Monday, November 29, 2010

సూర్య గ్రహం నాకు సొంతం.......స్పైన్ దేశ మహిళ

కొన్ని యుగాల తరువాత సూర్య గ్రహానికి ఒక కొత్త యజమాని దొరికేరు.

స్పైన్ దేశంలోని గలీషియ ప్రాంతానికి చెందిన ఒక స్పైన్ దేశ మహిళ అక్కడున్న ఒక నొటరీ పబ్లిక్ అడ్వకేట్ దగ్గర సూర్య గ్రహం తనకు చెందిన ఆశ్తి అని పత్రాన్ని రిజిస్టర్ చేసుకుంది.

"అమెరికాకు చెందిన ఒకతను చంద్ర గ్రహాన్నీ మరియూ సూర్య మండలం లోని అనేక గ్రహాలను తన పేరు మీద రిజిస్టర్ చేసుకుని వాటన్నిటికీ తానే యజమాని నని చెబుతున్నట్లు పత్రికలలో చదివేను. అతని లాగానే నేను కూడా ఈ సెప్టంబర్ నెల సూర్య గ్రహాన్ని నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను" అని 49 సంవత్సరాల వయసు గల స్పైన్ దేశ మహిళ ఏంజెల్స్ డ్యూరాన్, “ఎల్ మిండో” అనే అంతర్జాల పత్రికకు తెలిపినట్లు ఒక ప్రముఖ దిన పత్రిక తెలిపింది.

"అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం ఏ దేశమూ గ్రహాల మీద హక్కులు పొందకూడదని నాకు తెలుసు. కానీ ఆ ఒడంబడికలో ప్రత్యేకంగా వ్యక్తుల గురించి ఎటువంటి అంశమూ లేదు" అని ఆమె తెలిపింది.

"ఇందులో ఎటువంటి చిక్కులూ లేవు. చట్ట ప్రకారమే నేను హక్కులు పొందేను. నేనేమీ మూర్ఖురాలుని కాదు.నాకు చట్టం బాగా తెలుసు. నేను కాక ఇంకెవరైనా కూడా ఈ పని చేసి ఉండవచ్హు. కానీ నేను ముందుగా చేసేను"

నొటరీ పబ్లిక్ అడ్వకేట్ ఆమెకు రిజిస్టర్ చేసి ఇచ్హిన పత్రాలలో "G2 స్పెక్ ట్రల్ కు చెందిన సూర్య గ్రహానికి ఈమె యజమాని, హక్కు దారి. సౌర మండలములోని మధ్య చోటులో ఉన్న ఈ గ్రహం భూమి నుండి సుమారు 14,96,00,000 కిలో మీటర్ల దూరములో ఉన్నది. ఈ గ్రహం మీద పూర్తి హక్కు ఈమెకు మాత్రమే ఉన్నది" అని వ్రాయబడి ఉన్నది.

"ఇంక మీదట సూర్య గ్రహాన్ని వాడుకునే వారు ఎవరైనా సరే నాకు అద్దె చెల్లించాలి. అలా వచ్హే డబ్బులో 50 శాతం స్పైన్ ప్రభుత్వానికి ఇస్తాను. 20 శాతం స్పైన్ దేశ వ్రుద్దుల పెన్షన్ పధకానికి ఇస్తాను. 10 శాతం డబ్బును పరిశోధనలకు ఇస్తాను. మరో 10 శాతం ప్రపంచములో ఆకలి నివారణ కు ఉపయోగిస్తాను" అని ఆమె తెలిపింది.

"మంచి చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు డబ్బు సంపాదించే ఉపాయాలు ఆలోచించాలి. డబ్బు సంపాదనకు ఒక ఉపాయం ఉన్నది, దాని వలన ప్రజలు బాగు పడతారు అని తెలుసుకున్నప్పుడు ఆ పని చేయడానికి ఆలశ్యం చేయకూడదు. అదే నేను చేసింది" ఏంజెల్స్ డ్యూరాన్ తెలిపింది.

అద్భుతమైన షాడో డాన్స్ (Shadow Dance)...తప్పక చూడవలసిన వీడియో

Thursday, November 25, 2010

మనసుకు ప్రశాంతతను ఇచ్హే 5 పానీయాలు

ఆఫీసు పనులు గానీ లేక ఇంటిపనులు గానీ కొన్ని సార్లు మనకు మానసిక ఒత్తిడి కలిగించవచ్హు. దీని వలన మనం మానసిక అలసటకు లోనౌతాము. అప్పుడు మనలో చిరాకు, ఆందోళన, కంగారు, బద్దకం, కోపం లాంటివి కలుగుతాయి. ఇవి మనలోని సహజమైన సంతోష వ్యక్తిత్వాన్ని అనిచి మనల్ని ప్రశాంతతకు దూరము చేస్తాయి. ఈ మధ్య మనలో చాలా మంది ఎక్కువసార్లు ఇంటువంటి కష్టానికి లోనౌతున్నాము.

