Sunday, November 20, 2011

అరోరా ధృవముల వద్ద ఆకాశము లో రాత్రి పూట కనపడే వెలుగు(అరోరా బొరియాలిస్) ఎలా ఏర్పడుతోంది...వివరణ వీడియో

అరోరా ధృవముల వద్ద ఆకాశము లో రాత్రి పూట కనపడే వెలుగు. ఉత్తర దేశముల లో దీనిని అరోరా బొరియాలిస్ అంటారు. 'అరోరా' అంటే రోమన్ లో ప్రత్యూషము(ఉదయము)నకు దేవత. 'బొరియాస్' అంటే గ్రీకు లో ఉత్తర పవనములు. ఐరోపా లో ఉత్తర దిశ లో ఎర్రని వెలుగు వలే కనపడి , సూర్యుడు ఉత్తరాన ఉదయిస్తున్నాడే మో అనిపిస్తుంది. ఉత్తర ధృవము లో ఉత్తర దిక్కు నుండి కనపడుతుంది కనుక అరోరా బొరియాలిస్ నే ఉత్తర వెలుగులు అని కూడా అంటారు. అరోరా బొరియాలిస్ సాధారంగా సెప్టెంబరు-అక్టోబరుల మధ్య లో, మార్చ-ఏప్రిల్ మధ్య లో వస్తుంది. దక్షిణ భాగము లో అరోరా ఆస్ట్రియాలిస్ కూడా అవే ధర్మాలు ఉన్నాయి. ఆస్ట్రియాలిస్ అంటే లాటిన్ లో దక్షిణము.

No comments:

Post a Comment