Friday, October 29, 2010

భారతదేశంలో ఆంగ్ల భాషకు గుడి

ఎప్పుడైనా భాషలకు గుడి అనే మాట విన్నారా? వింతగానూ, ఆశ్చర్యంగానూ ఉంది కదా...కానీ ఇది నిజం. ఉత్తరప్రదేశ్ లోని లక్షింపూర్ జిల్లాలోని బంకా గ్రామంలో ఆంగ్ల భాషకు ఒక గుడి కడుతున్నారు. ఈ గుడిని ఆంగ్ల దేవత అంగ్రేజీ దేవి గుడిగా పేర్కొంటూ ఆంగ్ల భాషకు అంకితం చేయబోతున్నారు. ఈ గుడి కట్టడం చాలా వరకు పూర్తి అయ్యింది. వచ్హే నెలలో తెరవబోతున్నారు.

చంద్రబాన్ ప్రశాద్ అనే ఆయన ఈ గుడిని నిర్మానిస్తున్నారు. ఈ గుడి గోడల మీద ఆంగ్ల సామెతలూ, ఉల్లేఖనలు ఆంగ్ల భాషలో చెక్కబడి ఉంటాయి. ఆంగ్ల భాష ఎంత ముఖ్యమైనదో తెలిపే ఒక పాటను ప్రార్ధన గా పాడతారట.

"ఈ గ్రామంలో ఉన్న ప్రజలు...ముఖ్యంగా దలితులు ఆంగ్ల భాషను నేర్చుకోవాలని,పరిపాలనా రంగంలో కలిసి భారతదేశ అభివ్రుద్దిలో పాలుపంచుకోవాలని, దీనికి ఆంగ్ల భాష నేర్చుకోవటం ఎంత ముఖ్యమో వారికి తెలుపటానికే ఈ గుడి కడుతున్నాము" అని చంద్రబాన్ ప్రశాద్ తెలిపేరు.

"ఆంగ్ల భాష తెలియనందువలన చాలా మంది దలితులు సంఘంలో వెనుకబడి ఉన్నారు. ఆంగ్ల భాష అంతర్జాతీయ భాష అనే దానిని మన రాజకీయ నాయకులు ఒప్పుకోరు గానీ అదే నిజం. ఈ భాష రాబోవు కాలంలో మరింత ముఖ్యమైన భాష గా రూపొందుతుంది. రాజకీయ నాయకులలోనే డా.అంబేద్కర్ గారు మత్రమే ఆంగ్ల భాషను ఆదరించేరు. మిగిలిన వారందరూ ఆంగ్ల భాషను ఎదిరిస్తున్నారు. సంఘంలో సమానత్వం తీసుకురావడానికి ఆంగ్ల భాష తోడ్పడుతుందని ఆయనకు తెలుసు. ఈ రోజు చాలా మంది మేధావులు ఆంగ్ల భాష తెలియనందువలన గుర్తింపు పొందలేక పోతున్నారు. దలితులు ఆంగ్ల భాష నేర్చుకోకపోవడం వలనే అన్ని రంగాలలోనూ వెనుకబడి ఉన్నారు. ఆంగ్ల భాష ఎంత ముఖ్యమో అందరూ తెలుసుకోవాలనే ఈ గుడి కడుతున్నాము" అని ఆయన చెప్పేరు.

బ్లాక్ గ్రానైట్ తో కట్టబడిన ఈ గుడిలో అంగ్రేజీ దేవి గా అమెరికాలో ఉన్న లిబర్టీ స్టాచ్యూ లాంటి శిలా విగ్రహం ఉంటుంది. కంప్యూటర్ రూపంలో నిర్మించ బడిన పీఠంపై ఈ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఒక చేతిలో భారత రాజ్యాంగ చట్ట పుస్తకమునూ, మరొక చేతిలో ఒక పెన్ను నూ పట్టుకుని ఉంటుంది. ఈ విగ్రహం ఒక గౌనూ మరియూ టోపీ ధరించి ఉంటుంది. విగ్రహ పీఠ మైన కంప్యూటర్ రూపంతో ఉన్న పీఠం లో ధర్మ చక్రం చెక్కబడి ఉంటుందట.

ఈ గుడి గురించి తెలుసుకున్న ఇతర రాష్ట్రలలోని చాలా మంది ప్రజలు(తమిళనాడు, కర్ణాటకా, ఆంద్రప్రదేశ్, గుజరాత్ మరియూ మహారాష్ట్రా) తమ రాష్ట్రంలో కూడా ఆంగ్ల భాషా దేవి గుడి కట్టవలసిందిగా చంద్రబాన్ ప్రశాద్ గారిని కోరుతున్నారు.

ఆంగ్ల భాష చాలా ముఖ్యమైన భాష. ఈ భాషను అందరూ నేర్చుకోవాలి. ఎవరు ఒప్పుకున్న, ఒప్పుకోకపోయినా ఆంగ్ల భాష అంతర్జాతీయ భాష అనడంలో సందేహము లేదు. ఈ భాష ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి ఒక గుడిని ఏర్పరుస్తున్న చంద్రబాన్ ప్రశాద్ గారికి అభివందనలు.

Thursday, October 28, 2010

షిరిడి సాయిబాబా అసలు విగ్రహాన్ని చెక్కిన శిల్పి, విగ్రహాన్ని చెక్కుతున్న ఫొటోలు మరియూ ఇతర ఫొటోలు

బహుశ మీ అందరికీ షిరిడి విగ్రహం గురించిన విషయాలు తెలిసుంటుంది. కానీ ఈ టపాలోని ఫొటోలు కొందరు చూసి ఉండరు. వారికోసం వివరాలతో ఆ ఫొటోలు.SHRI B.V.TALIM SCULPTING BABA'S IDOLLaxmibai ShindeSwami Sri Sai SarananandaTHE FIRST ORIGINAL IDOL OF SAI BABA

PLACE WHERE BABA GAVE DARSHAN TO TALIMTuesday, October 26, 2010

చిరుత పులి దగ్గర నుండి లేడి పిల్లను కాపాడిన మనిషి....గొప్పగా చిత్రీకరించిన వీడియో

"పారానార్మల్ ఆక్టివిటీ 2" సినిమా బాక్స్ ఆఫీస్ కలక్షన్ రెకార్డులను బద్దల కొడుతోంది...ట్రైలర్ చూడండి

అతి తక్కువ ఖర్చుతో తీసిన భయకంపితమైన త్రిల్లింగ్ సినిమా "పారానార్మల్ ఆక్టివిటీ 2" పోయిన వారం నార్త్ అమెరికాలో రిలీజ్ అయ్యింది. త్రిల్ సినిమాలను చూసేవారినే కాకుండా సినీ పరిశ్రమలో వారిని కూడా ఈ సినిమా ఆశ్చర్య పెడుతోంది.

త్రిల్ సినిమాలను చూసేవారిని అనుకోని భయం పుట్టించే సన్నివేశాలతో ఆశ్చర్య పరుస్తుంటే, సినీ పరిశ్రమలో వారిని కలక్షన్ లతో ఆశ్చర్య పరుస్తోంది. సినిమా రిలీజ్ అయిన మొదటి 3 రోజులలో 41.5 మిలియన్ డాలర్ల కలక్షన్ తో అన్ని రెకార్డులనూ అధికమించిందని పారామౌంట్ పిక్చర్స్ వారు తెలిపేరు. కేవలం 3 మిలియన్ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా అత్యధిక కలక్షన్ లతో రికార్డ్ స్రుష్టిస్తుందని చెబుతున్నారు.

ఈ సినిమా మొదటి భాగం "పారానార్మల్ ఆక్టివిటీ" తీయడానికి కేవలం 15,000 డాలర్లు మాత్రమే ఖర్చైందనే విషయం మీకందరికీ తెలుసు. ఈ సినిమా ఒక్క నార్త్ అమెరికాలో మాత్రం 107 మిలియన్ డాలర్లు సంపాదించి పెట్టింది.

ఇంతవరకు వచ్హిన భయానకపు సినిమాలలోనే పారానార్మల్ ఆక్టివిటీ ప్రేక్షకులలో విపరీతమైన భయాన్ని పుట్టించిందని చెప్పేరు. ఇప్పుడు "పారానార్మల్ ఆక్టివిటీ 2" కూడా అలాగే ఉందని చెబుతున్నారు.

అయితే భారతదేశంలో మాత్రం ఈ సినిమా ఏమంత బాగలేదని మరియూ ఏమంత భయం పుట్టించేదిగా లేదని అంటున్నారు.

పారానార్మల్ ఆక్టివిటీ 2 సినిమా ట్రైలర్ ను ఇక్కడ చూడండి. (డబుల్ క్లిక్ చేసి పూర్తి స్క్రీన్ లో చూడండి)


Saturday, October 23, 2010

సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న రజినీకాంత్ మామూలు టైములో ఎంత సింపుల్ గా ఉంటారో, ఆయన హిమాలయాస్ లో ఏం చేస్తారో ఈ వీడియోలో చూడండి

రజిని పేరు వినగానే తమిళనాడులో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు అందరూ అభిమానంతో చూస్తారు. భారతదేశం లోని మిగిలిన రాష్ట్రాలలో కూడా రజినికాంత్ అంటే గౌరవం చూపుతారు. రోబో సినిమా తరువాత విదేశాలలో కూడా ఆయనకు గుర్తింపు దొరికింది.

