Monday, November 29, 2010

సూర్య గ్రహం నాకు సొంతం.......స్పైన్ దేశ మహిళ

కొన్ని యుగాల తరువాత సూర్య గ్రహానికి ఒక కొత్త యజమాని దొరికేరు.

స్పైన్ దేశంలోని గలీషియ ప్రాంతానికి చెందిన ఒక స్పైన్ దేశ మహిళ అక్కడున్న ఒక నొటరీ పబ్లిక్ అడ్వకేట్ దగ్గర సూర్య గ్రహం తనకు చెందిన ఆశ్తి అని పత్రాన్ని రిజిస్టర్ చేసుకుంది.

"అమెరికాకు చెందిన ఒకతను చంద్ర గ్రహాన్నీ మరియూ సూర్య మండలం లోని అనేక గ్రహాలను తన పేరు మీద రిజిస్టర్ చేసుకుని వాటన్నిటికీ తానే యజమాని నని చెబుతున్నట్లు పత్రికలలో చదివేను. అతని లాగానే నేను కూడా ఈ సెప్టంబర్ నెల సూర్య గ్రహాన్ని నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను" అని 49 సంవత్సరాల వయసు గల స్పైన్ దేశ మహిళ ఏంజెల్స్ డ్యూరాన్, “ఎల్ మిండో” అనే అంతర్జాల పత్రికకు తెలిపినట్లు ఒక ప్రముఖ దిన పత్రిక తెలిపింది.

"అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం ఏ దేశమూ గ్రహాల మీద హక్కులు పొందకూడదని నాకు తెలుసు. కానీ ఆ ఒడంబడికలో ప్రత్యేకంగా వ్యక్తుల గురించి ఎటువంటి అంశమూ లేదు" అని ఆమె తెలిపింది.

"ఇందులో ఎటువంటి చిక్కులూ లేవు. చట్ట ప్రకారమే నేను హక్కులు పొందేను. నేనేమీ మూర్ఖురాలుని కాదు.నాకు చట్టం బాగా తెలుసు. నేను కాక ఇంకెవరైనా కూడా ఈ పని చేసి ఉండవచ్హు. కానీ నేను ముందుగా చేసేను"

నొటరీ పబ్లిక్ అడ్వకేట్ ఆమెకు రిజిస్టర్ చేసి ఇచ్హిన పత్రాలలో "G2 స్పెక్ ట్రల్ కు చెందిన సూర్య గ్రహానికి ఈమె యజమాని, హక్కు దారి. సౌర మండలములోని మధ్య చోటులో ఉన్న ఈ గ్రహం భూమి నుండి సుమారు 14,96,00,000 కిలో మీటర్ల దూరములో ఉన్నది. ఈ గ్రహం మీద పూర్తి హక్కు ఈమెకు మాత్రమే ఉన్నది" అని వ్రాయబడి ఉన్నది.

"ఇంక మీదట సూర్య గ్రహాన్ని వాడుకునే వారు ఎవరైనా సరే నాకు అద్దె చెల్లించాలి. అలా వచ్హే డబ్బులో 50 శాతం స్పైన్ ప్రభుత్వానికి ఇస్తాను. 20 శాతం స్పైన్ దేశ వ్రుద్దుల పెన్షన్ పధకానికి ఇస్తాను. 10 శాతం డబ్బును పరిశోధనలకు ఇస్తాను. మరో 10 శాతం ప్రపంచములో ఆకలి నివారణ కు ఉపయోగిస్తాను" అని ఆమె తెలిపింది.

"మంచి చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు డబ్బు సంపాదించే ఉపాయాలు ఆలోచించాలి. డబ్బు సంపాదనకు ఒక ఉపాయం ఉన్నది, దాని వలన ప్రజలు బాగు పడతారు అని తెలుసుకున్నప్పుడు ఆ పని చేయడానికి ఆలశ్యం చేయకూడదు. అదే నేను చేసింది" ఏంజెల్స్ డ్యూరాన్ తెలిపింది.

No comments:

Post a Comment