలూ, సినిమాలూ, డాక్యూమెంటరీలూ షేర్ చేసొకోనిచ్చేరు.2010 లో పోలీసుల దాడి తరువాత వెబ్ సైట్ ను మూసేసేరు.ఈమెకు 22 నెలలు జైలు శిక్ష విధించి, ఆమె ఈ వెబ్ సైట్ మూలంగా సంపాదించిన 2 కోట్ల డాలర్లను MPAA (మోషన్ పిక్చర్స్ అసోషియేషన్ ఆఫ్ అమెరికా) కు జమ చేయమన్నారు.

1 comment:

  1. I think Julian Asanji was not a pirated in any way...

    ReplyDelete