Friday, November 25, 2011

చైనా "ఎ వరల్డ్ వితౌట్ ఎండ్" గా పేరు పొందింది...ఫోటోలు

చైనా అని సాధారణంగా పిలువబడే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, మరియు ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశంగా చైనా ఉన్నది.

200 సంవత్సరాల క్రితమే కలపగుజ్జు నుంచి పేపరస్ పేరుతో కాగితం తయారీని కనిపెట్టారు. మొట్టమొదటిసారి ముద్రణాయంత్రం తయారు చేసింది చైనా వారే. ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్)ని చైనీయులు కనుగొన్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల్ని కూడా దీని ద్వారానే గుర్తించారు. తొమ్మిదో శతాబ్దంలో కనిపెట్టిన గన్పౌడర్ ఆధారంగానే టపాసులు(బాణాసంచా) పుట్టుకొచ్చాయి.
ప్రపంచం చీనాంబరాలుగా చెప్పుకునే పట్టు వస్త్రాలను క్రీస్తుకు పూర్వం 3630 సంవత్సరాల క్రితమే చైనా అల్లింది. ప్రపంచ వాణిజ్యంలో పై చేయి సాధించింది. క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఇద్దరు యూరోపియన్లు సన్యాసుల వేషంలో చైనా వెళ్ళి చేతి కర్రల్లో పట్టుపురుగులను తీసుకొచ్చేవరకూ ఆ రహస్యం ప్రపంచానికి తెలియనేలేదు.

రోజూ పళ్ళు తోముకునే అలవాటును నేర్పించింది చైనావాళ్ళే అని చెప్పవచ్చు. 1400లోనే వాళ్ళు టూత్బ్రెష్తో తోముకున్నారు! ఐస్క్రీం పుట్టింది కూడా ఇక్కడే. క్రీస్తు పూర్వం 2000 నాడే పాలతో కలిపిన బియ్యాన్ని మంచులో ఉంచి తినేవారు. తేదీలు, ముహూర్తాలు చూస్తే క్యాలెండర్ని కూడా క్రీ.పూ. 2600 ల్లోనే రూపొందించారు.చైనీయులు క్రీస్తుకు వందేళ్ళ క్రితమే టీ తయారీని కనిపెట్టి, క్రీస్తుశకం 200 ఏళ్ళకల్లా ప్రజల్లోకి టీ ఒక పానీయంగా ప్రాచుర్యం లోనికి తెచ్చారు.ముడుచుకునే గొడుగును పరిచయం చేసింది కూడా చైనీయులే.

ఇంకా చెప్పాలంటే ఎన్నో.

ఈ దేశంలో సెలెబ్రిటీ అవటం చాలా కష్టం. ప్రపంచములోనే ఎక్కువ జనాభా గల దేశముగా ఉంటున్న చైనా ప్రతి విషయములోనూ పురోగతి సాధించింది. ఎడ్వర్డ్ బర్టిన్ స్కై అనే ఫోటోగ్రాఫర్ ఆధునిక చైనా ను తన కెమేరాతో చిత్రీకరించేడు. ఈయన తీసిన ఫోటోలు పలు దేశాల మ్యూజియం ల లో ఉంచేరు.



















2 comments:

  1. తు చ తప్పకుండ అక్షరసత్యం !!
    ఒక మారు ఇది కూడా చూడగలరు

    http://thesundayindian.com/te/story/if-we-want-a-povertyfree-india-every-indian-politician-must-begin-their-career-with-a-trip-to-china/1387/

    ?!

    ReplyDelete