Tuesday, May 31, 2011

ప్రమాదకరమైన ప్రదేశాలు...ఫోటోలు

Great Pacific Garbage Patch, Pacific Ocean

దీనిని పసిఫిక్ ట్రాష్ వోర్టెక్స్ అంటారు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నది.ఇక్కడ పేరుకుపోయిన చెత్త యోక్క విస్తీర్ణం అమెరికా రాష్ట్రమైన టెక్శాస్ నగరమంత పెద్దదని చెబుతున్నారు.ఇక్కడ పేరుకుపైన చెత్తలో ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండడంతో దీని పరిసర ప్రాంతాలు హానికరమైన రసాయనాల వాయువుతో నిండి ఉంటుందట.

Izu Islands, Japan

ఈ ద్వీపకల్పం చుట్టూ అగ్నిపర్వతాలు ఉన్నాయి.అందువలన ఈ ద్వీపకల్పంలో సల్ఫర్ వాసన విపరీతంగా వేస్తుందట. ఈ సల్ఫర్ వాసన ఎక్కువగా ఉండటంతో 1953 లో ఒకసారి మరియూ 2000 లో ఒక సారి ఈ ద్వీపకల్పంలో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించేరు. 2005 లో ప్రజలు అక్కడికి తిరిగి వెళ్లేరట.కానీ ఆ రోజు నుండి వారు గ్యాస్ మాస్కులు వేసుకునే ఉంటున్నారట.

The Door to Hell, Turkmenistan

"నరకానికి ద్వారం" అని పేరుపెట్టిన ఈ ప్రదేశంలో న్యాచురల్ గాస్ దొరుకుతుందని 1971 లో తవ్వకాలు మొదలుపెట్టేరు. కానీ అక్కడి గాస్ విషపూరితమైనదని తెలుసుకుని తవ్వకాన్ని అపేసేరు. తవ్వినంతవరకు తగులబెట్టేరు. కొన్నిరోజులలో మంటలు ఆరిపోతాయని అనుకున్నారు. కానీ ఆ మంటలు ఇంకా ఆరిపోలేదట

Alnwick Poison Gardens, England

1501 లో ఇంగ్లాండ్లోని ఈ ప్రదేశంలో వ్యాధుల నివారణ కోసం కొన్ని రకాలా తోటలు వేసేరు. కానీ ఆ తోటలలోని మొక్కలు విషపూరితంగా మారడంతో దానిని మూసేసేరు.

Asbestos Mine, Canada

ఆష్ బెస్టాస్ షీట్లు తయారు చేయడానికి కావలసిన 6 రకాల సిలికేట్ మిశ్రమాలు ఇక్కడ దొరుకుతాయి.వీటిని ఉపయోగించి మంటలకూ మరియూ శబ్ధాలకూ తట్టుకోగల ఆష్ బెస్టాస్ షీట్లను తయారు చేస్తున్నారు. కానీ ఈ మిశ్రమాల నుండి వెలువడే వాయువులు క్యాన్సర్ మరియూ ప్రాణహాని కలిగించే వ్యాధులను కలిగిస్తున్నాయని తెలుసుకున్నారు. అయినా అక్కడి పనులు ఆపలేదు.

Ramree Island, Burma

బర్మాలోని రామోరీ ద్వీపంలో ఉప్పునీటి చెరువులు చాలా ఉన్నాయట. ఈ చెరువులలో అతి క్రూరమైన మొసల్లూ మరియూ పాములూ ఉన్నాయట. రెండవ ప్రపంచ యుద్దంలో అంటే 1945 వ సంవత్సరం జపాన్ సాయుధ ధళాలు ఒక రాత్రి ఇక్కడ ఉండవలసి వచ్చిందట. సుమారు 100 మంది అక్కడ ఉన్నారు. మరుసటిరోజు ఉదయం చూస్తే 20 మందే మిగిలేరట. ఇప్పుడు ఆ ద్వీపానికి ఎవరినీ అనుమతించటంలేదట.

Mud Volcanoes of Azerbaijan, Azerbaijan

అజర్ బైజాన్ లోని బురద అగ్ని పర్వతాలు. ఇక్కడి అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు మంటలూ, బూడిదలకు బదులు బురద వెలువడుతుందట. వీటివలన ప్రాణాపాయం లేదట. ఆ ప్రాంతమంతా బురద మయమౌతుందట. 2001 లో ఏర్పడిన పేలుడులో 15 కిలోమీటర్ల దూరం వరకు బురదమయ మయ్యిందట.

The Zone of Alienation, Eastern Europe

రష్యాలోని చెర్నబోయల్ న్యూక్లియర్ ప్లాంట్లో ప్రమాదం జరిగి అనేక మందిని బలిగొన్నది మీకందరికీ తెలిసే ఉంటుంది. ఆ ప్లాంటుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో న్యూక్లియర్ రేడియేషన్ తాకిడి ఉన్నదట.


Ilha de Queimada Grande, Brazil

దీనిని పాముల ద్వీపం అంటారు.ఇంతవరకూ మానవులు ఇక్కడికి వెళ్లేందుకు సాహసించలేదట. ఎందుకంటే ఇక్కడ ఒక చదురపు మీటరుకు సుమారు 5 పాములు ఉంటాయట. ఇక్కడకు వెళ్ళాలంటే ప్రత్యేక పర్మిషన్ తీసుకోవాలట.

Sunday, May 29, 2011

భవనాలపై తోటలు...ఫోటోలు

ఈ క్రింది ఫోటోలలో భవనాలపై మీరు చూస్తున్న తోటలు మామూలు తోటలు కావు. ఈ తోటలలో వ్యవసాయ రంగానికి చెందిన తోటలు కూడా ఉన్నాయి. ఆ తోటలలో పండే పంటలను అమ్ముకుని వాటినుండి కూడా లాభాలు పొందుతున్నారట.

మనదేశంలో కూడా భవనాలపై ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మనకి రెండు విధాల ఉపయోగం జరుగుతుంది. ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు మరియూ వ్యవసాయ రంగాన్ని నగరాలకు తేవచ్చు.Marche des Halles, Avignon, FranceCaixaForum Museum, Madrid, SpainMusee du Quai Branly, Paris, FranceAnn Demeulemeester Shop, Seoul, South KoreaACROS Fukuoka Prefectural, JapanSkyFarm, Toronto, Canada

Friday, May 27, 2011

స్పెక్ ట్రం రాజా ఇల్లు అని చెబుతున్నారు...ఫోటోలు

"భారతీయులు బీదవారు...కానీ భారతదేశం బీదదేశం కాదు" అని చెప్పేరు ఒక స్విస్ బ్యాంక్ అధికారి. "స్విస్ బ్యాంకులలో 280 లక్షల కోట్ల రూపాయల భారతీయ ధనం దాచుకున్నారు. ఈ డబ్బుతో భారతదేశం 30 సంవత్సరాలకు టాక్స్ లు లేని బడ్జెట్ వేయవచ్చు" అని ఆయన అన్నారు.

ఇదంతా బ్లాక్ మనీ క్రిందే వస్తుంది. ఇంత ధనం బయటదేశంలో ఉన్నదని తెలిసికూడా పట్టుమని ఇంకా ఒక చర్య గూడా తీసుకోలేదు మన ప్రభుత్వం. న్యాయంకోసం ప్రజలు ఇక రాజకీయ నాయకులను నమ్ముకోవడం మానేసి సుప్రీం కోర్టును ఆర్ధించాలి. 2G స్పెక్ ట్రం కేసును బయటకు లాగి ఇందులో అవినీతికి పాల్పడినవారిని గుర్తించి వారి మీద నేరుగా దర్యాప్తు జరుపుతున్నట్లే బ్లాక్ మనీ వీషయంలో కూడా వారే ముందడుగు వేసి నేరస్తులను బయటకు లాగుతారని అందరూ నమ్ముతున్నారు.

"రోల్ టాప్" లాప్ టాప్ : ఫ్యూచర్ టెక్నాలజీ....వీడియో

Thursday, May 26, 2011

సినిమాలలో 100 సంవత్సరాలనుండి చూపిన "స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్"...వీడియోఈ మధ్య సినిమాలలో చూపిస్తున్న స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ ని చూస్తుంటే అవి నిజంగా తీయబడినవా లేక కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో తీయబడినవా అన్న సందేహం మనలో చాలామందికి కలుగుతుంది. కానీ 20 సంవత్సరాల ముందు తీయబడిన సినిమాలలో చూపిన స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ ను బట్టి చూస్తే వీటిలో ఎన్నో రకాల ప్రయోగాలు చేసేరని తెలుస్తోంది. మరి, మరీ పాత చిత్రాలలో వీటిని ఎలా చూపించేరొ?.....100 సంవత్సరాల సినీ చరిత్రలో కొన్ని స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ ఈ క్రింది వీడియోలో చూడండి.

Tuesday, May 24, 2011

విమానాన్ని తీసుకువెడుతున్న హెలికాప్టర్...వీడియో

మిస్సోరిలో టోర్నడో బీభత్సం....వీడియో

అమెరికాపై టోర్నడో మరోసారి విరుచుకుపడింది.మిస్సోరిలోని జోప్లిన్‌పై అది సృష్టించిన బీభత్సానికి దాదాపు 100 మందికి పైగా దుర్మరణం పాలయ్యారని, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. భయంకరమైన తుపాను ధాటికి అక్కడి భవనాలు, గ్యాస్ స్టేషన్లు అన్నీ ధ్వంసమయ్యాయని, పలు ప్రాంతాల్లో కరెంటు, మంచినీరు, టెలిఫోన్ సేవలు నిలిచిపోయాయని పేర్కొంది.

గూడు కట్టుకోవడం...ఫోటోలుMonday, May 23, 2011

"సెల్"(Shell) కంపనీ వారు నిర్మిస్తున్న అతి పెద్ద నీటిలో తేలే ఆయిల్ రిఫైనరీ...ఫోటోలు మరియూ వీడియో

ఇది ప్రపంచంలోనే నీటిలో తేలే అతి పెద్ద యంత్రం. దీనిని సెల్(Shell) కంపనీ వారు నిర్మిస్తున్నారని తెలియజేసేరు. దీని ఖరీదు 10 బిలియన్ డాలర్లు. ఇది విస్తీర్ణంలో 4 ఫుట్ బాల్ మ్యాచ్ స్టేడియంల గ్రౌండ్లకు సమముగానూ బరువులో 6 యుద్ద విమాన నౌకలకు సమంగానూ ఉంటుందట. ఈ ఆయిల్ తీసే యంత్రం సముద్రం లో ఎక్కడైనా ఆయిల్ తీసీ శుద్దీకరణ కేంద్రాలకు సరఫరా చేస్తుందట.