ఇకపోతే సినీ ప్రపంచంలోని వారు రజినీకాంత్ కు ప్రత్యేక గౌరవం ఇస్తారు. దీనికి ముఖ్య కారణం, ఆయన సూపర్ స్టార్ అయినా, సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరితోనూ కలిసిపోతారు.

రజినీకాంత్ తను నటించే సినిమాలకు తీసుకునే పారితొషకం చాలా ఎక్కువ. సినీ నటులలో అధిక మైన పారితొషకం తీసుకునే నటులలో ఈయన 2 వ స్తానం లో ఉన్నారు. అయితే ఈయన తన పారితోషకాన్ని సినిమా తీసే నిర్మాత్మను బట్టి మార్చుకుంటారు. పెద్ద నిర్మాత దగ్గర ఎక్కువగానూ, చిన్న నిర్మాత దగ్గర తక్కువగానూ తీసుకుంటారట. ఈయన దగ్గర అందరికీ నచ్హిన విషయమేమిటంటే తను నటించిన సినిమా ఫ్లాప్ అయితే తాను ఆ సినిమాకు తీసుకున్న పారితోషకాన్ని ఆ నిర్మాతకో, వినియోగదారులకో తిరిగి ఇచ్హేయడమే.

ఈయన నటించిన ఆంగ్ల సినిమా "బ్లడ్ స్టోన్" కు ఈయన డాలర్లలో పారితోషకం తీసుకున్నారు. రూపాయలలో అది 25 కోట్లట.

రోబో సినిమా విజయవంతమైన తరువాత ఈయన పాపులారిటీ చాలా పెరిగింది. పెరగదా మరి? షారూ ఖాన్, అమీర్ ఖాన్ మరియూ కమల హాసన్ రోబో సినిమాలో నటించటానికి నిరాకరిస్తే ఈ సినిమాలో నటించే అవకాసం రజినీ గారి కి వచ్హింది. ఈ సినిమాలో నటించడమే కాకుండా, ఈ సినిమా విజయవంతానికి ముఖ్య కారకుడైన ఈయన రోబో సినిమాకు ఎక్కువగా ఖర్చు అవుతుందని తెలుసుకుని ఈ సినిమాలో నటించడానికి తీసుకోవలసిన పారితొషకాన్ని సినిమా విజయవంతమైన తరువాత ఇమ్మన్నారట.

రోబో సినిమా విజయవంత మైన తరువాత రజినీకాంత్ తన గురువు గారిని కలవడానికి హిమాలాయా పర్వతాలకు వెళ్ళేరు. ఆయన అక్కడ ఎంత సింపుల్ గా ఉన్నారో, ఏం చేసేరో ఈ వీడియోలో చూడండి.ఈ పిల్ల కోతి చేసే పిల్ల చేష్టలను ఈ వీడియోలో చూడండి

ఈ వీడియోను డబుల్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ లో చూడండి

P.hd చేయడానికి విశ్వవిద్యాలయంలో చేరిన 100 సంవత్సరాల వయసున్న యువకుడు

భారత స్వాతంత్ర సమరయోధులు బోలారాం దాస్ తనయొక్క 100 వ పుట్టిన రోజును జరుపుకుంటూ "నేను చదువుకోవడానికి మళ్ళీ స్కూల్ కు వెడతాను" అని చెప్పినప్పుడు ఆయన పుట్టినరోజు వేడుకకు వచ్హిన వారంతా ఆశ్చర్యపోయేరట.

అస్సాంలో ఉన్న గౌహాతీ విశ్వవిద్యాలయం లో P.hd చేయడానికి తన పేరు నమోదు చేసుకున్నారు. బహుశ ఒక బిలియన్ ప్రజలు కలిగిన మనదేశంలో ఈయనే అత్యధిక వయసున్న విధ్యార్ధి అనుకుంటున్నారు.

"నా 100 ఏళ్ళ జీవితంలో నేను పలు రంగాలకు నా సేవలు అందించేను. సమాజం, రాజకీయం, పరిపాలన మరియూ అధ్యాత్మిక రంగాలకు నా సేవలు అందించేను" గాంధీ గారి టోపీ పెట్టుకుని, సూటు వేసుకున్న బోలారం గారు తన 100 వ పుట్టినరోజున తెలిపేరు.
"నాకు చదువుకోవటం, నేర్చుకోవటం అంటే చాలా ఇష్టం. ఫ్.హ్ద్ చేస్తేనే గానీ చదువు పూర్తి చేసిన త్రుప్తి నాకు దొరకదు" అన్నారు.

1930 లో బ్రిటీష్ వారి పరిపాలనను ఎదిరించినందువలన తన 18 వ ఏట బోలారం దాస్ జైలుకు వెళ్లేరు. 2 నెలలు జైలులో బండ చాకిరి చేసేరు. ఆ తరువాత ఈయన కామర్స్ మరియూ లా చదువు కొరకు వెళ్ళేరు.

1945 లో కాంగ్రెస్ పార్టీలో జేరేరు. స్వాతంత్రం కోసం పొరాడేరు. 1947 లో స్వాతంత్రం సాధించేరు.

బోలారం దాస్ గారు టీచరుగానూ, ఒక లాయర్ గానూ, మెజెస్ట్రేట్ గానూ మరియూ జిల్లా కోర్ట్ జడ్జ్ గానూ పనిచేసి 1971 లో రిటైర్ అయ్యేరు. ఈయనకు భార్యా, 5 గురు కొడుకులూ, ఒక కూతురు ఉన్నారు.

తన సొంత గ్రామ మైన బోహోరీ గ్రామంలోని నియో-వైష్ణవ మత ఆచారాలు ఎలా పాతుకు పోయినాయో, హిందూ మత సాంప్రదాయాలలో ఎలా విభజణ కలిగింది అనే విషయం గురించి ఆయన P.hd చేస్తారట.

"దేముడు ఒక్కడే...మానవత్వమూ ఒకటే" అనే అంశాన్ని ప్రభల పరచాలనేదే తన ఆశ అని చెప్పేరు.

"100 సంవత్సరాల వయసున్న ఒక విధ్యార్ధి విశ్వవిద్యాలయంలో ఉండటం చాలా అరుదైన విషయం. ఈయన్ను చూసి మిగితా విధ్యార్ధులలో స్పూర్తి కలుగుతుందని ఆశిస్తున్నాను. చదువుకోవాలనే ఆశ, ప్రజా సేవ చేయాలనే కోరిక వారిలో ఏర్పడతాయని భావిస్తున్నాను" అని విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ అన్నారు.

చదువుకోవడానికి వయసుతో పనిలేదని తన మూలంగా మరో సారి ప్రపంచానికి తెలియచేసిన బోలారాం దాస్ గారికి ఆయురారోగ్యం ఇవ్వాలని ప్రాధిస్తున్నాను.

Friday, October 22, 2010

తల్లి కోతిని చంపినా, ఆ కోతి పిల్లను రక్షించిన చిరుత పులి...హ్రుదయాన్ని కదిలించే వీడియో

ఇతర ప్రాణులను చంపి తమ ఆకలి తీర్చుకోవటం క్రూర మ్రుగాల లక్షణం. కానీ ఆ క్రూర మ్రుగాలకు పిల్ల ప్రాణుల మీద ఎనలేని ప్రేమ ఉంటుందని ఈ వీడియో చూసిన తరువాత తెలుసుకున్నాను.

కొంత మంది మనుష్యులు తమకు పిల్లలు పుట్టగానే వదిలేసి వెళ్లిపోతున్నారు. కొంతమంది పసి పిల్లలను దొంగలించుకుపోయి వారి ఉపయోగాలకు వాడుకుంటున్నారు. కొన్ని వేల మంది పిల్లలు అత్యాచారాలకు గురౌతున్నారు.

ఇక్కడ ఒక చిరుత పులి వేటాడి ఒక కోతిని చంపి తినడానికి తీసుకుపోతూంటే ఆ కోతి అప్పుడే ఒక పిల్లను కన్నదని తెలుసుకున్న చిరుత పులి తన ఆకలిని సైతం మరచిపోయి, ఆ కోతి పిల్లను కాపాడి సం రక్షించడం ఆశ్చర్య పరచడమే కాకుండా హ్రుదయాన్ని కదిలించింది. ఆ వీడియోను ఇక్కడ చూడండి (పూర్తిగా చూడండి).Wednesday, October 20, 2010

దయ్యం తిరుగుతున్నదని 42 సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్ లో మూసివేసిన రైల్వే స్టేషన్

సౌత్ ఈస్ట్రన్ రైల్వే లో పనిచేస్తున్న ఉద్యోగులు వెస్ట్ బెంగాల్ లోని పురిలియా ప్రాంతం లో మావోయిస్టులు కూడే చోటు అని చెప్పబడే బేగన్ కొడోర్ రైల్వే స్టేషన్ లో పనిచేయడానికి నిరాకారిస్తున్నారట. కారణం ఆ రైల్వే స్టేషన్ లో తెల్ల చీర కట్టుకున్న ఒక దయ్యం సంచరిస్తోందట.

