Saturday, December 31, 2011

ఈ నూతన సంవత్సర రోజున జనవరి 1 న జరిగిన కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం

1772 - లండన్ లో మొట్టమొదటి ట్రావలర్స్ చెక్ ఇవ్వబడింది.

1788 – మొట్టమొదటి టైంస్ ఆఫ్ లండన్ న్యూస్ పేపర్ విడుదల చేయబడింది.

1877 – ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు.

1908 మొదటిసారిగా న్యూయార్క్ నగరంలో మధ్యరాత్రి నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం

1925 – అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు

1948 - భారత క్రికెట్ మ్యాచ్ లో బ్ర్రాడ్ మాన్ సెంచరీ

1959 – క్యూబన్ రెవల్యూషన్ తో కాస్ట్రో క్యూబా ప్రశిడెంట్

1962 – అమెరికా నౌకాదలం నావీ సీల్స్ ప్రారంభం

1971 – అమెరికా టీవీలో ధూమపాన సంభందిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది

1985 బ్రిటన్ లో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫోన్ వాడకం

నూతన సంవత్సర శుభాకాంక్షలతొ...మీకోసం ఆంగ్ల సంవత్సర క్యాలండర్ యొక్క చరిత్ర...వీడియో
Friday, December 30, 2011

స్పైన్ దేశం లో పిండి జల్లుకునే పండగ...ఫోటోలు

స్పైన్ దేశంలో ఏ పండగ వచ్చినా ఏదో ఒక వింత ఆచారం లేనిదే ఆ పండగ పూర్తిగాదు.టొమేటోలుతో కొట్టుకోవడమో,ఎద్దుల ఎదురుగా పరిగెత్తడమో లేక పిల్లలమీద నుండి ఎగరడమో ఇలా ఏదో ఒక వింత ఆచారం ఉంటుంది. సంవత్సరానికి ఒక సారి జరిగే ఎల్స్ ఎంఫరినాట్స్ అనే పండుగలో ఒకరి మీద ఒకరు పిండి జల్లుకోవడం చేస్తారు. వింత ఆచారాలు ఎలా ఉన్నా ప్రతి పండగనూ సరదాగా గడపడం వారికి ఎంతో సంత్రుప్తినిస్తుంది.


అన్య ప్రాణులు లాగా కనిపించే రంగురంగుల పట్టుపురుగులు...ఫోటోలు
Thursday, December 29, 2011

వింత గ్రామాలూ మరియూ పట్టణాలు...ఫోటోలు

అమెరికాలోని ఈ గ్రామ జనాభా కేవలం ఒకరు మాత్రమే


మొనోవీ అనే ఈ గ్రామములో 1930 లో 150 మంది నివసించేవారు. మిగిలిన అన్ని గ్రామాలలాగానే ఈ గ్రామములోని యువత కూడా పెద్ద పెద్ద నగరలాకు వలస వెళ్లేరు. 2000 లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామములో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళు భార్యాభర్తలు.2004 భర్త చనిపోయిన తరువాత భార్య మాత్రమే మిగిలింది. ఆమే ఈ నగరానికి మేయర్. టాక్స్ కడుతూ ఆమె ఇంటికి దగ్గరున్న 4 వీధి దీపాలకూ మరియూ రోడ్దుకూ ప్రభుత్వం నుండి ఉపాధి తెచ్చుకుంటుందిట.

ఫిలిపైన్స్ లో ఉన్న స్టిట్లిస్ గ్రామం

ఫిలిపైన్స్ లోని సమలేస్ ద్వీపాలలో ఇది ఒకటి.ఇక్కడున్న ప్రజలను బడ్జోస్ అంటారు. వీరు ముస్లీం మైనారిటీకి చెందిన వారు.వీరిని సీ జిప్సీస్ అని పిలుస్తారు.

