Wednesday, August 31, 2011

తిరుమల కొండలో స్వామివారి ఆకారం..ఎప్పుడైనా చూసేరా...ఫోటోలు

ఇది తిరుమల కొండ


ఈ ఫోటోను 90 డిగ్రీలు వెనుకకు తిప్పితే


మీకు ఇంకా ఏమైనా కన్ ఫ్యూషన్ ఉంటే ఈ ఫోటో చూస్తే అర్ధమౌతుంది


......నేను ఇంతవరకు తిరుమల కొండ ఇలా స్వామివారి రూపంతో ఉంటుందని అనుకోలేదు.......

Tuesday, August 30, 2011

భారతదేశ విలాస రైలు "మహారాజా ఎక్స్ ప్రెస్"....ఫోటోలు

భారతదేశానికి టూరిస్టులుగా వచ్చే విదేశీయులను ఆకర్శించడానికి ప్రవేసపెట్టబడింది ఈ రైలు. రాయల్ ఇండియన్ రైల్ టూర్స్ వారు ఏర్పాటు చేసిన భారత్ టూర్ యొక్క అందమైన మరియూ విలాసమైన రైలు.

ఈ రైలులో 7 రోజుల టూరిస్ట్ ప్రయాణానికి ఒక క్యాబిన్ ఖరీదు రూ.2,12,000($4725) నుండి రూ.9,00,000 ($17,500) ప్యాకేజ్.డిల్లీ నుండిఆగ్రా,గ్వాలియర్,కుజూరహో,బాంద్వగర్,వారణాసి,లక్నో మరియూ డిల్లీకి తిరుగు ప్రయాణం.

ఇలా ఎన్నో టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి.

LCD టీ.వీ లు, DVD ప్లెయేర్స్, డైరెక్ట్ డయలింగ్ ఫోన్, సేఫ్ డెపాసిట్ లాకర్స్,ఇంటర్ నెట్ తో పాటూ మరెన్నో వసతులు కలిగి యున్నది.


రాజీవ్ గాంధీ హంతకుల ఉరిశిక్ష అమలుపై మద్రాస్ హైకోర్టు స్టే

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితులకు కొంత ఊరట లభించింది. రాజీవ్ హంతకులకు సెప్టెంబర్ 9న అమలు చేయనున్న ఉరిశిక్షపై మద్రాస్ హైకోర్టు నేడు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం నిందితుల క్షమాబిక్ష కొరికపై 11 సంవత్సరాలు ఆలస్యం చేయటాన్ని ముఖ్య కారణంగా కోర్టు తెలుపుతూ ఎనిమిది వారాల పాటు ఉరిశిక్ష అమలును న్యాయస్థానం నిలిపివేసింది. నిందితుల తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదించారు. మరోవైపు రాజీవ్ హంతకులకు ఉరిశిక్ష రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

Monday, August 29, 2011

పారిపోయిన లిబియా అధ్యక్షుడు ముమ్మార్ గడాఫీ ఇంట్లో తిరుగుబాటుదార్లు...ఫోటోలుయూ.ఎఫ్.ఓ (U.F.O)ను వెంటాడుతున్న జెట్ విమానాలు....2 వీడియోలు

2003 లో యూక్రైన్ దేశంలో జరిగిన ఏర్ షో లో అనుకోకుండా ఒక యూ.ఎఫ్.ఓ కనబడిందట. ఏర్ షో లో పాల్గొన్న జెట్ విమానాలలో 2 జెట్ విమానాలు ఆ యూ.ఎఫ్.ఓ ను వెంటాడినై. కొన్ని నిమిషాల తరువాత యూ.ఎఫ్.ఓ ను వెంటాడిన విమానాలలో ఒక్ జెట్ విమానం ప్రమాదానికి గురై పడిపోయింది. ఏర్ షో ను వీడియో తీస్తున్న వారు, వారు తీసిన వీడియో ఫుటేజ్ లో యూ.ఎఫ్.ఓ కు దగ్గరగా ఒక ఆయుధం జెట్ విమానానికి తగలడం చూసేరు. ఆ తరువాత ఎంత పరిశోధన చేసినా ఆ యూ.ఎఫ్.ఓ గురించి తెలుసుకోలేక పోయేరట.
2 నిమిషాలలో 20 ట్రిక్స్ చేసి చూపిన చిలుక...వీడియో


Sunday, August 28, 2011

చూడదగిన ఇసుక కోటలు...ఫోటోలు

ఒరెగాన్ లోని కెనన్ బీచ్ లో జరిగిన పోటీలలోని ఫోటోలు. సముద్రపు అలలు వచ్చి వెల్లిన వెంటనే పోటీ ప్రారంభిస్తారు. అక్కడ మరో సముద్రపు అల రావడానికి 6 గంటలు పడుతుందట. ఆ సమయాన్ని ఉపయోగించుకుని పోటీలో పాల్గొన్న వారు ఇసుకతో బొమ్మలు తయారుచేయాలి. ఈ పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేస్తారు. డబ్బు బహుమతి మాత్రం ఉండదు.

అమెరికా ఈస్ట్ కోస్ట్ ను భయపెడుతున్న హరికేన్ ఐరెనే వేగం చూడండి...వీడియో


ఫోటోలే కనులకు నిజమైన విందు...ఫోటోలు