42 సంవత్సారాల తరువాత పోయిన సంవత్సరం తిరిగి తెరిచిన ఈ రైల్వే స్టేషన్లో ప్రైవేట్ గా టికెట్లు అమ్ముకునే హక్కు పొందిన డలూ మహోట్ అనే అతను మాత్రం పనిచేస్తున్నాడు.

వెస్ట్ బెంగాల్ లో ఉన్న పురిలియా జిల్లా హెడ్ క్వాటర్స్ కు 43 కిలో మీటర్ల దూరంలో ఉన్న బేగన్ కొడోర్ రైల్వే స్టేషన్ను 1967 లో మూసివేసేరు. కారణం, ఆ రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఒక రోజు తెల్ల చీర కట్టుకున్న ఒక దయ్యం ఒక ప్యాసెంజర్ రైలు వెనుక పరిగెత్తటం చూసేడట. ఆ మరుసటి రోజు ఆ రైల్వే ఉద్యోగి చనిపోయేడట......ఈ సంఘటన ఎటువంటి భయాందోళన కలిగించిందంటే ఆ రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్ తో సహా అక్కడ పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులందరూ ఆ రైల్వే స్టేషన్ను వదలి పెట్టి వెళ్ళిపోయేరట. ఆ స్టేషన్ మార్గంగా వెడుతూ, ఆ స్టేషన్లో ఆగవలసిన ప్యాసింజర్ రైళ్ళు కూడా ఆ రోజు తరువాత నుండి ఆ స్టేషన్లో ఆగకుండా వెడుతున్నాయట. దీని వలన ఆ ప్రాంతములోని ప్రజలు, ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులకు గురి అయ్యేరట.

పోయిన సంవత్సరం జరిగిన ఎన్నికల మీటింగులో త్రినాముల్ కాంగ్రెస్ పార్టీ నేత మమతా బెనర్జీ ఈ రైల్వే స్టేషన్ను తెరిపించడమే కాకుండా పూర్తిగా పనిచేసేటట్లు చేస్తానని ఆ ప్రాంత ప్రజలకు వాగ్దానం చేసేరట. బాసుదేబ్ ఆచార్యా అనే ఎం.పి ఆమెకు ఆమె చేసిన వాగ్దానాన్ని పదే పదే గుర్తు చేయటం వలన పోయిన సంవత్సరం సెప్టంబర్ 1 న ఆ స్టేషన్ను తెరిచేరట. అయితే ఆ స్టేషన్లో పనిచేయడానికి రైల్వే ఉద్యోగులు నిరాకరించడం తో ఒక ప్రైవేట్ ఏజెంటును నియమించి 3 రైళ్లను ఆపుతున్నారట.

డలూ మొహోటో అనే ఈ ప్రైవేట్ ఏజెంట్ స్టేషన్ దగ్గర కూర్చుని అక్కడకొచ్హే ప్రయాణీకులకు టికెట్లు అమ్ముతాడట. ఇతనికి ఒక టికెట్టుకు రూ.1.25 కమీషన్ గా ఇస్తారట. "నేను ఎప్పుడూ నా పక్కన కొంత మంది స్నేహితులను తోడుగా కూర్చోబెట్టు కుంటాను. సాయంత్రం 6 గంటల కల్లా వెళ్లిపోతాను" అని మొహోటో చెప్పేరు.

రైల్వే అధికారులను అడిగితే "ఈ స్టేషన్ కు రోజు మొత్తంలో 100 మంది ప్రయాణీకులు కూడా రావటంలేదు. కనుక ఈ స్టేషన్ కు స్టేషన్ మాస్టర్ అవసరమో, ఇతర ఉద్యోగుల అవసరం లేదని ఎవర్నీ నియమించలేదు" అని తెలిపేరట.

"ఇది చాలా రిమోట్ ప్రదేశం. ఈ రిమోట్ ప్రాంతంలో పనిచేయడానికి ఇష్టం లేక ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు" అని కొందరు అధికారులు తెలిపేరట.

కమ్యూనిష్టుల పరిపాలనలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లో దయ్యాలూ, భూతాలూ ఉన్నాయని నమ్మే వారు ఉన్నారా? దయ్యమున్నదని ఒక రైల్వే స్టేషన్ను 42 సంవత్సాలు మూసి వేయడమా?...అని ఆశ్చర్య పోతున్నారు కొందరు.

Saturday, October 16, 2010

హాలీవుడ్ సినిమాలలో గ్రాఫిక్స్ ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి

గ్రాఫిక్స్ ఉపయోగించకుండా హాలీవుడ్ లో సినిమాలు తీయరు. మీరు బ్రహ్మాండం అనుకునే సీనును ఎంత సులువుగా గ్రాఫిక్స్ ఉపయోగించి తీస్తున్నారో చూడండి. అయితే ఇది కూడా ఒక గొప్ప టాలెంటే. ఈ టాలెంట్ వలన వారు ఎటువంటి అద్భుతమైన సన్నివేశా నైనా తీయగలరు. అలాంటి సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తున్నారో ఈ వీడియోలో చూడండి. పూర్తి స్క్రీన్ లో చూడండి( వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి).

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు

Friday, October 15, 2010

అద్భుతమైన 3D లైట్ షో...మిమ్మల్ని ఖచితంగా రిలాక్స్ చేసే వీడియో

ఈ వీడియోని పుర్తి స్క్రీన్ లో చూడండి.వీడియో మీద రెండు సార్లు క్లిక్ చేయండి.


Wednesday, October 13, 2010

చిలీ గనిలో చిక్కుకు పోయిన కార్మీకులందరూ వెలికి తీత (వీడియో)...అందరి ప్రార్ధనలూ ఫలించేయి

69 రోజులుగా బంగారు గనిలో చిక్కుపోయిన 33 మంది కార్మీకులనూ ఒక ప్రత్యేక కాప్ స్యూల్ లిఫ్ట్ మూలంగా బయటకు తీసేరు. నతింగ్ ఈస్ ఇంపాసిబుల్ (NOTHING IS IMPOSSIBLE) అనేదానికి ఇది పెద్ద నిదర్శనం. అదేలాగా కష్టాలలో ఉన్న వారిని కాపాడటంలో ఉన్న త్రుప్తి మరే విషయంలొనూ లేదని నిరూపించిన ఘటన.


గనిలో చిక్కుపోయినప్పటి వీడియో


చిక్కుపోయిన వారిని బయటకు తీసే వీడియో...1చిక్కుపోయిన వారిని బయటకు తీసే వీడియో...2
గాడ్ ఈస్ గ్రేట్.... గాడ్ బ్లెస్ దెం ఆల్.

Tuesday, October 12, 2010

చేతులు లేని ఇతను కాలితో పియానో(PIANO) ప్లే చేసి బహుమతి గెలుచుకున్నాడు...వీడియో

రూ.84 కోట్లు అడ్వాన్స్ ఆదాయపు పన్ను కట్టి కాంగ్రెస్ హై కమాండ్ ను ఆశ్చర్య పరచిన జగన్మోహన్ రెడ్డి

తన వ్యక్తిగత కొరికలతోనూ, పనులతోనూ కాంగ్రెస్ హై కమాండ్ ను దిక్కరిస్తూ తనకు నచ్హిన సైలిలో వెడుతున్న కడప ఎం.పి మరియూ దివంగతులైన మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2010-2011 కి రూ.84 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టి కాంగ్రెస్ హై కమాండ్ ను ఆశ్చర్య పరచటమే కాకుండా మరింత ఇబ్బందికి గురిచేసేరు. వై.ఎస్.ఆర్ చనిపోయిన తరువాత జగన్మోహన్ కు ఎంత ఆస్తి ఉన్నదో కాంగ్రెస్ హై కమాండ్ కు తెలియదట.

కాంగ్రెస్ హై కమాండ్ కు తెలిసిన దానికంటే చాలా ఎక్కువ ఆస్తి ఆయనకు ఉన్నట్లు ఆయన కట్టిన అడ్వాన్స్ టాక్స్ తెలుపుతోంది. 2010-2011 సంవత్సర 6 నెలల ఆదాయానికే ఆయన రూ.84 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టేరంటే, కట్టినంత డబ్బు ప్రకారం లెక్క వేస్తే ఈ సంవత్సరానికి ఆయన ఆదాయం రూ.500 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్హు నని చెబుతున్నారు.

ఈయన ఆదాయం టాటా, బిర్లా మరియూ అంబానీలను సిగ్గు పడేటట్లు చేస్తుందని ఒక సోషియల్ ఆక్టివిస్ట్ అన్నారు.

జగన్మోహన్ గారి ఆదాయం ఒక్క సారిగా 1000 శాతం ఎలా పెరిగిందా అని అందరూ షాక్ లో ఉన్నారట. ఎందుకంటే, 2008-2009 కి ఆయన కట్టిన ఆదాయపు పన్ను రూ.2.92 లక్షలు అయితే 2009-2010 కి ఆయన కట్టిన ఆదాయపు పన్ను రూ.6.72 కోట్లట. మరి 2010-2011 సంవత్సరం లో మొదటి 6 నెలల ఆదాయానికే ఆయన రూ.84 కోట్లు అడ్వాన్స్ ఆదాయపు పన్ను కట్టేరంటే, పూర్తి సంవత్సరానికి ఎంత కడతారో, ఆయన ఆదాయం ఎంత ఉంటుందో నని ఆశ్చర్య పోతున్నారు. వ్యక్తి గతంగా ఆదాయపు పన్ను కట్టే వారు, సంవత్సరానికి 2 సార్లు అడ్వాన్స్ టాక్స్ కట్టాలి.

భారీగా అడ్వాన్స్ టాక్స్ లు కట్టే వారి పేర్లలో మైనింగ్ చక్రవర్తుల పేర్లు ఎక్కువగా ఉంటాయట. కానీ ఈ సారి వీరందరినీ భారీగా ఓడించిన ఘనత జగన్మోహన్ గారికి దక్కుతుందట. కర్ణాటకా టూరిజం మినిస్టర్ భార్య గాలి లక్ష్మీ అరుణ, కమల్జీత్ సింగ్ అహుల్వాలియా మరియూ రామ మూర్తి ప్రవీణ్ చంద్ర. వీరంతా రూ.7 కోట్ల నుండి రూ.20 కోట్ల దాకా కట్టేరట. వీరే కాకుండా ఇందిరాణీ పట్నాయక్ రూ.15 కోట్లు, ప్రశాంత్ అహులువాలియా రూ.10 కోట్లు, రాధా సతీష్ టింబ్లే రూ.9 కోట్లు, ఆనంద కుమార్ రూ.7.5 కోట్లు మరియూ కుమార మంగళం బిర్లా రూ.5.8 కోట్లు మొదటి 6 నెలలకు కట్టిన వారిలో ఉన్నారు.

"జగన్ ఎందుకు ముఖ్య మంత్రి కావాలని అంతగా పోరాడేరో ఇప్పుడు అర్ధమయ్యింది. తను అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను నిలబెట్టుకోవాలి. ముఖ్య మంత్రి పదవిలో ఉంటే ఆ పనిని సులభం గా చేసుకోవచ్హు" అని ఒకరంటే “వారినేమీ అనకండి. తప్పంతా ప్రజలది. ఇలాంటివారిని ఎన్నుకుని వారిని మరింత ఆస్తి పరులుగా చేస్తున్నారు" అని మరొకరన్నారు.

"ఏది ఏమైనా ఇంత ఆదాయపు పన్ను కట్టిన జగన్ కు ఒక సంవత్సరంలో ఇంత ఆదాయం ఎలా వచ్హిందో చెప్పమని ఇన్ కం టాక్స్ వారు నోటీస్ పంపించాలి. ఆయన ఎలా సంపాదించేరో ప్రజలకు తెలియాలి" అని ఆర్.టీ.ఐ ఆక్టివిస్ట్ అన్నారు.

Monday, October 11, 2010

అవినీతిని ఎందుకు చట్ట బద్దం చేయకూడదు..... సుప్రీం కోర్ట్ బెంచ్

"డబ్బులివ్వకుండా పనిజరగటంలేదు... ముఖ్యంగా ఇన్ కం టాక్స్, సేల్స్ టాక్స్ మరియూ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లలో. అవినీతిని మనదేశం అరికట్టలేక పోవడం, అదుపులో పెట్ట లేక పోవడం నిజంగా దురద్రుష్టకరం" అంటూ మనదేశంలోని ప్రభుత్వ ఆఫీసులలో పెరుగుతున్న అవినీతి గురించి తన ఆవేదనను వ్యక్త పరిచింది సుప్రీం కోర్ట్ బెంచ్.

పంజాబ్ కు చెందిన ఇన్ కం టాక్స్ ఇన్స్ పెక్టర్ మోహన్ లాల్ శర్మ ఒకరి దగ్గర రూ.10,000/- లంచం తీసుకున్నారని ఆయన మీద సి.బి.ఐ పంజాబ్ ట్రయల్ కోర్ట్ లో కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్ట్ మోహన్ లాల్ శర్మ ను నేరస్తుడుగా నిర్ధారించి ఆయనకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించింది. ట్రయల్ కోర్ట్ తీర్పును ఎదిరిస్తూ మోహన్ లాల్ శర్మ పంజాబ్ అండ్ హరియానా హై కోర్టు లో అపీల్ చేసేరు. పంజాబ్ హై కోర్ట్ మోహన్ లాల్ శర్మ అపీల్ ను విచారణ చేసి ఆయన నేరం చేయలేదని, కనుక అతను నిర్ధోషి అని తీర్పు ఇచ్హి, ట్రయల్ కోర్ట్ విధించిన శక్షను రద్దు చేసింది. హై కోర్ట్ తీర్పును ఎదిరిస్తూ సి.బి.ఐ సుప్రీం కోర్ట్ లో అపీల్ చేసింది. ఈ అపీల్ ను విచారణ కు తీసుకుంటూ పై విధంగా తమ ఆవేదనను వ్యక్త పరిచింది సుప్రీం కోర్ట్ బెంచ్.

"నేను నేరం చేయలేదు...కావాలని నన్ను ఈ కేసులో ఇరికించేరు" అని మోహన్ లాల్ శర్మ అంటే, "ట్రయల్ కోర్ట్ ఇతను నేరం చేసేడని నిర్ధారించి ఒక సంవత్సరం జైలు శిక్ష వేస్తే, హై కోర్ట్ ఇతను నేరస్తుడు కాదని విడుదల చేసింది" అని సి.బి.ఐ తరఫు న్యాయవాధి సుప్రీం కోర్టుకు తెలిపేరు.

"ప్రభుత్వం ఎందుకు అవినీతిని చట్ట బద్దం చేయకూడదు. అలా చేస్తే ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్ చేస్తారు కదా. ఉదాహరణకి ఒక మనిషికి ఒక పని చేసి పెట్టినప్పుడు రూ.2500/- ఇవ్వండి అని అడుగుతారు. దీని వలన ప్రతి వ్యక్తీ తాను లంచంగా ఎంత ఇవ్వాలో ముందే తెలుసుకుంటాడు. అప్పుడు బేరాలు ఆడే పని ఉండదు కదా" దూషించే ధోరణిలో సుప్రీం కోర్ట్ బెంచ్ అన్నది. "ప్రభుత్వ అధికారులు కూడా ఏం చేయ గలరు...ద్రవ్యోల్భణం పెరుగుతోంది కదా" అని కూడా వ్యాఖ్యానించింది.

మోహన్ లాల్ శర్మ చెప్పినదానిని సుప్రీం కోర్ట్ ఒప్పుకోలేదు. "ప్రభుత్వ ఆఫీసులలో, ముఖ్యంగా ఇన్ కం టాక్స్, సేల్స్ టాక్స్ మరియూ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లలో అవినీతి తాండవమాడుతోంది. కనుక ఈ కేసును కోర్టు విచారణకు తీసుకుంటోంది" అని తెలుపుతూ అక్కడున్న సీనియర్ న్యాయవాది కే.కే. వేణుగోపాల్ గారిని ఉద్దేశించి "అవినీతిని చట్టబద్దం చేసే దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి" అని అడిగింది.

"నీతి, నైతిక విలువలూ,సన్మార్గము గురించి మన దేశ స్కూల్ సిలబస్ ల లో ఒక సబ్ జెక్ట్ పెట్టాలి, దాని గురించి పిల్లలకు వివరించాలి. అలా చేస్తే కనీసం రాబోవు పౌరులు ఈ అవినీతి పోరుకు దూరంగా ఉంటారు" అని ఆయన అన్నారు.

10/10/10 రోజున చూపిన వీడియోలలో నాకు నచ్హిన 2 వీడియోలు

10/10/10 తారీఖున నేను ఒక ప్రోగ్రాం లొ పార్టిసిపేట్ చేసేను. ఆ ప్రోగ్రాం లో ఎనర్జీ సేవింగ్ గురించి, వాతావరణ కాలుష్యం గురించి మరియూ వాటర్ సేవింగ్ గురించి చాలా మంది మాట్లాడేరు. చాలా వీడియోలు చూపించేరు. అక్కడ చూసిన వీడియోలలో నాకు బాగా నచ్హినవి ఈ టపా లో ఉంచేను.


మనవంతు మనం ఏం చేయగలమో అది చేద్దాం

Friday, October 8, 2010

అవండియా(Avandia)....మీ ఇంట్లో ఎవరైనా డయబిటీస్ కు ఈ మందు వాడుతుంటే వెంటనే ఆపమనండి

రోసిగిల్టాజోన్ (Rosigiltazone) ....ఈ కెమికల్ ను అవండియా పేరుతో గ్లాస్కో కంపెనీ వారు డయబిటీస్ వ్యాధి కి మందుగా టాబ్లెట్ రూపంలో పరిచయం చేసేరు. ఈ మందును భారతదేశంలో చాలా మంది డయబిటీస్ వ్యాధికి వాడుతున్నారు. ఈ మందును భారత ఆరోగ్య శాఖ నిషేదించింది. మీ ఇంట్లో వారుగానీ, మీకు తెలిసిన వారు గాని ఈ మందును వాడుతూంటే వెంటనే వారిని వాడ వద్దని చెప్పండి. ఒక సారి మీ డాక్టర్ను కలిసి ఈ మందుకు బదులు ఇంకో మందును రాసిమ్మనండి.

