Friday, February 17, 2012

ఈపాటికి ఈ టెక్నాలజీ ఇన్వెన్షన్స్ మానవులకు అందుబాటులో ఉండి ఉండాలి....ఫోటోలు

ఈ పాటికి మన బౌతిక ప్రపంచంలోకి ఎన్నో కొత్త విషయాలు ప్రవేశించి ఉండాలి. ప్రక్రుతి మానవులకు నేర్పిందే "మానవుడు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు".ఇప్పటికే సైన్స్ మనకు ఎన్నో చికిత్సలూ, టెక్నాలజీలూ అందించింది. వంద సంవత్సరాల క్రితం పుట్టి బ్రతికున్న మనుష్యులకు ఈ విషయం బాగా తెలుసు. ఎక్కడో రైలులో వెడుతున్న వారికి ఎస్.ఎం.ఎస్. పంపడం అద్భుతమైన అనుభూతి.ఊహకందని పరికరాలతో మనల్ని ముగ్దులను చేసేరు.ఐతే ఏ పరికరమైన, ఏ సైన్స్ ఇన్వెన్షన్ అయినా మొదట సైనిక రంగంలో ఉపయోగిస్తారు. వారికి చికాకు కలిగేంతవరకూ ఉపయోగించుకుని ఆ తరువాత మిగితా ప్రపంచానికి అందిస్తారు. ఇందులో మైక్రోవేవ్ టెక్నాలజీ అతి పెద్దది.ఆ తరువాత సీ.డీ లను చంపేసిన ఐ పాడ్. ఈ విధంగా ఆలోచిస్తే మనల్ని ఆశ్చర్యపరిచే మరెన్నో టెక్నాలజీ ఇన్వెన్షన్స్ ఈ పాటికి మన అందుబాటులో ఉండుండాలి...లేక అవి మనకు త్వరలోనే అందుబాటులో ఉంటాయి.


టైం మిషన్......టైములో ముందుకు గానీ వెనుకకు గానీ వెళ్లదలుచుకుంటే, చాలామంది పాతకాలపు టైం లోకే వెళ్ళటానికి ఇష్టపడతారు.మహాభారత కాలానికో,రామాయణ కాలానికో లేక రాజుల కాలానికో వెళ్లి అక్కడ జరిగిన ఆశ్చర్యాలను, మీరాకల్స్ నూ చూడటానికి ఇష్టపడతారు. భవిష్యత్తులోకి వెళ్లరు. అక్కడ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో తెలియదు కనుక.


యాంటీ గ్రావిటీ(ప్రతి ఆకర్షణ)....అంతరిక్ష యాత్రీకుల మాత్రం ఎందుకు బరువులేకుండా ఉండాలి? ఇది మామూలు మానవులకు కూడా సాధ్య మవవచ్చు,నిజానికైతే ఈ టెక్నాలజీని మానవులకు అందకుండా ఉంచుతున్నారు.స్థూలకాయమైన వ్యక్తులు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందేనా లేక కాళ్ళుకోల్పోయిన వ్యక్తులు వీల్ చైర్లలో గడపాల్సిందేనా...వీరు ఆనారోగ్యులనడం తప్పు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు...వీరికి ఇది వరప్రసాదం. మరియూ ఈల్లలో గాలిలో తెలుతూ ఇల్లంతా తిరంగడం ఒక ఆనందం, పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లలో లిఫ్ట్ లు ఎక్కడం, షాపింగ్ మాల్స్ లో ఎస్కలేటర్లు ఎక్కడం తగ్గుతుంది, వాటి అవసరమే లేకుండా పోతుంది.ఏదైన నాసా వారు దీని గురించి ఆలోచించాలి.


హోలోగ్రాం టీవీలు....మనకి ఇప్పుడు కళ్లజోడ్లు లేని 3డి టీవీలు వచ్చేసినై.దీనినైనా ఒక చోటులో ఉంచే, ఒక చోటు నుండే మనం చూడాలి. అదే హోలోగ్రాం టీవీ అయితే మనం ఎటు తిరిగైనా చూడవచ్చు, మన చుట్టూ జరుగుతున్నట్లే ఉంటుంది.మనం కూడా అందులో ఒకరిమనే అనుభూతి కలుగుతుంది.


ఫుడ్ పార్టికలైజర్....ఈ తెక్నాలజీ వలన మనం ఎన్నో రకాల ఆహారాలను తయారుచేసుకోవచ్చు. ఎక్కడో డాటా బేస్ లో ఉన్న చిన్న నిగురుతో (సీ.డీ రైట్ చేసుకున్నట్లు) మనకు కావలసినంత ఆహారం తయారుచేసుకోవచ్చు. ఇదే గనుక జరిగితే ప్రపంచంలో ఆకలితో అలమంటించే వారే ఉండరు.


లేజర్ ఆయుధం....రాబోవు కాలంలో బుల్లట్ ప్రూఫ్ విమానాలు తయారుచేయబడతాయి. అప్పుడు శత్రు విమానాలపై బుల్లట్లు కురిపించినా ప్రయోజనం ఉండదు.అప్పుడు లేజర్ ఆయుధాలతో పోరాడాలి. ఈ టెక్నాలజీని కూడా ఆలశ్యం చేస్తున్నారనే అనుకుంటున్నారు.ఈ టెక్నాలజీ గనుక ఉపయోగంలోకి వస్తే, ఇనుము ఉపయోగం తగ్గుతుంది. మిలటరీ బడ్జెట్ కూడా తగ్గుతుంది.


ఆండ్రాయడ్ రోబోట్లు....రోబోట్లు ఇప్పడికే చాలా పనులు చేస్తున్నాయి. వాటి ఉపయోగం మనిషికి అన్నిచోట్లా ఉపయోగపడుతుంది. అవి మనతో గొడవ పడవు. వాటికి ఆహారం మరియూ డబ్బుతో పనిలేదు.అప్పుడప్పుడు సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ అవసరమౌతుంది.శాస్త్రవేత్తలు ఎందుకు ఈ టెక్నలజీకి ముఖ్యత్వం ఇవ్వటంలేదో చాలా మందికి అర్ధం కావటంలేదు.


ఎగిరే కార్లు....హైవేలన్నీ ట్రాఫిక్ తో నిండిపోతున్నాయి. ఆకాస మార్గాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు. దీని వలన చాలా లాభం ఏర్పడుతుంది. ఐతే ఈ కార్ల తయారులో శాస్త్రవేత్తలు నిమగ్నులై ఉన్నారు. త్వరలో ఇది నిజమయ్యే అవకాసం ఉన్నది.


వ్యక్తిగత జెట్ ప్యాకెట్లు....మిలటరీ కి ఎక్కువ ఉపయోగపడదని దీనిని ఆలశ్యం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ పై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే దీనికి ఇంధనంతో పనిపడుతోంది. సోలార్ ఇంధనంతో తయారుచేసే టెక్నాలజీని రూపొందించే పనులలో ఉన్నారట.

1 comment:

  1. మీకోసం గారు పోస్ట్ ఫాంట్ సైజ్ 18కి పెంచండి మరి చిన్న ఫాంట్ అయింది చదవటానికి కష్టపడవలసి వస్తుంది

    ReplyDelete