Thursday, June 30, 2011

జూలై నెల 2011 యొక్క ముఖ్యత్వం గురించి తెలుసుకోండి

ఈ నెల చాలా ముఖ్యమైన మరియూ అద్రుష్టమైన నెల.ఈ నెల క్యాలండర్ చూడండి. ఈ నెలలో ఒక విశేషమున్నది. ఈ నెలలో మాత్రమే అంటే జూలై -2011 లో మాత్రమే 5 శుక్రువారాలూ, 5 శనివారాలు మరియూ 5 ఆదివారాలు ఉంటాయి.

ఇలాంటి క్యాలండర్ మరోసారి మన జీవితకాలంలో చూడలేము. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి నెల రావాలంటే 823 సంవత్సరాలు పడుతుందట.

అందుకని ఈ నెలని డబ్బుల నెలగా చెబుతున్నారు. ఈ నెలలో ఎవరికీ డబ్బుకొరత రాదట.

ఈ నెలకే కాకుండా ఈ సంవత్సరానికి కూడా ఒక విశేషం ఉన్నది. ఈ సంవత్సరం మాత్రమే ఎక్కువ 1 ట్లను చూస్తాము.

1/1/11, 1/11/11,11/1/11,11/11/11.

మీరు పుట్టిన సంవత్సరం లోని చివరి 2 అంకెలను తీసుకుని దానికి ఇప్పటి మీ వయసును కలపండి. కూడిన మొత్తం 111 గా వస్తుంది.....ఇదేనండి విశేషం.

ఈ విషయాన్ని మీకు తెలిసున్నవారికి చెప్పండి.

Tuesday, June 28, 2011

ఆస్ట్రేలియా సముద్రంలో ఏర్పడిన నీటి టర్నాడో...అద్భుతమైన రెండు వీడియోలు

ఫుల్ స్క్రీన్లో చూడండి

ఈ సంవత్సరం అంటే 2011 మే నెల 30 తారీఖున ఏర్పడిన నీటి టర్నాడో వీడియో ఇది.
ఈ వీడియో అంతకు ముందు అంటే 2007 లో తీయబడిన వీడియో.

Monday, June 27, 2011

తలక్రిందలుగా ఉండే (బోబాబ్ ట్రీస్) చెట్లు...ఫోటోలు

బోబాబ్ లేక అప్ సైడ్ డవున్(తలక్రిందలుగా)ఉండే చెట్లు ఆఫ్రికా మరియూ ఆస్ట్రేలియా దేశాలలో పెరుగుతాయి. అక్కడి లేక వారి పురాణాల ప్రకారం దేముడు ఈ చెట్లను మామూలుగా అమర్చినప్పుడు ఆ చెట్లు ఒకే చోట ఉండకుండా కదులుతూ వెళ్ళేవిట. దీనివలన దేముడు ఈ చెట్లను తలక్రిందలుగా ఉంచేడుట. ఈ చెట్లు 5 నుండి 30 మీటర్ల(16 నుండి 98 అడుగుల)ఎత్తు మరియూ 7 నుండి 11 మీటర్ల(23 నుండి 36 అడుగుల)వెడల్పు తో ఉంటాయి.

బెరడు లాంటి పీచు కలిగిన ఈ చెట్టు అగ్నిని ఎదుర్కొనే శక్తి కలిగి ఉండటంతో ఈ చెట్టు యొక్క పీచుతో బట్టలూ మరియూ తాడు తయారు చేస్తారట. ఈ చెట్టు ఆకులను మందులకు ఉపయోగిస్తారు. ఈ చెట్టుకు కాచే పండ్లను "మంకీ బ్రెడ్" అంటారు. దీంట్లో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఈ చెట్టు దిమ్మలలో వందలకొలది లిటర్ల తాగు నీరు ఉంటుందట. ఎండా కాలంలో నీరు దొరకనప్పుడు ఈ చెట్టులోని నీరును వాడుకుంటారట. ఎండిపోయిన ఈ చెట్ల దిమ్మలను మనుష్యులూ మరియూ ఇతర ప్రాణులూ ఇళ్ళు గా చేసుకుని నివాశాలు గా చేసుకుంటారట."Talent vs Attitude"అద్భుతమైన ప్రసంగం.....వీడియో

Thursday, June 23, 2011

మీకు తెలుసా.....?


రోలర్ కోస్టర్లో అధికంగా తిరిగేవారికి మెదడులోని రక్త నాళాలో బ్లాక్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందట.


నీలి రంగు కళ్ళు ఉన్నవారు చీకటిలో బాగా చూడ గలుగుతారట.


డబ్బును పేపరుతో తయారు చేయరట. దూదితో తయారుచేస్తారట.తేలు మీద ఒక చుక్క ఆల్కహాల్ పోస్తే దానికి మదం ఎక్కి తనని తానే కాటేసుకుని చనిపోతుందట.ఉల్లిపాయలు తరిగేటప్పుడు చూయింగ్ గం నములుతూంటే కళ్ళ వెంట నీరు రాదుట.


నైలు నది అడుగున, ఆ నదికి 6 రెట్ల ఎక్కువ నీటితో మరో నది ఉన్నదట.ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడుతున్న పెట్రోల్ లో 29 శాతం మరియూ కరెంట్ లో 33 శాతం అమెరికానే వాడుతోందట.


ఒక గంటసేపు హెడ్ ఫోన్స్ వాడితే, చెవిలో క్రిములు చేరే అవకాశం 700 రెట్లు అధికంగా ఉంటుందట.


ప్రపంచవ్యాప్తంగా మనుష్యుల చావుకు ఎక్కువ కారణమైనది దోమ కాటు


మనం నవ్వినప్పుడు మన శరీరంలోని 30 కండరాలు వ్యాయామం చేస్తాయట.


మన ముక్కు మన పర్సనల్ ఏర్ కండిషనర్. చల్లటి గాలిని గోరు వెచ్చని గాలిగానూ, వేడి గాలిని చల్లటి గాలిగానూ మారుస్తుంది.


మన మెదడు ఒక పవర్ ఫుల్ కంప్యూటర్ కన్నా క్లిష్టమైనది. ఎందుకంటే మన మెదడులో 100 బిలియన్ల నెర్వ్ కణాలు ఉన్నాయి.


మనకు నచ్చిన దానిని చూసేటప్పుడు మన కంటి పాపలు 45 శాతం పెద్దదవుతాయట.


మనం చేతి వేళ్ళను విరుచుకున్నప్పుడు ఏర్పడే శబ్ధం లోపల నైట్రజన్ గ్యాస్ బుడగలు విరిగే శబ్ధం.