రోసిగిల్టాజోన్ (అవండియా) వాడితే గుండె జబ్బులు వస్తాయని ప్రపంచ వ్యాప్తంగా జరిపిన పరిశోధనలో తెలిసింది. యూరప్ దేశాలలో ఈ మందు వాడకాన్ని పోయిన నెల నుండే నిషేదించేరు. అమెరికాలో ఈ మందు వాడకానికి చాలా ఆంక్షలు విధించేరు.

మామూలుగా డయబిటీస్ పేషంట్లకు సుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి వాడే మందులతో పాటూ వారికి గుండె జబ్బులు రాకుండా ఉండటానికి కార్డియో-ప్రొటెక్టివ్ మందులు కూడా వాడాలట. కానీ మన దేశంలో అలా చేయటంలేదట. అందువలన భారతదేశంలో డయబిటీస్ పేషంట్లకు గుండె జబ్బులు వచ్హే అవకాసం ఉన్నదని డాక్టర్లు చెబుతున్నారు.

ఇప్పుడు డయబిటీస్ కు వాడుతున్న అవండియా టాబ్లెట్ల వలన వారికి గుండె జబ్బులు అధికమయ్యే అవకాశం ఎక్కువుగా ఉన్నది కనుక ఈ మందును వెంటనే అమ్మకం నుండి నిషేధించేరు.

మూడు సంవత్సరాల నుండి ఈ మందు పై పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. 2007 లో జరిపిన మొదటి పరిశోధనలోనే ఈ మందు గుండె జబ్బులు కలిగిస్తోందని తెలిసింది. వెంటనే ఈ మందు వాడకాన్ని తగ్గించమని అమెరికాలోని డాక్టర్లకు అమెరికన్ ఆరోగ్య శాక ఒక నోట్ ను పంపింది.

డిల్లీలో ఉన్న ఫోర్టీస్ హాస్పిటల్ చీఫ్ డా. అనుపం మిశ్రా "భారతదేశంలో హార్ట్ కు సంబంధించిన వ్యాధులు ఎక్కువ మందికి వస్తున్నాయి. ముఖ్యంగా సుగర్ వ్యాధి ఉన్నవారికి సిండ్రోం X (Syndrome X) వలన గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉన్నది. అందువలన సుగర్ వ్యాధికి వచ్హే కొత్త మందులను మన దేశంలో తీవ్ర పరిశోధన చేయాలి. ఎక్కువ ఆలశ్యం చేయ కుండా ఈ మందును నిషేధించినందు వలన చాలా మందిని గుండె జబ్బుల రిస్క్ నుండి కాపాడినట్లే" అన్నారు.

రోసిజిల్టాజోన్....ఈ మందును భారతదేశంలో అధికంగా వాడుతున్నారు. చాలా మందుల కంపనీలు దీనిని తయారు చేస్తున్నారు. గ్లాస్కో కంపనీ వారు "అవండియా" పేరుతో మార్కెట్ చేస్తున్నారు. టారెంట్, డా.రెడ్డీ లాబ్స్, గ్లెన్మార్క్, సన్ ఫార్మా మరియూ సిప్లా లాంటి పెద్ద కంపనీలు వేరు వేరు పేర్లతో మార్కెట్ చేస్తున్నారు. మీరు వాడుతున్న మందులో (అది ఏ కంపనీదైనా సరె) రోసిజిల్టాజోన్ కెమికల్ ఉన్నదా అని చూడండి.

Thursday, October 7, 2010

ఎన్నికలలో తమ పార్టీని గెలిపిస్తే ఒకరు సైకిల్,మరొకరు మోటార్ సైకిల్ ఉచితంగా ఇస్తామంటున్నారు

"మా RJD-LJP కూటమిని గెలిపిస్తే స్కూల్ పిల్లలందరికీ మోటార్ సైకిల్ ఉచితంగా ఇస్తాను" అని RJD చీఫ్ లలూ ప్రశాద్ యాదవ్ బీహార్ ఎన్నికల మీటింగు లో మాట్లాడుతూ చెప్పేరు.

అంతకు ముందు రోజు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ "మా పార్టీని ఎన్నికలలో గెలిపిస్తే స్కూల్ విధ్యార్ధులందరికీ ఉచితంగా సైకిల్ ఇస్తాను" అని ఒక ఎన్నికల మీటింగ్లో ప్రజలకు వాగ్ధానం చేసేరు.

నితీష్ కుమార్ గారు సైకిల్ ఇస్తానని ప్రజలకు వాగ్ధానం చేసిన మరుసటి రోజున RJD చీఫ్ లలూ ప్రశాద్ యాదవ్ గారు మొటార్ సైకిల్ ఇస్తానని వాగ్ధానం చేసేరు. లలూ ప్రశాద్ యాదవ్ చేసిన వాగ్ధానం గురించి పత్రికల వారితో మాట్లాడుతూ "మోటార్ సైకిల్ ఉచితంగా ఇస్తే, దానిని వాడుకునేందుకు ఉచితంగా పెట్రోల్ అడుగుతారు...అది కూడా ఇస్తానని చెప్పమనండి...చెప్పలేరు. కనుక మీకు ఇచ్హిన మోటార్ సైకిల్ ను అమ్ముకోండి అని చెబుతారు. ఇది నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేసిన వాగ్ధానం కాదు...ఓట్ల కోసం చేసిన వాగ్ధానం. ఇది ప్రజలు గమనించాలి" అని నితీష్ కుమార్ గారు అన్నారు.

రాజకీయ నాయకులు ఓట్లకోసం ఒకరితో ఒకరు పోటీ పడి ఉచిత సేవా పధకాల క్రింద పెద్ద పెద్ద వస్తువలను ఉచితంగా ఇస్తామని బహిరంగంగా చెబుతూంటే ఎన్నికల కమీషన్ దీని గురించి నోరు విప్పటం లేదు.

ఒక పక్క రాజకీయ నాయకులు ఇలా వాగ్ధానాలు చేసుకుంటూ వెడుతూంటే, మరో పక్క ఒక NGO సంఘం క్రిమినల్ నేరస్తులను ఎన్నికలలో నిలబడకుండా చేయమని ఎన్నికల కమీషన్ను అడుగుతోంది.

బీహార్ రాష్ట్ర శాశన శభ ఎన్నికలు ఈ నెల 21 నుండి జరగనున్నది. ఇప్పుడున్న శాశన శభలో 243 MLA లు ఉన్నారు. ఇందులో 109 మంది క్రిమినల్ నేరస్తులని ఈ NGO సంఘం చెబుతోంది. పార్టీల ప్రకారం చూస్తే BJP పార్టీ వారిలో 53 శాతం, RJD-LJP-JD(U) కూటమిలో 44 శాతం, కాంగ్రెస్ పార్టీలో 39 శాతం, CPI పార్టీలో 32 శాతం మరియూ BSP పార్టీలో 18 శాతం MLA ల మీద క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయట. అందువలన ఈ సారి జరిగే ఎన్నికలలో ఎవరి మీద క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయో వారికి టికెట్లు ఇవ్వవద్దని ఈ NGO సంఘం అడిగిందట. హత్యా నేరం, హత్యకు పూనుకున్నారనే నేరం, కిడ్నాప్ నేరం మరియూ దొంగతనాల నేరం ఉన్నవారిని ఎన్నికలలో నిలబడకుండా చేయమని ఎన్నికల కమీషన్ ను కోరుకున్నారట.

"అన్ని పార్టీలలోనూ నేరాలు చేసిన వారు ఉన్నారు. వారే పరిపాలనలు చేస్తున్నారు. అలాంటప్పుడు వారే వారిని బహిస్కరించుకుంటారా.....ఉచితం అనే పేరుతో ప్రజల సొమ్మును దోచుకునేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు కానీ అందరూ ఒకటే" అని ఒక సోషియల్ ఆక్టివిస్ట్ అన్నరు.

అన్య ప్రాణుల కోసం అన్వేషణ.....ఇది మానవజాతికి మంచిదేనా?

భూమి యొక్క ఉపరితల వాయుమండల వాతావరణం లో అన్య ప్రాణులు బాక్టీరియా రూపంలో ఉండవచ్హు నని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని కనుగొనటం కోసం శాస్త్రవేత్తలు ఒక అన్వేషణా పరికరాన్ని వాయుమండల ఉపరితలానికి పంపటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కడో భూమికి చాలా దూరంలో కాదు. భూమికి అతి దగ్గరలొ వాయుమండల ఉపరితలంలో వెతుకుతారట. అన్య ప్రాణులు బాక్టీరియా రూపంలో ఉండవచ్హు లేక మరే రూపంలోనైనా ఉండవచ్హు.

ఈ అన్వేషణ కోసం బ్రిటీష్ శాస్త్రవేత్తలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారితో కలిసి ఒక బలూన్ ను పంపిస్తారట. ఈ బలూన్ లో బాక్టీరియాలనూ మరియూ మైక్రో ఆర్గానిజం ను వెతకటానికి కావలసిన పరికరాలు ఉంటాయట.

