Wednesday, December 28, 2011

వీటి గురించి కూడా తెలుసుకుందాం...

మధ్యప్రదేశ్ లో 100 మందికి పైగా "శంకర్ దాదా ఎంబిబియస్" లు

మధ్యప్రదేశ్ లో శంకర్ దాదా సముదాయం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.6 ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య చదువుతున్న సుమారు 114 మంది విధ్యార్ధులు మోసం చేసి ఈ కళాశాలలో సీట్లు సంపాదించేరట. అసలు భయం ఏమిటంటే ఇంతకు ముందే మోసం చేసి ఈ కాలేజీలలో చదువు పూర్తిచేసుకుని డాక్టర్ గిరి చేస్తున్నవారు చాలామంది ఉండవచ్చునని భావిస్తున్నారు.....విధ్యార్ధులు, చాలా వరకు డబ్బున్న కుటుంబాలకు చెందిన వారు. ఉత్తరప్రదేశ్, బీహార్ మరియూ మరికొన్ని ప్రాంతాల నుండి డాక్టర్ గా ఉంటున్న వారినీ, లేక బాగా తెలివితేటలున్న సీనియర్ విధ్యార్ధులను కోట్ల రూపాయకు కొనుక్కుని వీరి పేరు మీద వారిని ఎంట్రన్సె పరీక్షలు రాయించి కళాశాలలో అడ్మిషన్ తెచ్చుకున్నారట. ఫోటోలు మరియూ సిగ్నేచర్ లను ఫోర్జరీ చేసేరట.మధ్యవర్తులకు 20 లక్షల రూపాయల దాకా ముట్టినాయట.పోయిన నెలలోనే ఈ విషయాన్ని తెలుసుకున్నా నిన్ననే ప్రభుత్వం బయటపెట్టింది.ఎంబిబీయస్ పరీక్చలు కూడా డబ్బిచ్చే పాసైయుంటారని భావిస్తున్నారు.ప్రభుత్వ విచారణ కొనసాగుతోంది......కానీ ఈ దొంగ డాక్టర్ల దగ్గర ఎంతమంది అమాయక పేషంట్లు చిక్కుకున్నారో?...... "నేను నిజమైన డాక్టర్ ను" అనే బోర్డ్ పెట్టుకోవాలనే రూలు పెడితే బాగుంటుందేమో?


భగవద్గీతపై నిషేధం...రష్యా కోర్టు తిరస్కరణ

భగవద్గీతపై నిషేధం విధించాలని కోరుతూ సైబేరియా కోర్టులో వేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన రష్యాలోని హిందువులు విజయం సాధించారు. ఉగ్రవాద సాహిత్యంగా ముద్ర వేసి భగవద్గీతను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సైబేరియా కోర్టు బుధవారం తోసిపుచ్చింది. సైబేరియాలోని టోమ్స్క్ కోర్టు దానిపై తుది విచారణ చేపట్టింది. స్టేట్ ప్రాసిక్యూటర్ వాదనలను, హిందువుల ప్రతిస్పందనను విన్న జడ్జి పిటిషన్‌ను సమీక్షించి, భగవద్దీతను నిషేధించాలనే విజ్ఞప్తిని తోసిపుచ్చారు. స్టేట్ ప్రాసిక్యూటర్స్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందని ఇస్కోన్ రష్యా యూనిట్ నాయకుడు చెప్పారు. జూన్ నుంచి కేసు టోమ్స్క్ కోర్టులో నడుస్తోంది. నిషేధం విధించకుండా రష్యాతో దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని రష్యాలోని హిందువులు భారత ప్రభుత్వాన్ని కోరారు. భారత ప్రభుత్వం, మాస్కోలోని భారత దౌత్య కార్యాలయం విషయాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి.

సీఐఏ ఫ్యాక్ట్‌బుక్ ఇం డియా అగెనైస్ట్ కరప్షన్

భారత్‌లో రాజకీయ ఒత్తిడి సృష్టించే ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, వీహెచ్‌పీ, హురియత్ కాన్ఫరెన్స్ వంటి సంస్థల జాబితాలో అన్నా హజారే బృందాన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ చేర్చింది. సంస్థకు చెం దిన వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ ఇండియా పేజీలో అన్నా, ఆయనకు చెందిన ఇం డియా అగెనైస్ట్ కరప్షన్ సంస్థ పేరును డిసెంబర్ 20న నమోదు చేసేరట.

1 comment:

 1. అమెరికాకు యిలా లిష్షులు తయారు చేయటం ఒక పెద్ద హాబీ.
  ఎవరూ పట్టించుకోనవసరం లేదు.
  అయితే యితరదేశాలు ఇలాంటి లిష్టులు తయారు చేసే అవసరం యేమీ ఉండదు.
  ఎందుకంటే లిష్టులో ఉండేది ఒకే దేశ మేగా - అదే అమెరికా.
  అంతర్జాతీయ అత్యంత తలనొప్పి దేశం మరేదైనా ఉందా?

  ReplyDelete