Saturday, February 11, 2012

అందమైన సూర్యాస్తమయాలు...ఫోటోలు











7 comments:

  1. తెలుగు క్రియేటివ్ బ్లాగు సెక్షన్ లో మీది నంబర్ 1,2,3,4 ...10. మిమ్మల్ని ఎంత మంది అభినందిచారో తెలియదు కాని, ఇన్ని సంవత్సరాల నుంచి విరామం లేకుండా, వివిధ రకాల సంస్కృతులను, దేశాలను, జంతువులను, పోటోలను మాకు పరిచయం చేయటం, నిజంగా మిమ్మల్ని ఎంతగానో అభినందించవలసిన అంశం. మీ బ్లాగును చూడటం ఒక గొప్ప అనుభుతి, చాలా సంతోషంగా, ఆశ్చర్యంగా, ఆహ్లాదంగా ఉంట్టుంది. మీ బ్లాగు చుస్తేనే మీరు యునిక్ , యొగాను బాగా ఆకళింపు చేసుకొన్నారనిపిస్తుంది. ఇప్పటివరకు తెలుగు బ్లాగులలో ఎవ్వరు నడవని ప్రత్యేకమైన దారిలో పోతున్నారు.
    __________________________
    మీ పెద్దనాన్న గారు నా అభిమాన నటుడు. ఆయన నటించిన ఇల్లరికం, జగదేక వీరుని కథ ఎన్నో సార్లు చుశాను. జగదేక వీరుని కథలో రాజుగా రాజనాల, మంత్రి ప్రగడగా సి.యస్.ఆర్. గారి నటన ఎన్ని సంవత్సరాలైన మరచిపోలేని విధంగా, అద్భుతంగా చేశారు.

    ReplyDelete
    Replies
    1. ఇంతకీ మీ పదనాన్న గారు ఎవరు? మాకు కూడా తెలిస్తే ఆనందిస్తాం కదా..

      Delete
  2. నటుడు సి.యస్.ఆర్. గారు వీరికి దగ్గరి బంధువు. జగదేక వీరుని కథ సినేమాలో మంత్రి ప్రగడ పాత్రలో గా నటించారు.

    ReplyDelete
  3. UG SriRam గారికి,
    నా బ్లాగును ఇంతగా అభిమానిస్తున్న మీకు నా ధన్యవాదాలు...అలాగే మా పెదనాన్న గారి మీద మీరు చేసిన కమెంటుకు కూడా ధన్యవాదాలు.సరాసరి రోజుకు 800 మంది(ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి మన తెలుగు వారు) నా బ్లాగును సందర్శిస్తున్నారంటే వారందరూ కూడా నా బ్లాగును అభిమానిసున్నట్లే. ఈ రోజున నేను వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనంతో, నలుగురికీ ఉపయోగపడేలా నా బ్లాగును చూపాలనుకునే నా ప్రయత్నానికి కొంతైన విజయం దొరికిందని మీ కమెంట్ చూసి గ్రహించేను. మీకు మరోసారి నా ధన్యవాదాలు.

    మీకోసం,
    చిలకలపూడి సత్యనారాయణ.

    ReplyDelete
  4. Voleti గారికి,

    తొలితరం తెలుగు నటుడు సి.ఎస్.ఆర్. గారు(పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు) మా పెదనాన్నగారు. మా నాన్నగారు చిలకలపూడి వెంకటరత్నం గారికి(భరణి పిక్చర్స్ & స్టూడియోస్)ఆయన పెద్దన్నయ్య.

    మీకోసం,
    చిలకలపూడి సత్యనారాయణ.

    ReplyDelete
  5. *నా ప్రయత్నానికి కొంతైన విజయం దొరికిందని మీ కమెంట్ చూసి గ్రహించేను.*
    మీరు కొంత విజయం అనటం సమంజసం కాదు. పూర్తి విజయం ఎప్పుడో సాధించారు. సుమారు వెయ్యికి పైగా టపాలను, క్రమం తప్పకుండా రోజు ప్రచూరించటం సామాన్యమైన విషయం కాదు. మీకు త్వరలో ఒక మంచి పుస్తకాన్ని బహుమతిగా, నా మిత్రుని ద్వారా పంపాలనుకొంట్టున్నాను. దానిని మీరు తప్పక తీసుకోవాలి. తిరస్కరించకండి.

    ReplyDelete