Thursday, February 9, 2012

ఐస్ గడ్డలుగా మారిన యూరప్...ఫోటోలు

యూరప్ లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో విపరీతమైన మంచు కారణంగా యూరప్ దేశాలు చలితో వణికిపోతున్నాయి. రోడ్డు,రైళ్లు, విమానం రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గత వారం రోజుల్లోనే 300మంది పైగా యూరప్ వాసులు ఈ మంచు ధాటికి మృతి చెందారు. అక్కడి ప్రజలు బయటకు వచ్చెందుకే వణికిపోతున్నారు.

విపరీతమైన మంచు వర్షంలా కురుస్తుండడంవల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు.తమ కార్లు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో కార్లను నెట్టుకొంటూ వెళుతున్నారు. ఇక విమానాశ్రయాల్లో విమానాలు అసలు కదలడంలేదు.ఎక్కడివిమానాలు అక్కడే నిలిచిపోయి ఉన్నాయి.రైలు మార్గాలన్ని మంచుతో కూరుకుపోయినందువల్ల రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది.

భారీగా కురుస్తున్న మంచుతో మొత్తంగా యూరప్ ఖండమంతా స్తంభించిపోయింది. ఉష్ణోగ్రతలు మైనస్ 16డిగ్రీల సెల్సియస్ నుండి మైనస్ 29డిగ్రీలు నమోదైంది.















No comments:

Post a Comment