Friday, February 10, 2012

2012 డిసెంబర్ 21 నిజంగా డూమ్స్ డేనా---కాదు.......వీడియో

మాయన్ కాలెండర్ చెప్పిన డూమ్స్ డే అంటే మీకు తెలిసే ఉంటుంది. డూమ్స్ డే గురించి చాలాసార్లు విన్నాం, చదివాం, చూశాం. అయినా ఇంకోసారి చెప్పుకుందాం. డూమ్స్ డే అంటే 2012 డిసెంబర్ 21న మహా ప్రళయం రాబోతోందని, ఆనాటితో లోకం అంతరిస్తుందని, మాయన్ కాలెండర్ ను నమ్ముతున్నవారు విస్తృత ప్రచారం జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రాసిన కాలజ్ఞానాన్ని గుర్తుచేసుకుందాం. కాలజ్ఞానం ప్రకారం కలియుగం చివర్లో లోకం నశిస్తుంది. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం. హిందూమత సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు మనం కలియుగం ప్రధమ పాదంలో ఉన్నాం. నాలుగో పాదం అంతమైనప్పుడు లోకం అంతరిస్తుందని వేదాలు చెప్పాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రాసిన దివ్య వాక్కులెన్నోఇప్పటికే నిజమయ్యాయని మీకు తెలుసు. కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రాసిన కాలజ్ఞానంలో కలియుగం 5 వేల నాటి వరకు ఉంటుందని చెప్పిన మాటను విస్మరించలేం.

అలాగే సైన్స్ పైన ఎక్కువగా ఆధారపడుతున్న దేశాలు కూడా మాయన్ కాలెండర్ ను నమ్ముతున్నవారు చేస్తున్న విస్త్రుత ప్రచారాన్ని త్రోసిపుచ్చేరు. ఇంతకు ముందు ఎంతోమంది ఇలా ప్రచారం చేసేరని, ఏ ఒక్కటి కూడా జరగలేదని చెబుతున్నారు.

No comments:

Post a Comment