రష్యా లోని "చ్చెస్ సిటీ"

చెస్ ఆట మీద ఎక్కువ ఉత్సాహం చూపే రష్యా ప్రెశిడెంట్ కిర్సాన్ ఇల్యుంజినావ్ ఈ సెటిల్మెంట్ గ్రామాన్ని నిర్మించేరు.చక్కటి రోడ్లు, అద్భుతమైన ఒక చ్చెస్ ప్యాలస్ మరియూ ఖరీదైన ఇళ్లు కలిగిన ఈ గ్రామమంలో ఎవరూ నివసించరట.

భారతదేశం లోని కవలల గ్రామం

కేరళాలోని కోధిని అనే ఈ గ్రామం 250 మంది కవల పిల్లలు ఉన్నారట. ఇది ప్రపంచ సరాసరి సంఖ్య కంటే 6 రెట్లు ఎక్కువట. ఇప్పుడు అక్కడి కవలల సంఖ్య 350 కి పెరిగిందట. 3 తరాల క్రితం మొదలైన ఈ కవల పిల్లల పుట్టుక ఈ గ్రామంలో అప్పటి నుండి పెరుగుతోందట. దీనికి కారనమేమిటా నని పరిశోధనలు చేస్తున్నారు.

ఈజిప్ట్ లోని గార్బేజ్ సిటీ

మన్షియాట్ నజర్ అనే ఈ గ్రామము ను గార్బేజ్ సిటీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడున్న గ్రామ వాసులు చెత్త్ ఏరుకుని దానిని నగరాలలో ఉన్న రీసైకిల్ కంపనీలకు అమ్ముకుని బ్రతుకు గడుపుతారట. ఈ గ్రామం చుటూ ఆధునిక నగరాలు ఉన్నాయట.

చైనా లోని మరుగుజ్జుల గ్రామం

ఇక్కడ నివసిస్తున్న వారందరూ మరుగుజ్జులే. 1.5 మీటర్ల ఎత్తుకంటే ఎక్కువ ఎత్తు ఉండరు. వీరి ఇళ్లు కూడా వింతగా ఉంటాయి. వీరు పాడే సంగీతం, వాయించే వాద్యాలూ కూడా వితగా ఉంటాయట.

ఆస్ట్రేలియా లోని భీమి క్రింద ఉండే పట్టణం

ఇది స్పటికతో నిండిన ఎడారి ప్రదేశం.భూమి ఉపరితలం మీద ఉండే వేడి నుండి తప్పించుకోవటానికి ఇక్కడున్న ప్రజలు భూమి క్రింద ఇళ్లు కట్తుకుని నివసిస్తున్నారట. భూమి పైన ఇళ్లు కట్టుకోవడాని అయ్యే ఖర్చు, భూమిని త్రవ్వి అక్కడ కట్టుకునే ఇళ్ల ఖర్చు ఒకటిగానే ఉంటుందట. ప్రపంచ మొత్తానికీ స్పటిక ఇక్కడి నుండే సరఫరా అవుతుందట. తవ్వుకున్న ఇంటి మట్తిని అమ్ముకుని జీవిస్తారట.

ప్రపంచానికే అతి దూరం గా ఉండే గ్రామం

ఎడింబరో ఆఫ్ ది సెవెన్ సీస్ అని పిలువబడే ఈ గ్రామం ప్రపంచ భూభాగానికే చాలా దూరం లో ఉన్న ఒక చిన్న ద్వీపకల్పం.

చైనాలోని హెవెన్స్ గేట్ కొండ...ఫోటోలు
Wednesday, December 28, 2011

వీటి గురించి కూడా తెలుసుకుందాం...

