Tuesday, November 22, 2011

వీటిని కూడా తెలుసుకుందాం

1)పెరుగుతున్న డాలర్ విలువ...తగ్గుతున్న రూపాయ విలువ



అమెరికన్ డాలర్ విలువ కొద్ది నెలలుగా అనుకోనంతగా పెరిగింది.ఈ రోజు 1 డాలర్ విలువ రూ.52.16 గా ఉన్నది. కొన్ని రోజులలో డాలర్ విలువ రూ.55 కు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

1952 లో డాలర్ విలువ రూ.5.00
1970 లో డాలర్ విలువ రూ.7.58
1985 లో డాలర్ విలువ రూ.12.37
1995 లో డాలర్ విలువ రూ.32.43
2000 లో డాలర్ విలువ రూ.45.00
2007 లో డాలర్ విలువ రూ.38.48
2008 లో డాలర్ విలువ రూ.48.88

2011 ఏప్రెల్ నెలలో డాలర్ విలువ రూ.44.17 గా ఉండేది. కానీ ఈ రోజు డాలర్ విలువ రూ.52.16 కు పెరిగింది.

అమెరికా అర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని కనుక రూపాయ విలువ పెరుగుతుందని ఇంతకుముందు మన ఆర్ధిక నిపుణులు తెలిపేరు.

మరి ఇప్పుడు రూపాయ విలువ ఎందుకు తగ్గుతోందో, డాలర్ విలువ ఎందుకు పెరుగుతోందో....?


2)ఫేస్ బుక్ మన ఉనికిని వెంటాడుతోంది



ఫేస్ బుక్ ను మీరు మీ కంప్యూటర్ నుండి ఒక సారి లాగ్ చేసినా మీరు లాగ్ అవుట్ అయిన తరువాత మీరు ఏ ఏ వెబ్ సైట్లను విసిట్ చేస్తున్నారో తెలుసుకుంటోందట. దీనిని ఫేస్ బుక్ వారు ఒప్పుకున్నారు.ఇలా చేయడం వలన ఫేస్ బుక్ వాడుతున్న వారి యొక్క ప్రైవసీ దోచుకోబడుతోంది. మీకు ఫేస్ బుక్ లో అకౌంట్ లేక పోయినా మీరు ఫేస్ బుక్ పేజ్ ఓపెన్ చేసినా కూడా మిమ్మల్ని వారు వెంటాడుతూనే ఉంటారట.

ట్రాకింగ్ కుక్కీస్ టెక్నాలజీ ఉపయోగించి ఈ పని వారు చేయగలుగుతున్నారు. ఫేస్ బుక్ ఓపెన్ చేసిన వెంటనే వారి సైట్ లో ఉంచిన కుకీస్ మీ బ్రౌజర్లోకి వెడతాయి. మీరు కంప్యూటర్ షట్ డౌన్ చేసేంతవరకూ వారి కుకీస్ మీరు విసిట్ చేసే వెబ్ సైట్లు మరియూ మిగిలిన వివరాలూ తెలుసుకుంటుందట. ఈ వివాదస్పదమైన టెక్నాలజీని గూగుల్,అడోబ్,మైక్రోసాఫ్ట్,యాహూ మరియూ మరికొన్ని కంపెనీలు కూడా ఉపయోగిస్తున్నారు.......ఇలాంటి టెక్నాలజీ వాడకంలో ఉండబట్టే ఇంటర్ నెట్ వాడే వారి పర్సనల్ డాటా దొంగలించబడుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఈ టెక్నాలజీ అవసరమా? అందులోనూ సొషియల్ నెట్ వర్కింగ్ సైట్లకు ఈ టెక్నాలజీతో అవసరమేమిటో?


3)పాకిస్తాన్ తీవ్రవాది కశాబ్ పై పెట్టిన ఖర్చు 16 కోట్లు దాటింది



26/11/2008 న ముంబైలో 100 మంది అమయాకులను దారునంగా కాల్చి చంపిన ఆజ్మల్ కశాబ్ భారతీయుల ప్రాణాలతో పాటూ డబ్బును కూడా దోచుకుంటున్నాడు.ఇంతవరకు అతని మీద మహారాష్ట్ర ప్రభుత్వం 16.17 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది.సెషన్స్ కోర్టు కశాబ్ కు ఉరిశిక్చ వేసినా అది ఇంకా నెరవేర్చలేదు కాబట్టి కశాబ్ మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది.
కశాబ్ కోసం ప్రత్యేకంగా నిర్మించ బడ్డ సెల్...5.29 కోట్లు.
కశాబ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సెక్యూరిటీ ఖర్చు...10.87 కోట్లు.
కశాబ్ తిండికి అయిన ఖర్చు...27,500.
కశాబ్ ను ఆరోగ్యంగా ఉంచటానికి అయిన ఖర్చు 29,950.

ఇలా అతని కోసం ప్రజల సొమ్మును వ్రుధా చేస్తోంది ప్రభుత్వం. ఇది ఎంతవరకు న్యాయం.

No comments:

Post a Comment