Thursday, February 9, 2012

ప్రపంచవ్యాప్తంగా నిజంగా దొరికిన కొన్ని గుప్త నిధులు...ఫోటోలు

నేపాల్ రాజధాని ఖాట్మండూలోని రాజభవనంలో దొరికిన గుప్త నిధి.
మరమ్మతులు చేసేటప్పుడు గుప్తనిధులు దొరకడం చాలా అరుదు.కానీ జూన్ 2011 న ఖాట్మండూ రాజభవనంలో మరమ్మతు పనులు చేస్తున్న కార్మీకులకు హనుమాన్ దోకా భవనం స్టోర్ రూం క్రింద 600 పౌండ్ల బంగారం మరియూ వెండి నిధి దొరికింది.ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వం అధికారపూర్వకంగా జూన్ 28 న బహిరంగ పరుస్తూ దొరికిన ఆ గుప్తనిధి సుమారు 500 సంవత్సరాల ప్రాచీనమైనవని,ప్రస్తుత వాటి విలువ ఒకటిన్నర కోటి రూపాయలవుతుందని తెలిపేరు.
దక్షిణ భారతదేశంలోని పద్మనాభస్వామి గుడిలో దొరికిన గుప్తనిధి.
16వ శతాబ్ధంలో కట్టబడిన ఈ గుడిలో బంగారు నాణాలూ, వజ్రాలూ మరియూ వైడూర్యాలు కలిగిన ఎనలేని గుప్త నిధి దొరికింది. ఇవన్నీ స్వామివారికి భక్తులు కానుగా ఇచ్చినవిట. ఈ రోజు ఖరీదులో ఈ నిధి వులువ 22 బిల్లియన్ డాలర్లకుపైనే ఉంటుందట.కొలంబియాలోని గౌతవితా చెరువులో దొరికిన గుప్తనిధి.
వందలకొలది సంవత్సరాలక్రితం ఈ ప్రదేశాన్ని పాలించిన ట్రైబల్ రాజు దేవతలను గౌరవించడానికి తన ఓంటినిండా బంగారం పొడిని పూసుకుని చెరువులోకి దిగి స్నానంచేసి ఆ తరువాత ఆ చెరువులోకి వజ్రవైడూర్యాలు విసిరేసేవాడట.కొన్ని సంవత్సరాల తరువాత(అంటే 1500 లో) యూరోపియన్లు ఈ చెరువు గురించి తెలుసుకుని ఆ చెరువులోని నీటిని తోడేయడం చేసేరు. అప్పుడు వారికి ఆ తోడేసిన నీటిలో 40 పౌండ్ల బంగారం దొరికింది. 1911 లో కొంతమంది అమెరికన్లు ఆ చెరువులోని నీటిని కాలీ చేసేరు.చెరువు క్రింది నేల గట్టిబడిపోయుండటంతో ఏమీచేయలేకపోయేరు.ఇప్పుడు కొలంబియా ప్రభుత్వం అక్కడికి ఎవరూ వెళ్లకూడదనీ, ఎటువంటి త్రవ్వకమూ చేయరాదని కటుదిట్టం చేసింది.
ఓక్ ఐలాండ్ పిట్ ఓ గుప్తనిధి.
1775 లో డేనియల్ మెక్ గిన్స్ అనే అతను ఓక్ ఐలాండ్ లో నడిచి వెడుతున్నప్పుడు అతనికి ఒక పెద్ద రంధ్రం కనబడింది.ఎక్కువగా ప్రజలు లేని ఆ ఐలాండ్లో ఎవరు ఆ రంధ్రం త్రవ్వి ఉంటారా అని అనుకున్న గిన్స్ ఆ రంద్రంలోకి దిగి చుసేడు . అక్కడ అతనికి తన 2 చేతులకు సరిపడా బంగారు నాణాలు దొరికినై. అక్కడ ఒక బోర్డ్ కనబడింది. ఆ బోర్డ్ మీద "మరో 40 అడుగుల క్రింద 2 మిల్లియన్ పౌండ్లు ఉన్నాయి" అని రాసున్నది. ఆ తరువాత ఏమిజరింగిందో ఎవరికీ తెలియదు.వోల్వో కంపెనీవారి గుప్త నిధి.
జూన్ 2007 లో వొల్వో కంపెనీవారు తమ కంపెనీ అడ్వర్టైస్ మెంట్ కోసం 50,000 డాలర్ల విలువగల బంగారం ను ఒక చోట ఉంచి, అది ఎక్కడ ఉంచినది తెలుసుకోవటానికి ఒక పజిల్ పెట్టేరు. ఆ పజిల్ ప్రకారం అక్కడికి వెళ్లగలిగినవారికి అక్కడున్న బంగారంతోపాటు ఒక వొల్వో కారును బహుమతిగా ప్రకటించేరు.23 సంవత్సరాల అలేనా అనే అతను ఆ పజిల్ సాల్వ్ చేసి ఆ గుప్త నిధి ఎక్కడ ఉన్నది కనుగొన్నాడు. ఈ లోపు వొల్వో కంపెనీతో పార్ట్ నర్ గా పనిచేస్తున్న ఒడెస్సీ సముద్ర అన్వేషణ సంస్థ అక్కడ సముద్రం క్రింద 500 మిల్లియన్ డాలర్ల గుప్త నిధి ఉన్నదని కనిపెట్టేమని, అక్కడికి ఎవరూ రాకూడదని తెలిపేరు. రాజకీయ పలుకుబడుల కారణంగా ఆ గుప్త నిధి గురించి ఆ తరువాత ఏమీ తెలియలేదు.కానీ అలేనాకు మాత్రం వోల్వో కంపెనీవారు తాము ప్రకటించిన గుప్త నిధితో పాటూ వొల్వో కారును ఇచ్చేరు.
కే వెస్ట్ ఎమరాల్డ్ రింగ్ గుప్త నిధి.
జూన్ 2011 లో స్పైన్ దేశంలో సంద్ర అన్వేషణ చేస్తున్న వారికి 10 కేరట్ల ఎమరాల్డ్ రాయి కలిగిన బంగారు ఉంగరం దొరికింది.ఇంకొంచం అన్వేషణ తరువాత వారికి అక్కడ ఇరుక్కుపోయిన ఒక ఓడ కనబడింది. అందులో మరికొన్ని ఎమరాల్డ్ డైమండ్స్ దొరికినై.వాటి విలువ 5 లక్షల డాలర్ల దాకా ఉంటుంది. 1622 లో హరికేన్ వలన మునిగిపోయిన ఓడ అదే నని తెలుసుకున్నారు.ఇంటివెనకాల గుప్త నిధి.
2007 వ సంవత్సరం వియన్నాలో ఆండ్రియాస్ అనే ఒకతను తన ఇంటి వెనకాల తోటలో తవ్వుతున్నప్పుడు 200 బంగారు ఉంగరాలతోపాటు వెండి పళ్ళేలు దొరికినై.ఈ విషయాన్ని వెంటనే బయటపెడితే తనకు ప్రమాదమొస్తుందని తన ఇంటి బేస్ మెంట్ లో ఒక గుంట త్రవ్వి అక్కడ ఉంచేడు. వాటిని ఉపయోగించుకోకుండా సాదారన జీవితం గడిపేడు.కొన్ని సంవత్సరాల తరువాత వాటి గురించి మరిచిపోయేడు.ఈ మధ్య ఇంటర్నెట్ లో దీని గురించి రాసేడు.వెంటనే ప్రభుత్వ అధికారులు అతని ఇంటికి వచ్చి ఆ గుప్త నిధిని స్వాధీనం చేసుకున్నారు. దొరికిన గుప్తనిధి 650 సంవత్సరాలకు ముందువని తెలిపేరు.నిజమైన గుప్త నిధి.
2005 లో రాబిన్ సన్ క్రూసో అనే అతను పూడ్చి ఉంచబడ్డ సుమారు 600 బారెల్స్ ను కనుగొన్నాడు. అందులో ఎనలేని నిధి దొరికింది.దాని విలువ 10 బిల్లియన్ డాలర్లుగా లెక్క వేసేరు. అవి అమెరికా నుండి స్పానిష్ లు కొల్లగొట్టిన నిధి అని తేల్చేరు. అంతకు ముందు ఆ నిధికోసం వెతికిన వారు ఆ నిధిలో వారికి కూడా భాగం ఉన్నదని గొడవపడ్డారు.ఈ లోపు చిలీ ప్రభుత్వం ఆ చోటును స్వాధీనం చేసుకుని అక్కడ దొరికిన నిధి ప్రబుత్వానికని దాని మీద ఎవరికీ హక్కులేదని తెలిపేరు.
గూగుల్ ఎర్త్ మ్యాప్ గుప్త నిధి.
లాస్ ఏంజల్స్ కు చెందిన నాతన్ స్మిత్ అనే ఆయన గూగుల్ మ్యాప్ చూస్తూ సముద్రంలో మునిగిపోయున్న ఒక ఓడను గుర్తించేరు.ఆ ఓడ 1822 లో హరికేన్ లో కొట్టుకుపోయిన ఓడ అని, దానిలో 3 బిలియన్ డాలర్ల వుల్వ చేసే నిధి ఉన్నదని తెలుపుతూ మెటల్ డిటెక్టర్ తో గల్ఫ్ కోస్ట్ కు వెళ్ళేరు.కానీ తాను చూసిన ఓడ ఉన్న ప్రదేశం ఒక వ్యక్తికి సొంతమైనదని తెలుసుకుని అతన్ని కలుసుకుని విషయం తెలిపేరు.ఆ ప్రదేశానికి యజమాని అయిన వ్యక్తి నాతన్ స్మిత్ ను ఓడ దగ్గరకు వెళ్ళడానికి అనుమతించలేదు. తనకు సొంతమైన ప్రదేశంలో ఉన్నదున ఆ ఓడ, మరియూ అందులోని వస్తువులూ తనకే సొంతమని తెలిపేడు. ఇప్పుడు ఈ విషయం కోర్ట్ లో ఉన్నది.


No comments:

Post a Comment