ఇటువంటి కష్టం నుండి బయట పడటానికి మనం ప్రత్యేక చికిత్సలు పొందక్కరలేదు. మనం రోజూ వాడే పానీయాలు మనల్ని ఇటువంటి మానసిక ఒత్తిడ్ల నుండి మనకి విముక్తి కలిగించి మనకు ప్రశాంతతను కలిగిస్తాయని ప్రముఖ పత్రిక రీడర్స్ డైజెస్ట్ తెలిపింది.

మానసిక ఒత్తిడులను మనం నిర్లక్ష్యం చేస్తే కొన్ని రోజులకు అవి మన సహజ సైలిని అధికమించి మనల్ని వాస్తవ సంతోషానికి దూరం చేస్తాయట. అప్పుడు మనం వైద్య చికిత్సకు వెళ్లవలసి వస్తుందట. చాలా సమయాలలో మనం మానసిక ఉత్తిడికి లోనైనట్లు తెలుసుకోలేమట. అందువలన ఎప్పుడైనా ఎక్కువగా పనిచేసినప్పుడూ, మనకు అలసటగా ఉన్నది అని అనిపించినప్పుడు, చిరాకుగా ఉన్నప్పుడు ఈ క్రింద తెలియపరచిన 5 పానీయాలలో మీకు నచ్హిన ఏదో ఒక పానీయాన్ని తీసుకుంటే, అది కొద్ది క్షణాలలోనే మనకి ప్రశాంతతను ఇస్తుంది.
1) ఒక గ్లాసు పాలు తాగండి:.......పాలలో ట్రిప్టోఫెన్ అనే పదార్ధం ఉన్నది. జీర్ణ ప్రక్రియలో ఇది సెరిటోనిన్ అనే పధార్ధముగా మారుతుంది. సెరిటోనిన్ మనలోని మానసిక ఒత్తిడిని తగ్గించి, మనలోని సహజమైన సంతోష వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. సెరిటోనిన్ ను మూడ్ ఎలివేటర్ గా చెబుతారు.
2) వేడిగా కో కో పానీయం తాగండి:.........వేడి మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని వలన మన శరీరంలో ఏర్పడే వెచ్హదనం మన మనసుకు వూరట కలిగిస్తుంది. ఒక గ్లాసుడు వేడి నీరు తాగినా ఇదే ఫలితమిస్తుంది.
3) బ్లాక్ టీ తాగండి( కాఫీ తాగ వద్దు):.........లండన్ విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనలో రోజుకు 4 సార్లు బ్లాక్ టీ తాగితే అది మానసిక ఒత్తిడికి కారణ మయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ ను తగ్గించి తద్వారా మనలో ప్రశాంతత ఏర్పడటానికి సహకరిస్తుంది.4) గ్రీన్ టీ తాగండి:........గ్రీన్ టీలో తియానైన్ అనే పధార్ధం ఎక్కువగా ఉన్నది. ఈ పధార్ధము మన మెదడులో మానసిక ఒత్తిడిని పెంచే బీటా వేవ్స్ ను తగ్గించి, ప్రశాంతతను ఏర్పర్చే ఆల్ఫా వేవ్స్ ను పెంచుతుంది.5) గ్లాసుడు చల్లటి మంచి నీళ్లు తాగి కాసేపు ఇంటి బయట నడవండి:...........మీరు తాగిన చల్లటి మంచి నీరు మీలో రక్త ప్రవాహాన్ని కావలసినంతగా పెంచి, మీరు పీలుస్తున్న గాలితో కలిసి మనలో ఉన్న ఎండార్ఫిన్ అనే పధార్ధాన్ని ఉత్తేజ పరుస్తుంది. ఈ పధార్ధం మనలో ఏర్పడిన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

నన్ను నిద్ర పోనివ్వండి...డిస్టర్బ్ చేయకండి....వీడియో

Tuesday, November 23, 2010

రంగు రంగుల విమానాలు...అందమైన ఫోటోలు
బాస్కెట్ బాల్ ఆట ఆడుతున్న కుక్క...వీడియో

Tiny Yorkshire Terrier Jilli Dog plays basketball with her trainer Rick Caran. Jilli is the only poker playing dog in the world. This smart dog plays poker, basketball, and does many other great dog tricks. She is a certified TDI therapy dog (Therapy Dog International). She performs at trade shows.


