Tuesday, February 7, 2012

తమకుతాముగా మమ్మీలైపోయిన జపాన్ సన్యాసులు...ఫోటోలు

కొన్నివేల సంవత్సరాలకు పూర్వం ఉత్తర జపాన్లో సుమారు 12 మంది సన్యాసులు తమకుతాముగా మమ్మీలైనారట. వీరిని సొకుషింబుత్షూ అని పిలుస్తారు.మొట్టమొదట ఈ అలవాటును కూకై అనే ఒక సన్యాసి మొదలుపెట్టేడు. ఆ తరువాత కొన్ని వందలమంది మమ్మీలవాలనుకున్నారు గానీ 16 నుండి 24 మమ్మిలైనవారిని మాత్రమే కనుగొన్నారు.శరీరానికి శిక్ష వేసుకుంటే జ్ఞానోదయం మరియూ ముక్తి దొరుకుతుందనే ఆశతో ఈ అలవాటుకు పూనుకున్నారు.

ఇలా మమ్మీలవాలనుకునే సన్యాసులు మొదటి 1000 రోజుల వరకు కాయలూ,గింజలూ మాత్రమే తింటూ కఠినమైన శరీర వ్యాయమం చేసేవారట. అప్పుడు వారి శరీరం లోని కొవ్వు పూర్తిగా తగ్గిపోయి వారు బక్క పలుచగా కనబడేవారట. ఆ తరువాత మరో 100 రోజుల వరకు విషపూరిత చెట్ల వేర్లూ, పరకలూ తింటూ విషపూరిత టీ త్రాగేవారట.ఇలా చేసినదువలన వారి శరీరంలో ఉన్న నీరు పూర్తిగా ఎండిపోయేదట. దీనివలన వారి శరీరం పూర్తిగా విషపూరితమై పురుగులు తినకుండా ఉండేవిట. ఆ తరువాత వీరు వీరికంటూ ఒక గొయ్యి త్రవ్వుకుని సమాధిలాగా చేసుకుని (తమ శరీరానికి సరిపోయేంతమేరకు) అందులో ఉండిపోయేవారుట.ఆ సమాధికి పైన ఒక రంద్రంచేసి ఆ రంద్రం పైన ఒక గంట పెట్టి, ఆ గంట కు తాడు కట్టి లోపలకు వదిలేవారట. సమాధిలో ఆ సన్యాసి బ్రతికున్నంతవరకూ రోజూ ఒకసారి గంట కొడతాడు.గంట కొట్టడం ఆగిపోయినప్పుడు ఆ సన్యాసి మరణించేడని మిగిలినవారు నిర్ణయిస్తారు. వెంటనే ఆ గంట, తాదు తీసేసి ఆ రంద్రాన్ని మూసేస్తారు. తరువాత 1000 రోజులకు ఆ సమాధిని తెరిచి ఆ సన్యాసి మమ్మీ అయినారా లేదా అని చూసి మమ్మీ అయ్యుంటే ఆ సామాధిపై గుడి కడతారు.

ఇప్పుడు ఈ అలవాటును ప్రభుత్వం నిషేదించింది.








1 comment: