Monday, February 20, 2012

పెనవేసుకుని టనల్ లాగా కనబడే 300 సంవత్సరాల వయసు గల బీచ్ చెట్లు...ఫోటోలు

ఐర్లాండ్ లో "ది డార్క్ హెడ్జెస్" అని పిలువబడే ఈ చోటులో 300 సంవత్సరాలక్రితం స్టూవర్ట్ అనే ఒక కుటుంభం నివసించేదట.ఈ కుటుంభం ఇక్కడ పెద్ద భవనం కట్టుకుంది. వారి ఇంటికి వచ్చే అతిధులూ,భందువులూ ఈ భవనానికి వచ్చిన అనుభూతిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని వారి భవనానికి వచ్చే దారిపొడుగునా బీచ్ చెట్లను అమర్చేరు. అప్పుడు ఎలా ఉన్నదో తెలియదుగానీ ఇప్పుడు ఆ దారి ఎంతో అందంగా, అనుభూతిని మిగిల్చేదిగా ఉన్న్నది.

300 సంవత్సరాలక్రితం నాటబడిన ఆ బీచ్ చెట్లు ఇప్పుడు ఒకదానికొకటి పెనవేసుకుని ఒక ఆర్చ్ రూపంలో కనబడటం, దూరం నుండి చూస్తే అది ఒక ప్రక్రుతి టనల్ గానూ కనబడుతోంది. ఆ చెట్ల మధ్య నుండి పడే సూర్య కిరణాలు అద్బుతం గా కనబడతూ ఆనందాన్నిస్తాయట.

దైవ సంభందమున్న "గ్రే లేడీ" అనే ఒకామె ఆ చెట్ల మధ్య నుండి వెడుతూ ఉంటుందని, ఆమె ఈ చెట్లను కాపడిందని చరిత్ర కారులు చెబుతున్నారు.

3 comments: