Sunday, October 30, 2011

చైనాలోని డబ్బున్న గ్రామంలో ఎత్తైన హోటల్...ఫోటోలు

డబ్బు గల దేశాలకు ఎంతమాత్రం తీసిపోని చైనాలోని డబ్బుగల గ్రామం హౌక్సీలో 328 మీటర్ల ఎత్తుగల హోటల్ నిర్మించేరు. దీని మొత్త ఖరీదు 470 మిల్లియన్ డాలర్లు. హౌక్సీ గ్రామం యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ హోటల్ ను కట్టేరు.





74 అంతస్తులు కలిగిన ఈ ఎత్తైన హోటల్ ప్రపంచములోని 15 వ ఎత్తైన కట్టడముగా గుర్తించబడినది. ప్యారీస్ లోని ఈఫిల్ టఫర్ మరియూ న్యూయార్క్ లోని క్రిస్లర్ బిల్డింగ్ ల కన్నా ఎత్తైనది.




హౌక్సీ అనే ఈ గ్రామం ఒకప్పుడు అతి బీద గ్రామంగా ఉండేది. చైనాలో ఆర్ధీక పునరుద్ధారణ సంస్కరణ తరువాత ఈ గ్రామం లోని జనాభా 1600 నుండి 50,000 పెరిగింది. ఈ మధ్య వెలువడించిన గణాంకాల ప్రకారం ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఒక సొంత ఇళ్లు, 2 కార్లు మరియూ 2,50,000 డాలర్ల సేవింగ్స్ ఉన్నట్లు తెలిసింది. ఈ గ్రామ వాసులకు ప్రభుత్వ ఉచిత ఆరోగ్య వసతులూ మరియూ ఉచిత చదువు లభిస్తోంది. ఈ గ్రామ అభివ్రుద్ది చూసిన తరువాత చైనా అర్ధీకంగా ఎంత పెరుగుదలను పొందిందో ఊహించుకోవచ్చు.



పూర్తిగా బంగారంతో చేయబడ్డ విగ్రహం.

3 comments: