Monday, October 31, 2011

స్పైన్ దేశ రాజధాని లో నిరసన వ్యక్తం చేస్తున్న గొర్రెలు...ఫోటోలు

మేతకోసం గొర్రెలూ మరియూ పసువులూ నగరాలలోనికీ రావడం గానీ నగర వీధులలోనుండి మరొచోటికి వెళ్ళడానికి గానీ వీలులేదని స్పైన్ దేశం కొత్త చట్టాలను తీసుకు వచ్చింది. దీనికి ముఖ్య కారణం అవి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడమే.

ఈ కొత్త చట్టానికి నిరసన తెలపటం కోసం గొర్రెల యజమానుల సంఘం ప్రెసిడెంట్ మరియూ ఆవుల యజమానుల సంఘం ప్రెసిడెంట్ లు కలిసి 5000 గొర్రెలను తీసుకుని స్పైన్ దేశ రాజధాని మాద్రిడ్ వీధులలో తమ నిరసన వ్యక్తంచేసేరు.

ఒకప్పుడు గ్రామము గా ఉన్న మాద్రిడ్ ఇప్పుడు గొప్ప రాజధానిగా మారింది.అయినప్పటికీ రాజధాని వీధులను దాటి మరో చోటుకు వెళ్ళడానికి తమకు హక్కు ఉన్నదని, కాలాలను బట్టి మేత కోసం 78,000 మైళ్లు వలస వెళ్లడం గత 800 సంవత్సరాలుగా జరుగుతున్నదని, ఈ రోజు గ్రామాలు నగరాలుగా మారినంత మాత్రానా చట్టాలతో ఆంక్షలు విధించరాదని అది తమ మేత హక్కులను ఉల్లంఘించినట్లౌతుందని తెలియజెప్పే విధముగా నిరసనలు చేయబడ్డాయి. గత 18 సంవత్సరాలుగా ట్రాఫిక్కు ను ఆపి రోడ్లను దాటి వెళ్ళేవి. ఇప్పుడు కొత్తగా అసలు నగరంలోనికి రాకూడదనే చట్టం ప్రవేసపెట్టడమే ఈ నిరసనకు కారణము.

ఫోటోల క్రెడిట్....ఫ్లికర్ .కాం

ప్లాస్టిక్ చెత్త నుండి పెట్రోల్ తయారుచేసే మిషెన్...వీడియో

నెదర్లాండ్ లోని "ఫ్లయింగ్ డ్రా బ్రిడ్జ్"...ఫోటోలుSunday, October 30, 2011

చైనాలోని డబ్బున్న గ్రామంలో ఎత్తైన హోటల్...ఫోటోలు

డబ్బు గల దేశాలకు ఎంతమాత్రం తీసిపోని చైనాలోని డబ్బుగల గ్రామం హౌక్సీలో 328 మీటర్ల ఎత్తుగల హోటల్ నిర్మించేరు. దీని మొత్త ఖరీదు 470 మిల్లియన్ డాలర్లు. హౌక్సీ గ్రామం యొక్క 50 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ హోటల్ ను కట్టేరు.

74 అంతస్తులు కలిగిన ఈ ఎత్తైన హోటల్ ప్రపంచములోని 15 వ ఎత్తైన కట్టడముగా గుర్తించబడినది. ప్యారీస్ లోని ఈఫిల్ టఫర్ మరియూ న్యూయార్క్ లోని క్రిస్లర్ బిల్డింగ్ ల కన్నా ఎత్తైనది.
హౌక్సీ అనే ఈ గ్రామం ఒకప్పుడు అతి బీద గ్రామంగా ఉండేది. చైనాలో ఆర్ధీక పునరుద్ధారణ సంస్కరణ తరువాత ఈ గ్రామం లోని జనాభా 1600 నుండి 50,000 పెరిగింది. ఈ మధ్య వెలువడించిన గణాంకాల ప్రకారం ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఒక సొంత ఇళ్లు, 2 కార్లు మరియూ 2,50,000 డాలర్ల సేవింగ్స్ ఉన్నట్లు తెలిసింది. ఈ గ్రామ వాసులకు ప్రభుత్వ ఉచిత ఆరోగ్య వసతులూ మరియూ ఉచిత చదువు లభిస్తోంది. ఈ గ్రామ అభివ్రుద్ది చూసిన తరువాత చైనా అర్ధీకంగా ఎంత పెరుగుదలను పొందిందో ఊహించుకోవచ్చు.పూర్తిగా బంగారంతో చేయబడ్డ విగ్రహం.

"వాటర్ స్ప్రిన్ క్లింగ్ ఫెస్టివల్"(Water-Sprinkling Festival)....ఫోటోలు

కంబోడియా, లావోస్, మయన్మార్, తాయ్ లాండ్ మరియూ మరికొన్ని దక్షిణ ఆసియా దేశాలలొ ఈ పండుగని జాతీయ పండుగుగా జరుపుకుంటారు. 3 నుండి 7 రోజులు జరిగే ఈ పండుగను వేసవి కాలంలో జరుపుకుంటారు. ఒకరిమీద ఒకరికి ఆదరాభిమానాలు మరియూ జాతీయ స్వభావమూ తెలుపుకోవడానికి జరిపే ఈ పండుగలో చిన్నవారి దగ్గర నుండి పెద్దవారి వరకు పాల్గొంటారు.

125 సంవత్సారాలు పూర్తిచేసుకున్న లిబర్టీ విగ్రహం--విగ్రహంలో ఉన్న ముఖం ఎవరిది?.....ఫోటోలు మరియూ వీడియో

అమెరికా లో పర్యాటకులకు స్వాగతం పలికే చారిత్రాత్మక లిబర్టీ విగ్రహానికి 125 సంవత్సరాలు నిండాయి 46 దేశాల నుండి 125 మంది విదేశీయులతో లిబర్టీ విగ్రహ జన్మదినం అంగరంగ వైభవంగా జరిగింది .సుమారు 12 నిమిషాల పాటు ఆకాశంలో టపాసుల కాంతులతో నిండిపోయింది. కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయులు చాలా సంతోషం వ్యక్తం చేసారు . గత సంవత్సరం నుండి లిబర్టీ విగ్రహం యొక్క మరమత్తు కార్యక్రమాలు చాలా మమ్మరంగా సాగాయి .

అమెరికా అంటేనే మొదటగా మనకు గుర్తొచ్చేది ఏంటో మీకందరికీ తెలిసే ఉంటుంది. అదే "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ" విగ్రహం. పైకి ఎత్తి ఉంచిన కుడిచేతిలో ప్రకాశవంతంగా వెలుగుతున్న కాపర్ టార్చ్ (దివిటీ) ఉంటే... ఎడమచేతి పిడికిలో ఏదో గట్టిగా పట్టుకుని ఉంటుంది.

ఇంతకీ విగ్రహం ఎడమచేతి పిడికిలిలో ఏముంటుందో మీకు తెలుసా...?! ఆ మూసి ఉంచిన గుప్పిట్లో జూలై 4, 1776 అనే అంకెలు ఉన్న ఒక ఫలకం ఉంటుంది.అమెరికాకు జూలై 4, 1776 సంవత్సరంలో వచ్చింది. ఇక, "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ" అంటే... "లిబర్టీ ఎన్‌లిటింగ్ ది వరల్డ్" అని అర్థమన్నమాట...!

‘‘వలస వచ్చే విదేశీయులందరినీ రెండు చేతులూ చాచి అక్కున చేర్చుకుంటున్న ఓ స్వేచ్ఛాదేవీ! నీ ఆదరానికి నేను అర్హుడనేనని రుజువు చేసుకునే అవకాశమివ్వు’’. దాదాపు శతాబ్దం క్రితం అమెరికాకు వలస వస్తున్న ఒక ప్రవాసి న్యూయార్క్ హార్బర్‌లో ఓడ ప్రవేశిస్తుం డగా ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ని చూసిన వెంటనే పలికిన పలుకులివి. నేటికీ అది అక్కడ అలాగే నిలిచి ఉంది. ఒక చేత అమెరికా రాజ్యాంగాన్ని, మరో చేత స్వేచ్ఛాజ్యోతిని ధరించిన ‘లిబర్టీ స్టాచ్యూ’ అమెరికాకు ఫ్రాన్స్ అందించిన కానుక. బానిసత్వానికి వ్యతిరేకంగా అమెరికాలో సాగిన అంతర్యుద్ధ విజయం నేపథ్యంలో ప్రపంచానికి ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ నినాదాలను అందించిన ఫ్రాన్స్ దేశపు శిల్పి ఫ్రెడరిక్ అగస్టె బాతోల్‌డీ మలిచి అందించిన కానుక. బాతోల్‌డీ ప్రాచీన గ్రీసు స్వేచ్ఛాదేవత లిబర్తాస్ స్ఫూర్తితో దాన్ని మలిచాడు.

1865లో బాతోల్‌డీ బుర్రలో ప్రవేశించిన ఆ ‘శిల్పానికి’ భారీ నిధులు అవసరం కావడమేగాదు, అడుగడునా అవాంతరాలే. మూడవ నెపోలియన్ చక్రవర్తి హయాంలో అలాంటి ఆలోచన చేయడమంటే కొరివితో తలగోక్కోవడమే. అందుకే 1874లో నెపోలియన్ పతనమయ్యేవరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తదుపరి పన్నేండేళ్లపాటు బాతోల్‌డీ అదే జీవి త లక్ష్యం అన్నట్టుగా ఆ పనికి అంకితమయ్యాడు. 151 అడుగుల 1 అంగుళం పొడవైన విగ్రహాన్ని రాగి పలకలతో తయారు చేయడానికి పూనుకున్నాడు. రాగి పలకలకు దన్నుగా ఉం టూ సముద్రపు గాలుల తాకిడికి శిల్పం కదులుతున్నట్టు అనిపించేలా లోపలి భాగాన్ని ఇనుప కడ్డీలు తదితర సామగ్రితో తయారు చేశారు.

జ్యోతిలోకి, కిరీటంలోకి ఎక్కడానికి వీలుగా రెండు మెట్ల వరుసలను ఏర్పాటు చేశారు. విడిభాగాలుగా తయారుచేసిన ఈ భారీ శిల్పాన్ని లిబర్టీ దీవి(బెడ్లో దీవి)లో అమర్చడానికి విశాలమైన పీఠాన్ని తయారు చేయడానికి అమెరికా అంగీకరించింది. 1886 అక్టోబర్ 28న ‘లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ’ను ఆవిష్కరించిన నాటి అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ ‘‘ప్రపంచమంతటా స్వేచ్ఛా వెలుగులు ప్రసరించే వరకూ ఈ జ్యోతి వెలుగులు అజ్ఞాన తిమిరాన్ని, మానవ పీడనను తుత్తునియలు చేస్తూనే ఉంటాయి’’ అంటూ సందేశమిచ్చారు.

అమెరికన్ విప్లవం విజయానికి గుర్తుగా 1886లో వందో సంవత్సర వేడుకలను జరుపుకునే సందర్భంలో అమెరికన్ ప్రజానీకానికి... ఫ్రెంచ్ ప్రభుత్వం "స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ" విగ్రహాన్ని కానుకగా సమర్పించింది. అమెరికా యొక్క ప్రత్యేక గుర్తింపుగా మిగిలిన ఈ ప్రఖ్యాత శిల్పం న్యూయార్క్ ఓడను చేరుకున్న రోజునే చరిత్రలో జూన్ 17 ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

దీని అధికారిక నామం "లిబర్టీ ఎన్‌లైటింగ్ ది వరల్డ్". పైకి ఎత్తి ఉంచిన కుడిచేతిలో ప్రకాశవంతంగా వెలుగుతున్న కాపర్ టార్చ్ (దివిటీ)తో, ఎడమచేతి పిడికిలో ఏదో గట్టిగా పట్టుకుని ఉన్నట్లుగా ఉంటుందీ విగ్రహం. కాగా, ఈ విగ్రహంలో కాగడా పట్టుకున్న చేతి పొడవు 42 అడుగులు కాగా... విగ్రహం మొత్తం పొడవు 151 అడుగులు ఉంటుంది.


స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని... విప్లవ సమయంలో ఇరుదేశాల నడుమగల స్నేహ సంబంధాలను గుర్తుగా ఫ్రెంచి ప్రభుత్వం అక్టోబర్ 28, 1886న బహూకరించింది. ఇదిలా ఉంటే... ఈ విప్లవ యుద్ధంలో విజయం సాధించాలంటే.. అమెరికాకు ఫ్రెంచివారి సహాయ సహకారాలు అత్యవసరమైనాయి. దీంతో స్నేహ హస్తాన్ని చాచిన ఫ్రెంచి ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా సైన్యాన్ని, యుద్ధ ఓడలను, ఆయుధాలను, డబ్బును సమకూర్చింది.
Friday, October 28, 2011

బెర్లిన్ "ఫెస్టివల్ ఆఫ్ లైట్స్" పండుగ...ఫోటోలు మరియూ వీడియో

జెర్మనీ దేశంలోని బెర్లిన్ నగరంలో 7వ సారిగా అక్టోబర్-2011 లో జరిగిన "ఫెస్టివల్ ఆఫ్ లైట్స్" పండుగ జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 23 వరకు ఈ పండుగను జరుపుకుంటారు. అప్పుడు బెర్లిన్ నగరములోని ముఖ్య ప్రదేశాలను రంగు రంగుల లైట్ల వెలుతురుతో అలంకరిస్తారు. బెర్లిన్ నగరం ఈ లైట్ల వెలుతురులో అద్భుతంగా కనబడుతుంది.