Monday, November 22, 2010

ప్రపంచంలోనే అతి పెద్ద కంటైనర్ ఓడ ( BIGGEST CONTAINER SHIP) ....ఫోటోలు

భారతదేశములోని అక్రమ సంపాదకులు 1948 నుండి 2008 వరకు 20 లక్షల కోట్ల డబ్బును విదేశాలకు తరలించేరు

కుంభకోణాలూ, లంచాలు, అవినీతి, అపహరింపు, అక్రమ సంపాదనలూ బయట పడుతున్న ఈ సీసనులో వీటన్నిటికంటే అతి పెద్దదైన బ్లాక్ మనీ గురించిన వివరాలు బయట పెట్టేరు. వివరాలు తెలుసుకున్న పలువురు షాక్ తిన్నారు. పరిశోధనకు వచ్హిన లెక్కల వరకు అన్వేషిస్తే 1948 నుండి 2008 వరకు భారతదేశములో అక్రమముగా సంపాదించుకున్న సుమారు 462 బిలియన్ డాలర్ల (రూ.
20,536,848,000,000 లేక రూ.20 లక్షల కోట్లకు పైగా) డబ్బును భారతీయులు విదేశాలకు తరలించేరట. 2G స్పెక్ ట్రం కుంభకోణంలో రాజా వలన దేశానికి ఏర్పడిన నష్టం కంటే ఇది 12 రెట్లు అధికమట. 150 సంవత్సరాల బ్రిటీష్ పరిపాలనలో వారు (బ్రిటీష్) కూడా ఇంత డబ్బు దోచుకోలేదట. కానీ మన భారతీయులు 61 సంవత్సరాలలో తమ సొంత ప్రజలనే మోసం చేసి ఇంత పెద్ద మొత్తాన్ని వెనకవేసుకోవడం అతి పెద్ద కుంభకోణం గా పేర్కొన్నారు.

ఈ డబ్బును మన దేశానికి తీసుకు వస్తే, మన దేశం 25 సంవత్సరాల వరకు ప్రజల దగ్గర నుండి పన్నులు కట్టించుకోకుండానే ప్రభుత్వాన్ని నడపవచ్హునట. 50 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పరచ వచ్హునట. కనీసం కొన్ని సంవత్సరాల వరకు 500 ప్రజా సంక్షేమ కార్యాలకు ఉచిత కరెంటు వినియోగించ వచ్హునట. ప్రపంచ బ్యాంక్ నుండి గానీ లేక IMF నుండి గానీ అప్పులు తీసుకోనవసరంలేదట.

ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా దీని గురించి ప్రభుత్వాన్ని తప్పు పడుతూ ఉంటారు. వారు పరిపాలనకు వస్తే "ఈ డబ్బును తిరిగి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని చెబుతూ ఉంటారు.

అక్రమ సంపాదనలను పర్యవేక్చిస్తున్న, అమెరికా దేశములో ఉన్న గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ (Global Financial Integriti) అనే సంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసిందని ఆ కంపెనీ అధినేత దేవ్ కర్ తెలిపేరు. "మాకు దొరికిన స్టాటిస్టిక్స్ ను పరిసీలించినంత వరకు ఇంత డబ్బు తరలించబడిందని తెలిసింది. పూర్తి స్టాటిస్టిక్స్ దొరికితే ఈ డబ్బు ట్రిలియన్ డాలర్లు దాటుతుంది" అని ఆయన తెలిపేరు.

భారతదేశంలో అక్రమ సంపాదన సంవత్సరానికి 11.5 శాతం గా పెరుగుతోందట. ఈ 20 లక్షల కోట్లలో 75 శాతం 2000 నుండి 2008 లోపు సంపాదించు కుని విదేశాలకు తరలించ బడిందట. 1991 నుండి భయమనేది లేకుండా అక్రమ సంపాదనలు చేయడం, సంపాదించుకున్న డబ్బును విదేశాలకు తరలించడం చేయడం జరుగుతోందట.

అక్రమ సంపాదనలను దాచుకునే వసతులు కల్పించే దేశాలలో అతి ముఖ్యమైనది స్విట్జర్లాండ్. ఈ దేశమే కాకుండా మరో 19 దేశాలు తమ దేశ బ్యాంకులలో అక్రమ సంపాదనను దాచుకునే వసతి కల్పిస్తున్నాయి. మొరీషియస్, తాయ్ లాండ్,సింగపూర్, హాంగ్ కాంగ్ దేశాలు వీటిలో ముఖ్యమైనవిట.

"కేంద్రంలో పరిపాలనకు వస్తున్న ప్రతి రాజకీయ పార్టీకీ ఈ విషయం తెలుసు కానీ ఎవరికీ రాజకీయ న్యాయం తెలియదు. భారతీయ ప్రజలు పేద వారు కానీ భారతదేశం పేద దేశం కాదు. భారతదేశం వేగంగా అభివ్రుద్ది చెందుతోంది కానీ డబ్బు గానీ అవస్తాపన సౌకర్యాలు కానీ ఏ మాత్రం కనబడవు" షాక్ తిన్న ఒక ఎకనామిస్ట్ అన్నారు.

Sunday, November 21, 2010

జపాన్ దేశంలో కాకులు కూడా తమ తెలివితేటలను ఉపయోగిస్తున్నాయి...గట్టిగా ఉన్న బాదం కాయలను పగులగొట్టి లోపలి పప్పును ఎలా తింటున్నాయో ఈ వీడియోలో చూడండి

అవును మరి. దేశం అభివ్రుద్ది చెందిన తరువాత అక్కడి ప్రజలు ఏది పారేయాలన్నా డస్ట్ బిన్స్ ను ఉపయోగిస్తున్నారు. దీనితో అక్కడి కాకులకు తిండి దొరకడం కష్టమైపోయింది. కడుపుకు కావలసిన తిండికి కష్టం వచ్హినప్పుడే తెలివితేటలను బాగా ఉపయోగిస్తారట...అది ఎవరైనా సరే.

ఆటంబాంబుల మూలంగా విష వాయువుల వలయములో చాలా కాలం వరకు చిక్కుకుని కష్టపడిన జపాన్ దేశీయులు తమ తెలివితేటలను ఉపయోగించి అభివ్రుద్ది చెందటమే కాకుండా ప్రపంచ దేశాలలో అగ్ర స్థానం సంపాదించుకున్నారన్నది అందరికీ తెలుసు .

అక్కడున్న కాకులు కూడా తమ తెలివితేటలను ఉపయోగించుకుని తమకు కావలసిన తిండిని సంపాదించుకుంటున్నాయి. అవి తమ తెలివితేటలను ఉపయోగించుకునే విధం చూడ ముచ్హటగానూ, ఆశ్చర్యంగానూ ఉంది.

పూర్తి వీడియోను చూడండి.సోనీ కంపెనీ వారి నిజమైన రోబోలు చేసిన డాన్స్ ను ఈ వీడియోలో చూడండి

ఫుల్ స్క్రీన్లో పూర్తి వీడియోను చూడండి

Thursday, November 18, 2010

Wednesday, November 17, 2010

2010 లో ప్రపంచములోని అతివేగమైన 10 సూపర్ కంప్యూటర్లు

ప్రపంచములోనే అతివేగమైన సూపర్ కంప్యూటర్ ఉన్న మొదటి దేశముగా ఇప్పటివరకు అమెరికాకు ఉండేది. కానీ ఈ సారి ప్రపంచములోనే అతివేగమైన సూపర్ కంప్యూటర్ ని కలిగిన మొదటి దేశముగా చైనా పేర్కొనబడినది. అయితే ఎక్కువ వేగమైన సూపర్ కంప్యూటర్లు ఉన్న దేశము మాత్రం అమెరికానే.

ప్రస్తుతం మొదటి 10 సూపర్ కంప్యూటర్లు (వేగ క్రమంలో) ఏ దేశాలకు చెందినవో తెలుసుకోండి.


1)TIANHE-1A...CHINA


2)JAGUAR...USA3)NEBULAE...CHINA4)TSUBAME 2.0...JAPAN5)HOPPER...USA6)TERA-100...FRANCE7)ROADRUNNER...USA8)KRAKEN XT5...USA9)JUGENE...GERMANY
10)CIELO...USA

జెర్మనీలో ఉన్న ఈ వండర్ లాండ్ మూలముగా అందమైన ప్రదేశాలను చూడండి....వీడియో

ఫుల్ స్క్రీన్లో పూర్తి వీడియో చూడండి.

మార్కెట్ లో నుండి వెడుతున్న రైలును చూడండి...వీడియో

Tuesday, November 16, 2010

హోమియోపతి వైద్యం జబ్బుల నుండి ఉపశమనం కలిగిన అనుభూతిని కలిగిస్తుంది...పరిశోధన

"హోమియోపతిలో రోగికి సరైన మందులు ఇవ్వకపోయినా ఆ రోగికి తన జబ్బు నుండి ఉపశమనం కలిగిన అనుభూతిని మాత్రం కలిగిస్తుంది" లండన్లో జరిపిన ఒక పరిశోధనలో తెలిసింది.

"కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్న వారు హోమియోపతి మందులు వాడినప్పుడు వారికి కీళ్ళ నొప్పులూ, వాపు మరియూ ఆ వ్యాధికి సంభందించిన ఇతర బాధలు చాలా వరకు తగ్గినట్లు అనిపిస్తుంది. ఆ రోగికి సరైన హోమియో మందు ఇవ్వక పోయినా లేక ఎటువంటి మందూ లేని గుళికలు ఇచ్హినా ఆ రోగికి తన జబ్బు నుండి నయమైన అనుభూతి కలుగుతుంది" రుమటాలజీ అనే పత్రికలో తెలిపేరు.

"హోమియోపతి చికిత్సా విధానంలో ఉన్నటువంటి అపురూపమైన సంప్రదింపుల పద్దతే దీనికి కారణమని మా పరిశోధనలో సైంటిఫికల్ గా తెలిసింది" పరిశోధనా టీం చీఫ్ మరియూ సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ షరా బ్రైన్ తెలిపేరు.

"హోమియోపతి సిద్దాంతం ప్రకారం ఆరోగ్యమైన మనిషిలో ఏ పదార్దం జబ్బుకు కారణమౌతుందో, అదే పదార్ధాన్ని విస్తారముగా డైల్యూట్ చేసి వాడితే ఆ జబ్బు నయమౌతుంది"

"కీళ్ళ నొప్పి జబ్బుతో బాధ పడుతూ హోమియోపతి మందు వాడుతున్న కొందరిని పరిశోధనకు తీసుకున్నాము. వారు తీసుకున్న మందులు సరైన మందులు అయినా, కాకపోయినా 5 సార్లు డాక్టర్ ను కలిసిన తరువాత వారిలో చాలా మందికి జబ్బు నుండి ఉపశమనం కలిగిన త్రుప్తి, సూచనలూ కలిగినై. వీరిలో కొంతమందికి ఎటువంటి మందూ లేని గులికలు ఇచ్హేరు. వీరిలో కూడా చాలా మందికి 5 సార్లు డాక్టర్ ను కలుసుకున్న తరువాత ఉపశమనం కలిగిన త్రుప్తి మరియూ సూచనలు కలిగినై. కానీ అవే మందులను మరికొందరికి ఇస్తే వారికి ఎటువంటి ఉపశమనమూ కలుగలేదు. ఎందుకంటే వారు డాక్టర్ ను కలుసుకోలేదు"

"ఈ పరిశోధన వలన తెలుసుకున్నదేమిటంటే "రోగి చెప్పినది వినడం...రోగితో సంప్రదించడం" చేస్తేనే అది రోగికి చాలా వరకు జబ్బు నుండి ఉపశమనం కలగడానికి సహాయపడుతుంది"

"ఈ పరిశోధన ఒక ప్రశ్న అడిగింది: హోమియోపతి వైద్యం అంటే మాట్లాడటమా లేక మందులా?...... మందులు కాదు, మాట్లాడటం మరియూ అంత కంటే వినడమే హోమియోపతి అని మా పరిశోధనలో తెలిసింది" అని అదే విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జార్జ్ లివిత్ అన్నారు.

"కాలము చాలా అమూల్యమైనది...క్షణం కూడా వ్రుధా అవకుండా వాడుకోవాలి" ఈ విషయాన్ని అద్భుతంగా వివరించిన వీడియో

Sunday, November 14, 2010

భారతదేశానికి చెందిన ప్రపంచంలోనే అతి చిన్న వయసు CEO( Youngest CEO in the world) ను కలుసుకోండి

ఈ టపాను ఆంగ్ల భాష లోనే మీకు అందిస్తున్నాను. కారణం ఒరిజినాలటీ చెక్కు చెదరకూడదని మరియూ వివరించ బడ్డ విషయాలు ఆ భాషలో చదివితే యువతకు చాలా ఇన్ స్పిరేషన్ (Inspiration) కలిగిస్తుందనే నమ్మకంతో.
When 14-year-old Suhas Gopinath started Globals Inc ten years ago from a cyber cafe in Bengaluru, he didn't know that he had become the youngest CEO in the world.

Today, Globals is a multi-million dollar company with offices in the United States, India, Canada, Germany, Italy, the United Kingdom, Spain, Australia, Singapore and the Middle East and has 100 employees in India and 56 abroad.

Among the several honors that have been bestowed upon this young man, the most prestigious is the invitation to be a member of the Board of the ICT Advisory Council of the World Bank..

In 2007, the European Parliament and International Association for Human Values conferred 'Young Achiever Award' on him. He was also invited to address the European Parliament and other business dignitaries assembled in the EU Parliament. He is also recognised as one of the 'Young Global Leaders' for 2008-2009 by the prestigious World Economic Forum.

Suhas is the youngest member ever in the World Economic Forum's history. The other members include the Louisiana governor Bobby Jindal, Hollywood star Leonardo Di Caprio, musician A R Rahman, Prince of Brunei, etc.


In this interview to BBC from his office in Bengaluru, Suhas Gopinath talks about his decade long journey and his dreams for the future.

Thursday, November 11, 2010

అవినీతికే రాజు అనిపించు కుంటున్న రాజా ను ఇంకా ఎన్ని రోజులు కాపాడతారో!?

సుమారుగా 1.70 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని కేంద్రానికి ఏర్పరచిన కేంద్ర టెలికాం మంత్రి మరియూ డిఎంకె ఎంపి ఏ.రాజాను ఎన్నిరోజుల వరకు కాపాడతారో అన్న విషయం ఒక్క కాంగ్రెస్ పార్టీకే తెలుసు. కానీ ఎందుకు కాపాడుతున్నారో అనే విషయం మాత్రం ప్రజలందరికీ తెలుసు. రాజా మీద చర్య తీసుకుంటే డిఎంకె కాంగ్రెస్ కు ఇస్తున్న మద్దత్తు ను ఉపసం హరించుకుంటుంది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికే రాజా మీద చర్య తీసుకోవటం లేదా లేక కాంగ్రెస్ రాజకీయ నాయకులకూ 2G స్పెక్ ట్రం కుంభకోణంలో వాటా ఉన్నదని రాజా మీద చర్య తీసుకోవటం లేదా?...ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్న అనుమానం.

అవినీతిని సహించుకోమంటూ చవాన్, కల్మాడీల ఉద్వాసన ద్వారా సందేశం పంపిన కాంగ్రెస్ పార్టీ రాజా మీద ఎందుకు చర్య తీసుకోవటంలేదు?

తమిళనాడు రాష్ట్ర శాసన శభ ఎన్నికలు 2011 మే నెలలో జరుగనున్నాయి. ఆ ఎన్నికలు ముగిసేదాకా రాజా మీద చర్య తీసుకోకుండా ఉండటంలో ముఖ్య మంత్రి కరుణానిధి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. రాజా మీద ఇప్పుడు చర్య తీసుకుంటే అది ఎన్నికలో ప్రతిపక్షాలకు పెద్ద లాభంగా తయారౌతుంది. ఇప్పటికే రాష్ట్ర రాజ్యాంగ పరిపాలనలో ముఖ్య మంత్రి కరుణానిధి కుటుంబీకుల పెత్తనం ఎక్కువైపోయిందని ప్రజలు గ్రహించేరు. ఇప్పుడు రాజా మీద చర్యకు ఒప్పుకుంటే డిఎంకే కు ప్రజలలో వ్యతిరేక ప్రభావం ఎక్కువ అవుతుందని, అది పార్టీని మరియూ తనని దెబ్బ తీస్తుందని ఆయనకు తెలుసు.

రాజా మీద చర్య తీసుకోకపోవడానికి మరో ముఖ్య కారణమున్నది. డిఎంకె పార్టీకి నిధులు సమకూరిస్తున్న వారిలో రాజా చాలా ముఖ్యుడు. అతని మీద చర్య తీసుకుంటే రాబోవు ఎన్నికలకు నిధుల కొరత ఏర్పడుతుంది. అందువలన రాజాను వదులుకోవడం కరుణానిధికి ఇష్టంలేదు.

ఈ విషయములో కాంగ్రెస్ పార్టీ తీరు గోడ మీది పిల్లిలా తయారైయ్యింది. రాజాను ఉపయోగించుకుని లాభమూ పొందవచ్హు, రాజా మీద చర్య తీసుకుని నష్టపోనూ వచ్హు. రాజా మీద చర్య తీసుకోకుండా ఉంటే తమిళనాడు ఎన్నికలలో కరుణానిధి దగ్గర నుండి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయ వచ్హు. తద్వారా రాష్ట్ర పరిపాలనను సైతం కైవసం చేసుకోవచ్హు. రాజా మీద చర్య తీసుకున్నట్లైతే డిఎంకె తో కూటమి పెట్టుకోలేరు. జయలలిత కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇవ్వదు. జయలలిత పార్టీతోనో లేక కరుణానిధి పార్టీతోనో కూటమి పెట్టుకోకపోతే కాంగ్రెస్ ను తమిళనాడులో ఎవరూ పట్టించుకోరు. ఇది కాంగ్రెస్ కు తీవ్ర నష్టాన్ని ఏర్పరుస్తుంది.

2G స్పెక్ ట్రం లో రాజా జరిపిన అవినీతి కుంభకోణం ప్రజలో అటు కాంగ్రెస్ మీద, ఇటు డిఎంకె మీద వ్యతిరేక ప్రభావాన్ని రేకెత్తిందని చెప్పడంలో అబద్దం లేదు. కానీ ప్రజలు రాజకీయ నాయకుల అవినీతి కుంభకోణాలను ఇట్టే మరిచిపోతారని రాజకీయ నాయకులకు గట్టి నమ్మకముంది. ప్రజలు తమ పార్టీ గురించి ఏమనుకుంటారో నన్న భయం వారికి లేదు.

అందువలనే "రాజా" కీయం ఇలా జరుపుతున్నారు.

ఒక భవనం పై అద్భుతంగా చూపిన రియాలిస్టిక్ 3D షో...వీడియో

ఫుల్ స్క్రీన్ లో చూడండి

Wednesday, November 10, 2010

ఈ దేశంలో దయ్యాలు సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నాయట...!?

పశ్చిమ దేశాలలో (Western Countries) "దేముడున్నాడు" అనే విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా "దయ్యాలున్నాయి" అనే విషయాన్ని మాత్రం గట్టిగా నమ్ముతున్నారు. అందులోనూ ఇంగ్లాండ్ దేశస్తులు దయ్యాలు ఉన్నాయి అనేది నమ్మడమే కాకుండా అవి వారితో పాటూ తిరుగుతూ ఉంటాయని నమ్ముతున్నారు. దీనికి చాలా బలమైన కారణం ఉన్నది. ఈ దేశంలో నివసిస్తున్న వారిలో చాలా మందికి అసాధారణమైన శభ్ధాలు, కొన్ని సార్లు రూపాలూ కనిపించేయి. అందువలన ఇంగ్లాండ్ దేశంలో అసాధారణ విషయాల గురించి రీసెర్చ్ చేసే (Paranormal Research Centre) కేంద్రాలు నియమించేరు.
ఇలాంటి రీసెర్చ్ కేంద్రంలో అన్వేషణా నిపుణులుగా పనిచేస్తున్న ఫిల్ హయాస్ అనే శాస్త్రవేత్త "దయ్యాలు జీవిస్తున్న మనుష్యులను మొబైల్ ఫోన్ మూలంగా కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అందువలనే మొబైల్ ఫోన్లలో వస్తున్న మర్మమైన ఫోన్ కాల్స్ గత 4 సంవత్సరాలలో 43 శాతం పెరిగింది" అని తెలిపేరు.

"70 శాతం దయ్యాలు ఇప్పుడు మొబైల్ ఫోన్ మూలంగా సంచరిస్తున్నాయి. దీనిని రుజువు చేసే విధంగా చాలా మంది చనిపోయిన తమ సన్నిహితుల దగ్గర నుండి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు చెబుతున్నారు" అని ఆయన చెప్పేరు.

"దయ్యాలు చేసే మొబైల్ ఫోన్ కాల్స్ ఎలా ఉంటాయంటే... రింగ్ వినిపించి మనం ఫోన్ ఆన్ చేసిన వెంటనే అవతలి నుండి ఎవరూ మాట్లాడక పోవడం, మనం హలో అని అన్నా అటు నుండి ఎవరూ మాట్లాడక పోవడం, ఫోన్లో వింత శభ్ధాలు వినిపించడం జరుగుతుంది. ఫోన్ ఎవరు చేసేరో నని చూస్తే "విత్ హెల్డ్ నెంబర్" అనో లేక "0000000000" అనో కాలర్ ఐ.డి లో కనబడుతుంది" అన్నారు.

."ఇంతవరకు జరిగిన అన్వేషణ ప్రకారం దయ్యాలు తమ ఉనికిని ఎక్కువగా వింత వింత శభ్ధాల రూపంలో తెలియ పరుస్తాయి. 20 శాతం దయ్యాలు తమ రూపాలు చూపిస్తాయి. 15 శాతం ఒక రకమైన వాసన మూలంగా తెలియ పరుస్తాయి" అని తెలిపేరు.

టెస్కో మొబైల్ కంపనీ వారు జరిపిన పరిశోధనలో అసాధారన లేక మర్మమైన విషయాల శంఖ్య ఈ సంవత్సరం 70 శాతం పెరిగినట్లు, దీనికి కారణం మొబైల్ ఫోన్సే నని తెలిపేరు.

ధైర్యస్తులు ఎవరైనా ఈ అసాధారణ శభ్ధాలనో లేక రూపాలనో తమ మొబైల్ ఫోన్స్ లో రికార్డ్ చేసి పారానార్మల్ సొసైటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు పంప వలసిందిగా ఇంగ్లాండ్ ప్రజలను టెస్కో మొబైల్ (Tesco Mobile) C.E.O ఛ్లాన్స్ బ్యాచిలర్ అన్నారు.

ప్రార్ధన చేస్తున్న కుక్కను ఈ వీడియోలో చూడండి

Tuesday, November 9, 2010

అవతార్ మరియూ 2012 సినిమాల లాగానే ఈ 2 సినిమాలు (Skyline మరియూ 300) కూడా కళ్ళకు విందునిస్తాయి... ట్రైలెర్ వీడియోలు

ఫుల్ స్క్రీన్ లో చూడండి

SKYLINE ట్రైలెర్ వీడియో....ఈ సినిమాను తెలుగులోనూ, తమిళం లోనూ డబ్బింగ్ చేసి ఈ నెల రిలీజ్ చేస్తున్నారు.
300 ట్రైలెర్ వీడియో...ఈ సినిమాను ఆధారం చేసుకునే మగధీర సినిమా తీసేరని చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

నిపుణులైన డాక్టర్ల ముసుగుతో రోగులను చంపుతున్న వారిని ఆపేదెవరు?

హాస్పిటల్ ఆపరేషన్ టేబుల్ మీద పడుకున్న రోగికి ముక్కుకు గుడ్డ కట్టుకుని, చేతిలో ఆపరేషన్ కత్తి పట్టుకుని తన ఎదురుకుండా నిలబడిన వ్యక్తి డాక్టర్ కాదు అని హటాత్తుగా తెలుసుకుంటే ఆ రోగి మానసిక పరిస్తితి ఎలా ఉంటుందో ఒక సారి ఊహించుకోండి. ఇదేదో సైంటిఫిక్ క్రైం త్రిల్లర్ సినిమాలో వచ్హే పీడ కల సీను లాగా అనిపిస్తోందా?...కాదు, ఇదే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రోగులకు జరుగుతున్న విపరీతము. శస్త్ర చికిత్సలో నిపుణులు కాని డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లూ మరియూ డాక్టర్ కే చదువుకోని వారు(క్వాక్స్) ఏమీ తెలియని, అమాయకపు రోగులకు మొద్దుగా చేస్తున్న శస్త్ర చికిత్సలు. చట్ట రీత్యా వీరు చేస్తున్నది హత్యా ప్రయత్నం అని వారికి తెలిసినా నేరం రుజువు చేయలేరు కాబట్టి వారికి ఎటువంటి భయమూ లేదు.

ఈ మధ్య నల్గొండ జిల్లా సుర్యాపేటలో ప్రసవానికి వచ్హిన ఒకామె, ఆమెకు పుట్టిన పాప చనిపోయేరు. కారణం, ఆమెకు ఆపరేషన్ చేసింది ఆ హాస్పిటల్ నర్సులట. నిపుణులైన డాక్టర్లు చేయవలసిన ఆపరేషన్ను అక్కడి నర్సులు చేయడమే వారు చనిపోవడానికి కారణమట. గ్రామీన ప్రాంతాలలో ఉన్న హాస్పిటల్స్ లో ఇలా జరగటం మామూలేనట. అక్కడ చాలా మంది బ్రతికున్నారంటే అది వారి అద్రుష్టమేనట.

చాలా ఆపరేషన్లలో రోగులు స్ప్రుహలోకి రావటం లేదట. హాస్పిటల్ డాక్టర్లనడిగితే అనస్తీషియా(Anesthesia)లో నిపుణులైన డాక్టర్లు తక్కువగా ఉన్నారని, అందువలన మత్తు మందు మోతాదులలో తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నారు. రాష్ట్రం లోని హాస్పిటల్స్ ను క్రమ పరిచే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ కు ఈ మధ్య కాలంలో 50 కు పైగా ఫిర్యాధులు వచ్హేయట. మరో 10 ఫిర్యాదులను నమోదు చేయలేదట.

సూర్యాపేటలో జరిగిన నేరాన్ని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ కు పంపించేరట. ఈ విషయం ఆ పేషెంట్ బంధువులకు తెలియదట.

ఇలా నేరాలకు పాల్పడే వారిని శిక్చించడం కష్టమంటున్నారు. ఎందుకంటే నేరం జరిగిందని నిరూపించడానికి సీనియర్ డాక్టర్ల ఒపీనియన్ కావాలట. తమకు సహాయపడే వారిని నేరములో ఇరికించడం సీనియర్ డాక్టర్లు చేయరట. అందువలన నేరం చేసేరనో, నిర్లక్ష్యం చేసేరనో రుజువు చేయడం చాలా కష్టమట.

ఆపరేషన్ చేయడానికి ఒక్క సర్జన్ కే హక్కు వుంది. ఎం.బి.బి.ఎస్ డాక్టర్ కూడా ఆపరేషన్లు చేయకూడదని రూలు ఉన్నా రోగికి ఎవరు ఆపరేషన్ చేస్తున్నారో తెలియదు కనుక నిపుణులు కాని వారు మరియూ నర్సులూ ఆపరేషన్ చేయడాన్ని డాక్టర్లే ఒప్పుకుంటున్నారట. అలాంటప్పుడు రోగులను కాపాడేదెవరు? అర్హత లేని వారిని మరియూ డాక్టర్లే కాని వారిని ఆపరేషన్ చేయకుండా ఆపేదెలా?

ఇప్పుడు ఈ బాణి నగరాలలో కూడా ఎక్కువగా జరుగుతున్నదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసేరు.