Wednesday, February 8, 2012

భారతదేశ పరువును మంటగలిపిన కర్ణాటక నీలి మంత్రులను ఏలా శిక్చించాలి…?

కర్ణాటక శాసన సభలో జుగుప్సాకరమైన సంఘటన చోటు చేసుకొంది. ఈ సంఘటన కర్ణాటక శాసనసభను మాత్రమే కాకుండా, కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా యావద్ భారతదేశాన్నే తలదించుకునేల చేసింది. ఆ రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చ సాగుతున్న సమయంలో సహకార శాఖ మంత్రి లక్ష్మణ సవది మొబైల్ ఫోన్ లో బ్లూఫిలిం వీక్షిస్తూ ప్రెస్ కెమెరాలకు దొరికపోయాడు. ఈ మంత్రి పక్కనే ఉన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీసీ పాటిల్ కూడా ఆ దృశ్యాలను చూస్తున్నట్టు కనిపించింది. టెలీవిజన్ చానళ్లలో ఈ దృశ్యాలు ప్రసారం కావడంతో జనం బిత్తరపోయారు.

రాష్ట్ర, దేశ పవిత్రతను కాపాడాల్సిన మంత్రులు(ప్రజా ప్రతినిధులు)బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా సదరు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో మంత్రి బ్లూఫిలిం వీక్షించే దృశ్యాలు టీవీలో ప్రసారం కావడం ప్రారంభమైన వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోయింది.

భారదేశ పరువును మంటగలిపిన ఈ మంత్రులు మాత్ర్రం తాము అమాయకులమని, ఏ తప్పూ చేయలేదని, ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపితే నిర్దోషులుగా బయటపడతామని చెప్పుకొచ్చారు.



ఈ ముగ్గురు సభకు హాజరుకాకుండా సస్పెన్షన్ విధించారు. ‘నీలి’ వ్యవహారంపై సభా కమిటీ దర్యాప్తు చేసి వచ్చే నెల 12న నివేదిక సమర్పించేంతవరకు అసెంబ్లీకి రావొద్దని వారిని ఆదేశించారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ముఖ్యమంత్రి, సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు సహా ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిటీ నివేదికను సభలో ప్రవేశపెడతానని, అనంతరం తదుపరి చర్యలు చేపడతామన్నారు. సవది, పాటిల్, పాలెమార్లు ఈ నెల 13న వివరణలు ఇవ్వాలన్నారు.

నేరస్తులని తెలిసిన తరువాత కూడా ఇంకా దర్యాప్తు ఎందుకో అర్ధంకావడంలేదు.భారతదేశ పరువును బహిరంగంగా మంటగలిపిన ఈ మంత్రులకు ఎటువంటి విచారణ జరుపకుండానే కఠిన శిక్ష విధించాలనేది నా అభిప్రాయం.

1 comment:

  1. technology ni intha goppagaa vaaduthunnaru mari..em chestham...vallaki votu vesi vaalla KARMA..

    ReplyDelete