విపరీతమైన వేడి, చలి మరియూ రసాయణాల రేడియేషన్లను ఈ బాక్టీరియాలు తట్టుకుని బ్రతుకుతున్నాయట. కనుక ఈ ప్రాణులు మానవ శాస్త్రీయానికి కొత్తవిగా ఉంటాయట. ఈ ప్రాణులు అంతరిక్షంలో ఉన్నటువంటి క్షుద్ర గ్రహాలకూ, తోక చుక్కలకూ అతుక్కుని ఉంటాయట. వాటి మీద చిన్న దాడి చేసి ఆ ప్రాణులను పరిశోధనా నిమిత్తం భూమి కి తీసుకువస్తారట.

"భూమి మీద నివసిస్తున్న ప్రాణులు అంతరిక్షం నుండి వచ్హినవే అని చెప్పబడుతోంది. అది గనుక నిజమైతే భూమి మీద ఉన్న ప్రాణులు అంతరిక్ష వాతావరణం లో జీవించ వచ్హు కదా" క్రాన్ ఫీల్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంటున్నారు.

"అంతరిక్ష వాతావరణం చాలా హాని కరంగా ఉంటుంది.అక్కడ 90 డిగ్రీల సెల్సీయస్ వేడి ఉండవచ్హు లేక అసలు ఏమీ లేక పోవచ్హు. అటువంటి వాతావరణంలో అన్య ప్రాణులు జీవిస్తున్నాయంటే క్షుద్ర గ్రహాలలోనూ, అంగారక గ్రహం లోనూ కూడా అన్య ప్రాణులు జీవిస్తూండవచ్హు" అని కూడా తెలిపేరు.

శాస్త్రవేత్తలు భూమి మీద కూడా అతి ఉష్ణ వాతావరణాన్ని తట్టుకుని జీవించే బాక్టీరియాలను కనుగొన్నారు. కొన్ని బాక్టీరియాలు స్పోర్స్(Spores) గా మారి ఎటువంటి వాతావరణం లో నైనా సరే ఎక్కువకాలం బ్రతక గలుగుతున్నాయి.

అన్య ప్రాణుల అన్వేషణ కోసం భూమి ఉపరితల వాయుమండలం లోకి పంపుతున్న బలూన్ మిషెన్ ను CASS-E గా పేర్కొన్నారు. అంతరిక్ష నౌకలను తయారు చేసే స్టెరైల్ (sterile) చొట్లో ( అంగారక గ్రహం లాంటి గ్రహాలకు పంపే అంతరిక్ష నౌకలు తయారు చేసే చోట్లో) ఈ బలూన్ ను తయారు చేస్తున్నారు. ఎందుకంటే, భూమి మీదున్న బాక్టీరియాలు ఈ బలూన్ కు అతుక్కుని అంతరిక్షానికి వెళ్లకూడదని.

ఈ అన్వేషణ అవసరమా? ఇప్పటికే మానవ జాతి ఎన్నో రకాల బాక్టీరియాల తో పోరాడ వలసి వస్తున్నది. ఈ మధ్య బయట పడిన H1N1 వైరస్ కు ఇంకా సరైన మందు కనుక్కోలేదు. ఇదొక్కటే కాదు. మానవజాతికి అంతు చిక్కని ఎన్నో బాక్టీరియాలూ మరియూ వైరస్ ల వలన మానవ జాతికి ఎంతో హాని జరుగుతోంది. ఈ అన్వేషణ వలన మరికొన్ని కొత రకాల బాక్టీరియాలూ మరియూ వైరస్ లూ భూమి మీదకు రావచ్హు. వీటి వలన మానవ జాతికి మరింత హాని జరగ వచ్హు.....మరి ఈ అన్వేషణ దేని కోసమో?

Wednesday, October 6, 2010

భారతదేశ ఈ కళాకారునికి పలు దేశాలు బహుమతులు ఇచ్హినై....భారతదేశం మాత్రం ఏమీ ఇవ్వలేదు

ఈ కళాకారుని వలన భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల కళా వేదికలలో మెప్పుకోలు పొందింది. కానీ తను మాత్రం ఈ కళాకారునికి బహుమతి కాదు కదా ఒక చిన్న ప్రశంసా పత్రం కూడా అందించలేకపోయింది. అయినా ఈ కళాకారుడు తన మాత్రుదేశం కోసం కామన్ వెల్త్ గేంస్ ఓపెనింగ్ సెర్మనీ లో తన కళా ప్రతిభతో మహాత్మా గాంధీ గారి డాండి యాత్ర బొమ్మను తయారు చేసి ప్రదర్శించేడు. ఇతను చూపిన కళా ప్రతిభను తిలకించిన పలువురు (విదేశీయులు కూడా) ఈయన్ను ప్రశంసలతో అభినందించేరు.

ఈ కళాకారుడు ఈ మధ్యే అమెరికాలో తన కళా ప్రతిభను చూపించి, అక్కడ జరిగిన పోటీలో మొదటి బహుమతి సంపాదించుకుని మాత్రుదేశం తిరిగి వచ్హేడు. సుదర్శన్ పట్నాయక్ అనే ఈ కళాకారుడు బెర్లిన్ లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలలో "ప్యూపిల్స్ చాయస్ అవార్డ్" ను గెలుచుకున్నారు. మాస్కోలో జరిగిన పోటీలో "స్పెషల్ బహుమతి" అందుకున్నారు. ఇలా పలుదేశాల నుండి బహుమతులు పొందేరు.

"మన దేశం కనీసం నా కళను గుర్తించి ఒక గుర్తింపు పత్రం కూడా ఇవ్వలేదు" తన మనసులోని బాధను బయటపెట్టేరు.

ఈ కళాకారుని ప్రతిభను ఈ వీడియోలో చూడండి.7 ఏళ్ల కేసవ్ కామన్ వెల్త్ గేంస్ ఓపెనింగ్ సెర్మొనీలో తబలా వాయించి అందరినీ ఆశ్చర్య పరిచేడు....వీడియో (పూర్తిగా చూడండి)

పాండిచ్హేరీ కి చిందిన 7 ఏళ్ళ కేసవ్ కామన్ వెల్త్ గేంస్ ఓపెనింగ్ సెర్మొనీలో తబలా వాయించడాన్ని ప్రపంచంలో చాలామంది చూసి ముగ్దులైయ్యేరు. అతని టాలెంట్ ను ప్రశంసించని వారు లేరు. ఈ వీడియో చూసిన తరువాత మీరు గూడా ఆ చిన్నారిని ప్రశంసించ కుండా ఉండలేరు. వీడియోను పూర్తిగా చూడండి. మనకి ఇంకో తబలా విద్వాన్ జాకీర్ హుసేన్ దొరికినట్లే. గ్రేట్ పర్ ఫార్ మెన్స్. గ్రేట్ టాలెంట్.


Tuesday, October 5, 2010

డబ్బింగ్ సినిమాల వలన ఒరిజనల్ తెలుగు సినిమాలకు ప్రజాధారణ లభించటం లేదా?

తమిళ సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమలోకి బాగా దూసుకు వచ్హేసిందని తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు భావిస్తున్నారు. తమిళ డబ్బింగ్ సినిమాల వలన ఒరిజినల్ తెలుగు సినిమాలకు ఆదరణ తగ్గుతోందనే భావం కంటే తమిళ సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమలోకి దూసుకు వచ్హేస్తోందనే ఆందోళన ఎక్కువగా ఉన్నది. అందువలన డబ్బింగ్ సినిమాలను ఆంద్ర రాష్ట్రంలో బాన్ చేయవలసినదని కొందరంటుంటే, డబ్బింగ్ సినిమాలు 50 ధియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయాలని రూలు పెట్టండని కొందరంటున్నారు. బాన్ చేయడమూ మరియూ కట్టుదిట్టాలు పెట్టడమూ చట్ట రీత్యా కుదరదని తెలిసినా కొందరు ఇలా తమ ఆలోచనను వ్యక్తపరుస్తున్నారు.

భారతదేశంలో తెలుగు సినీ పరిశ్రమే అధికమైన సినిమాలు తీస్తొందన్నది నిజం. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు తమ సొంత రాష్ట్రంలో కంటే కర్నాటకా, ఒరిస్సా, తమిళనాడు, కేరళ మరియూ విదేశాల ప్రదర్శనల నుండే ఎక్కువ డబ్బు వస్తోందనేది కూడా నిజమే.

రజినీకాంత్, సూర్యా, విక్రం మరియూ కార్తీక్ ల డబ్బింగ్ సినిమాలు ఒరిజినల్ తెలుగు సినిమాల కంటే ఎక్కువ ఆదరణ పొందుతూ ఎక్కువ డబ్బు సంపాదిస్తూండటం తెలుగు సినీ పరిశ్రమలోని కొందరిని కలవర పరుస్తోంది. కనీసం 6 గురు తమిళ డైరెక్టర్లు తెలుగు సినీ పరిశ్రమలోకి రావడం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది.

తెలుగు నుండి తమిళానికి డబ్బింగ్ చేసిన సినిమాలు తమిళనాడులో ఆదరణ పొందటంలేదు. అది చిరంజీవి సినిమా అయినా సరే లేక మహేష్ బాబు సినిమా అయినా సరే ఆడటంలేదు. అందుకని తెలుగులోకి డబ్బింగ్ చేసిన తమిళ సినిమాలకు కట్టుదిట్టాలు పెట్టండి లేకపోతే ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయమనండి అని కొందరు చెబుతున్నారట.

"తెలుగు సినిమాలు ప్రజా ఆదరణ పొందలేకపోవడానికి కారణం తెలుగు సినిమాలలో క్వాలిటీ తగ్గిపోవడమే. డబ్బింగ్ సినిమాలను బాన్ చేసినంత మాత్రానా క్వాలిటీ లేని తెలుగు సినిమాలను ప్రజలు చూస్తారా. చూడరు. ఒరిజినల్ తెలుగు సినిమాలకు ఆదరణ ఎందుకు తగ్గిపోతోందో పరిశీలించాలి. ప్రజలు ఎలాంటి సినిమాలకు ఆదరణ చూపిస్తున్నారో తెలుసుకుని దానికి తగ్గ కధలతో సినిమాలు తీయాలి. అంతే కానీ డబ్బున్నది కదా నని నిర్మాత తనకు నచ్హిన సినిమాను తీస్తే అది ప్రజలు ఎందుకు చూస్తారు. క్వాలిటీ ఉన్న సినిమాలు ఏ భాషవైనా సరే చూస్తారు, విజయవంతం చేస్తారు. అలాంటి సినిమాలు తీయాలి" తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తి అన్నారు.

నిజమే. తమిళంలో బాగా ఆడిన సినిమాలనే తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు. 10 సినిమాలకు 2 సినిమాలే డబ్బింగ్ చేయబడుతున్నాయి. ఎంత పేరున్న నటుడి సినిమా అయినా అందులో క్వాలిటీ లేకపోతే తమిళ ప్రజలు కూడా ఆదరణ చూపటంలేదు. సినీ పరిశ్రమకు కొత్తగా వచ్హిన వారి సినిమాలు హిట్ అయినై. పెద్ద పేరున్న నటులు నటించిన సీమాలు ఫ్లాప్ అయినాయి. అంటే ఏ రాష్ట్ర ప్రజలైనా క్వాలిటీ ఉన్న సినిమాలే చూస్తారు. అంతెందుకు, ఆంగ్ల భాష నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన 2012 సినిమా ప్రజాధారణ పొంది ఒరిజినల్ తెలుగు సినిమాలకంటే ఎక్కువ సంపాదించి పెట్టిందట.

క్వాలిటీ ఉంటేనే ప్రజలు ఆదరిస్తారన్నది మొదటి నుండి వస్తున్న మాటే, క్వాలటీ తక్కువగా ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయనేది ఇప్పటి మాట.

ఎక్కడైనా 45 మార్కులు గ్రేస్ మార్కులుగా వేసి పాస్ చేయిస్తారా?...ఈ మెడికల్ యూనివర్సిటీ చేసింది

ఒక స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్ ల లోనూ బాగా మార్కులు తెచ్హుకుని, ఏదో ఒక సబ్జెక్ట్ లో కొద్ది మార్కుల తేడాలో ఫైల్ అయితే 5 మార్కుల దాకా గ్రేస్ మార్కులు వేసి ఆ స్టూడెంట్ ను పాస్ చేయించటానికి యూనివర్సిటీ అధికారులకు హక్కు కలిగించేరు. అయితే ఇక్కడ ఒక యూనివర్సిటీ (అందులోనూ ఒక మెడికల్ యూనివర్సిటీ) ఏకంగా 45 మార్కులు గ్రేస్ మార్కులుగా వేసి స్టూడెంట్లను పాస్ చేయించింది.

ఇదేం పద్దతని అడిగితే "గ్రేస్ మార్కులు వేయడానికి ఒక ఖచ్హితమైన రూలు లేదు. ఒక్కొక్క సంవత్సరమూ ఒక్కొక్క విధముగా డిసైడ్ చేస్తాము. ఎక్కువ మంది స్టూడెంట్స్ తమ పరీక్షలను రెండు లేక మూడో సారి గనుక రాస్తూంటే, అటువంటి స్టూడెంట్లను ఎలాగైనా పాస్ చేయిస్తాము. ఎన్ని మార్కులు గ్రేస్ మార్కులుగా వేయాలనేది డిసైడ్ చేయటానికి ఒక పాస్ కమిటీ బోర్డ్ ఉన్నది" అని యూనివర్సిటీ అధికారి ఒకరు తెలిపేరు.

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి చట్టాలకు విరుద్దంగా, తమిళనాడు లోని డా. ఎం.జీ.ఆర్ మెడికల్ యూనివర్సిటీ వారు పాస్ మార్కులు తెచ్హుకోలేక రెండవ సారి పరీక్ష రాసిన విధ్యార్ధులకు 45 మార్కుల దాకా గ్రేస్ మార్కులు వేసి( పాస్ మార్క్ 50) వారిని పాస్ చేయించేరట. 2009 లో ఇది జరిగిందట.అనాటమీ మరియూ బైయో కెమిస్ట్రీ పరీక్షలు రెండవ సారి రాసిన వారికి 35 గ్రేస్ మార్కులూ, ఫిసియాలజీ పేపర్ రాసిన వారికి 10 గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయించిందట. దీనితో పాస్ అయిన వారి సంఖ్య 81 నుండి 161 గా పెరిగిందట.

మెడిసన్ చదువుకునే విధ్యార్ధులు కష్టపడి నాలెడ్జె తో చదువుకోవాలని మరియూ వారికి ఇచ్హే ట్రైనింగ్ శ్రేష్టమైనదిగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని సబ్జెక్ట్ లలోనూ బాగా మార్కులు తెచ్హుకుని, ఏదో ఒక సబ్జెక్ట్ లో కొద్ది మార్కులు తక్కువైతే, అలాంటి విధ్యార్ధికి 5 మార్కుల దాకా గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయించ వచ్హు నని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం పెట్టింది. కానీ దీనికి విరుద్దంగా 2007 నుండి 2009 వరకు ఎం.బి.బి.ఎస్. విధ్యార్ధులకు 10 నుండి 45 మార్కుల దాకా గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయించేమని ఎం.జి.ఆర్ యూనివర్సిటీ అధికారులు ఒక ఆర్.టి.ఐ పిటీషన్ కు ఇచ్హిన రిప్లై లో ఒప్పుకున్నారు. ఇలా చేయడం వలన ఒక బ్యాచ్ కు 20 నుండి 450 మంది విధ్యార్ధులు ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసేరట. అలాగే బి.డి.ఎస్ పరీక్షలలో కూడా 8 నుండి 25 మార్కుల దాకా గ్రేస్ మార్కులు వేసేమని తెలిపేరు.

ఈ విషయం బయట పడిన వెంటనే మెడికల్ కౌన్సిల్ వారు ఈ గ్రేస్ మార్కుల కుంభకోణం గురించి విచారణ మొదలుపెట్టేరు.

మెడిసన్ లో సీటు తెచ్హుకోవాలంటే ఇంటర్ లో చాలా ప్రతిభ చూపించాలి. ఎక్కువ ప్రతిభ చూపించిన వారికి మాత్రమే సీటు దొరుకుతుంది. ఇది ప్రభుత్వ కేటాయింపు సీట్లకు. మేనేజ్ మెంట్ సీట్లకు పెద్దగా ప్రతిభతో పనిలేదు. మినిమం ఎలిజిబిలిటీ మార్కులూ, డొనేషన్ కట్టటానికి ఎక్కువ డబ్బు ఉంటే చాలు. వీరికి సీటు దొరుకుతుంది. మరి వీరు కూడా మెడిసన్ పూర్తిచేయాలి కదా......లేకపోతే యూనివర్సిటీ పేరు దెబ్బతింటుంది. అందుకని 5 మార్కులే తెచ్హుకున్న ప్రతిభ లేని విధ్యార్ధికి 45 మార్కులు గ్రేస్ మార్కులుగా వేసి అతన్ని కూడా డాక్టర్ చేయడం...అన్ని నేరాలకన్నా పెద్ద నేరం.

Monday, October 4, 2010

మొట్ట మొదటి "రోబోటిక్" హార్ట్ కూడా విజయవంతమే

రోబో సినిమా విజయవంత మవడమే కాకుండా, ప్రపంచ ప్రజలలో ఒక సంచలనం పుట్టించింది. మామూలుగా సినిమాలను మొదటి రోజు (అంతెందుకు...మొదటి వారంలో కూడా) చూడటానికి ఇష్టపడని వారు కూడా ఈ సినిమాను మొదట్లోనే చూసేయాలని తొందరపడుతున్నారు. రోబో చిత్రాన్ని చిత్రించడానికి పనిచేసిన వారు
రాత్రి, పగలు చూడక కష్టపడి పనిచేసేరు. వారి శ్రమ వ్రుధా పోలేదు.