మధ్యప్రదేశ్ లో 100 మందికి పైగా "శంకర్ దాదా ఎంబిబియస్" లు

మధ్యప్రదేశ్ లో శంకర్ దాదా సముదాయం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.6 ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య చదువుతున్న సుమారు 114 మంది విధ్యార్ధులు మోసం చేసి ఈ కళాశాలలో సీట్లు సంపాదించేరట. అసలు భయం ఏమిటంటే ఇంతకు ముందే మోసం చేసి ఈ కాలేజీలలో చదువు పూర్తిచేసుకుని డాక్టర్ గిరి చేస్తున్నవారు చాలామంది ఉండవచ్చునని భావిస్తున్నారు.....విధ్యార్ధులు, చాలా వరకు డబ్బున్న కుటుంబాలకు చెందిన వారు. ఉత్తరప్రదేశ్, బీహార్ మరియూ మరికొన్ని ప్రాంతాల నుండి డాక్టర్ గా ఉంటున్న వారినీ, లేక బాగా తెలివితేటలున్న సీనియర్ విధ్యార్ధులను కోట్ల రూపాయకు కొనుక్కుని వీరి పేరు మీద వారిని ఎంట్రన్సె పరీక్షలు రాయించి కళాశాలలో అడ్మిషన్ తెచ్చుకున్నారట. ఫోటోలు మరియూ సిగ్నేచర్ లను ఫోర్జరీ చేసేరట.మధ్యవర్తులకు 20 లక్షల రూపాయల దాకా ముట్టినాయట.పోయిన నెలలోనే ఈ విషయాన్ని తెలుసుకున్నా నిన్ననే ప్రభుత్వం బయటపెట్టింది.ఎంబిబీయస్ పరీక్చలు కూడా డబ్బిచ్చే పాసైయుంటారని భావిస్తున్నారు.ప్రభుత్వ విచారణ కొనసాగుతోంది......కానీ ఈ దొంగ డాక్టర్ల దగ్గర ఎంతమంది అమాయక పేషంట్లు చిక్కుకున్నారో?...... "నేను నిజమైన డాక్టర్ ను" అనే బోర్డ్ పెట్టుకోవాలనే రూలు పెడితే బాగుంటుందేమో?


భగవద్గీతపై నిషేధం...రష్యా కోర్టు తిరస్కరణ

భగవద్గీతపై నిషేధం విధించాలని కోరుతూ సైబేరియా కోర్టులో వేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన రష్యాలోని హిందువులు విజయం సాధించారు. ఉగ్రవాద సాహిత్యంగా ముద్ర వేసి భగవద్గీతను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సైబేరియా కోర్టు బుధవారం తోసిపుచ్చింది. సైబేరియాలోని టోమ్స్క్ కోర్టు దానిపై తుది విచారణ చేపట్టింది. స్టేట్ ప్రాసిక్యూటర్ వాదనలను, హిందువుల ప్రతిస్పందనను విన్న జడ్జి పిటిషన్‌ను సమీక్షించి, భగవద్దీతను నిషేధించాలనే విజ్ఞప్తిని తోసిపుచ్చారు. స్టేట్ ప్రాసిక్యూటర్స్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందని ఇస్కోన్ రష్యా యూనిట్ నాయకుడు చెప్పారు. జూన్ నుంచి కేసు టోమ్స్క్ కోర్టులో నడుస్తోంది. నిషేధం విధించకుండా రష్యాతో దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని రష్యాలోని హిందువులు భారత ప్రభుత్వాన్ని కోరారు. భారత ప్రభుత్వం, మాస్కోలోని భారత దౌత్య కార్యాలయం విషయాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి.

సీఐఏ ఫ్యాక్ట్‌బుక్ ఇం డియా అగెనైస్ట్ కరప్షన్

భారత్‌లో రాజకీయ ఒత్తిడి సృష్టించే ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, వీహెచ్‌పీ, హురియత్ కాన్ఫరెన్స్ వంటి సంస్థల జాబితాలో అన్నా హజారే బృందాన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ చేర్చింది. సంస్థకు చెం దిన వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ ఇండియా పేజీలో అన్నా, ఆయనకు చెందిన ఇం డియా అగెనైస్ట్ కరప్షన్ సంస్థ పేరును డిసెంబర్ 20న నమోదు చేసేరట.