Wednesday, November 23, 2011

డ్యామ్ 999 సినిమాను భారతదేశంలో నిషేధించమంటున్నారు...వివరణ మరియూ సినిమా ట్రైలర్ వీడియో

తమిళనాడుకు చెందిన ఎం.పి లు ఈ రోజు ప్రధాణ మంత్రిని కలిసి డ్యామ్999 సినిమాను భారతదేశంలో నిషేదించవలసినదిగా అడిగేరు.తమిళనాడులో డ్యామ్ 999 సినిమాను నిషేధించాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కేరళ రాష్ట్రం థెక్కడైలోని ముల్లై పెరియార్ డ్యామ్పై తమిళలకూ హక్కు ఉంది. అయితే డ్యామ్ కట్టలు దెబ్బతిన్నాయని చెబుతూ కేరళ ప్రభుత్వం మరో డ్యామ్ నిర్మాణానికి చర్యలు తీసుకుటోంది. ఇది జరిగితే తమిళనాడు ఆ డ్యామ్పై హక్కులు కోల్పోతుంది. ఈ సమస్యపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. కాగా, ముల్లై పెరియార్ డ్యామ్ కూలిపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్న ఇతివృత్తంతో కేరళకు చెందిన హోసన్ రాయ్ డ్యామ్ 999 చిత్రాన్ని నిర్మించారు.

ముల్లై పెరియార్ డ్యామ్కు ఈ చిత్రానికి సంబంధంలేదని, 1975లో చైనాలో చోటు చేసుకున్న ఓ డ్యామ్ ప్రమాదాన్ని ఆధారంగానే ఈ చిత్రం నిర్మించామని దర్శకుడు హోసన్ తెలిపారు.



No comments:

Post a Comment