అలాగే 15 సంవత్సరాల వయసున్న ఇటలీ దేశ కుర్రాడికి 10 గంటలు నాన్ స్టాప్ గా ఆపరేషన్ చేసి, ప్రపంచంలోనే మొట్టమొదటి "రోబోటిక్" హ్రుదయాన్ని అమర్చిన డా.ఆంటోనియో అమోడియో శ్రమ కూడా వ్రుధా కాలేదు. 10 గంటలు ఆపరేషన్ టేబుల్ మీద, మత్తు మందుల ప్రభావంతో పడుకున్న ఆ పిల్లవాడు ఆపరేషన్ పూర్తైన 6 గంటల తరువాత స్ప్రుహలోకి వచ్హి నేరుగా బ్రష్ చేసుకోవడానికి వెళ్లేడట. అతన్ని పరీక్షించిన డాక్టర్ ఆ పిల్లవానిలో కలిగిన ప్రోగ్రెస్ చూసి ఆనంద పడ్డారట. మామూలు పరిస్తితికి రావాడానికి కొన్ని రోజులు పడుతుంది, కానీ అతను కోలుకునే విధానం స్పీడ్ గా ఉందని తెలిపేరు.

ఈ పిల్ల వాడు మసుల్ వేస్టింగ్ ఇల్ నెస్ (MUSCLE-WASTING ILLNESS…..DUCHENNE’S SYNDROME) అనే వ్యాధితో భాధ పడుతున్నాడు. ఈ వ్యాధితో ఇతను ఎక్కువరోజులు బ్రతకడం కుదరదట. ఈ వ్యాధి వలన మొట్టమొదటిగా గుండె కండరాలు క్షీణించుకు పోతాయట. శరీరంలోని మిగిలిన కండరాలు క్షీణించడానికి టైము పట్టీనా గుండె క్షీణించుకు పోవడంతో మరణం సంభవిస్తుంది. ఎవరైనా గుండె డొనేషన్ చేస్తే గుండె ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్హు. కానీ ఆ మార్చిన గుండె కండరాలు కూడా అతని కున్న వ్యాధి వలన క్షీణించుకుపోతుంది. అందువలన ఇతనికి పర్మనెంట్ ఆర్టిఫిషియల్ మిషనైస్డ్ గుండె అమర్చాలని నిర్ణయించుకున్న డాక్టర్ అలాంటి గుండె ను తయారుచేయించేరు. దీన్ని "రోబోటిక్" హార్ట్ అంటారు. ఈ పిల్లవాడికి అమర్చిన రోబోటిక్ గుండే పొడవు 2.5 ఇంచ్ లు, బరువు 85 గ్రాములు.

ఈ రోబోటిక్ గుండె పూర్తిగా కరెంటు తో పనిచేస్తుంది. ఆ రోబోటిక్ గుండెను ఆ పిల్లవాని తోరక్స్ లోపల అమర్చి, అక్కడి నుండి ఒక వైరు అతని ఎడమ చెవి బయటకు తీసుకు వచ్హేరు. ఆ వైరు మూలంగా అతను రోబోటిక్ గుండె ను రాత్రి పూట చార్జ్ చేసుకోవచ్హు (మొబైల్ ఫోన్ లాగా). ఈ రోబోటిక్ గుండె అమర్చినందు వలన ఆ పిల్లవాడు ఖచ్హితంగా మరో 25 సంవత్సరాలు బ్రతుకుతాడని, అందరిలాగా మామూలు జీవితం గడుపుతాడని ఆ డాక్టర్ తెలిపేరు.

గుండెను డొనేట్ చేసే వారు తక్కువగా ఉన్నందున, ఎంతో మంది పిల్లలకు గుండె మార్పిడి చేయలేక పోతున్నారట. కానీ ఇప్పుడు ఈ "రోబోటిక్" గుండె విజయవంతమైనందున చాలా మంది పిల్లల జీవితాలలో వెలుగు వస్తుందని చెబుతున్నారు.

మెడికల్ రీసెర్చ్ లో ఇది ఒక పెద్ద మైళు రాయి. దీనిని ఉపయోగించుకుని పెద్ద వారికి కూడా పర్మనెంట్ ఆర్టిఫిషియల్ రోబోటిక్ గుండె ను తయారు చేస్తారట. రోబోటిక్ కాబట్టి ఇది ఎటువంటి ఇబ్బందులకూ, ఇన్ ఫెక్షన్ లకూ లోనవదట.

గ్రేట్ అచీవ్ మెంట్. ఈ రోబోటిక్ హార్ట్ ను తయారు చేసిన వారికీ, ఈ హార్ట్ ను విజయవంతముగా అమర్చిన డాక్టర్లకూ జోహార్లు. ఈ రోబోటిక్ హార్ట్ ను అమర్చుకున్న 15 ఏళ్ల ఆ కుర్రాడు ఆనందంగా తన జీవితాన్ని గడపాలి. గాడ్ బ్లెస్ హిం.

కామన్ వెల్త్ గేంస్ 2010 ఓపెనింగ్ సెర్మొనీ...కొంత వీడియో

Saturday, October 2, 2010

భారదేశం ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్తలు....వివరించే అద్భుత ఫొటోలు(బద్ర పరుచుకో దగినవి)

అహింశా పోరాటాలతో ఏదైనా సాధించవచ్హు అని ప్రపంచానికి ఎత్తిచూపిన "మహాత్మా గాంధీ" గారి పుట్టిన రోజున, మనదేశానికి చెందిన గొప్ప శాస్త్రవేత్తలను కూడా గుర్తుకు తెచ్హుకోవాలని వారి గురించి ఈ టపా మూలంగా మీకు తెలియపరుస్తున్నందుకు ఆనందిస్తున్నాను.

ARYABHATT (476 CE) MASTER ASTRONOMER AND MATHEMATICIAN

BHASKARACHARYA II (1114-1183 CE)....GENIUS IN ALGEBRAACHARYA KANAD (600 BCE) ....FOUNDER OF ATOMIC THEORYNAGARJUNA (100 CE) ....WIZARD OF CHEMICAL SCIENCEACHARYA SUSHRUT (600 BCE)....FATHER OF PLASTIC SURGEVARAHAMIHIR (499-587 CE)....EMINENT ASTROLOGER AND ASTRONOMERAACHARYA PATANJALI (200 BCE....FATHER OF YOGAACHARYA BHARADWAJ (800 BCE)....PIONEER OF AVIATION TECHNOLOGYACHARYA KAPIL (3000 BCE)....FATHER OF COSMOLOGY

Friday, October 1, 2010

మీకు న్యూమరాలజీ మీద నమ్మకమున్నదా? ఉంటే మీ మొబైల్ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలో తెలుసుకోండి

"న్యూమరాలజీ ప్రకారం మొబైల్ నెంబర్ సరిగ్గా లేకపోతే దాని వలన చాలా కష్టాలు వస్తాయి" అని ఒక ప్రసిద్ది చెందిన న్యూమరాలజిస్ట్ తెలిపినట్లు ఒక ప్రముక దినపత్రిక ప్రచురించింది.ఈ మధ్య ముగ్గురు వ్యక్తులు తమ మొబైల్ నెంబర్లలో 888 888 888 (మొదటి నెంబర్ కాకుండా) ఉండటం వలన మర్మమైన ప్రమాదాలలో చనిపోయేరట.

ఒకరు ఎలాగైతే పెళ్ళిల్లకూ, గ్రుహప్రవేశాలకూ మరియూ ఇతర శుభ కార్యాలకూ జ్యోతిష్కులను కలుసుకుని మంచి రోజులు నిర్ధారణ చేసుకుంటారో, అదేలాగా తమ మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఒక న్యూమరాలజిస్టు ను కలుసుకుని వారి సలహా మేరకు నెంబర్లను ఎంచుకుంటే చాలా మంచిదని ఆ న్యూమరాలజిస్ట్ తెలిపేరట.

"10 నెంబర్లు కలిగిన మొబైల్ నెంబర్లో వారు తీసుకునే నెంబర్ వారికి పాజిటివ్ శక్తిని ఇవ్వాలి. కొన్ని నెంబర్లు పాజిటివ్ శక్తిని ఇస్తాయి, కొన్ని నెంబర్లు నెగటివ్ శక్తిని ఇస్తాయి కనుక ఎంచుకునే నెంబర్ ఆ శక్తులను బ్యాలన్స్ చేయాలి" అని అన్నారట.

ప్రతి ఒక్కరూ వారు తీసుకోవలసిన నెంబర్ ను ప్రత్యేకం గా న్యూమరాలజీ ప్రకారం నిర్ధారణ చేసుకుని తీసుకుంటే చాలామంచిదని చెబుతూ, నెంబర్లు ఎంచుకోవటానికీ, న్యూమరాలజీ లోని కనీస జాగ్రత్తలు పాటించటానికి కొన్ని టిప్స్ చెప్పేరు.

మొబైల్ నెంబర్లో ఏ ఒక నెంబరూ రెండు సార్లు రాకూడదట. ప్రతి ఒక్కరూ వారి పుట్టిన రోజు నెంబర్ ను మొబైల్ నెంబర్ లో ఉండకుండా జాగ్రత్త పడాలి (02/04/1987 అయితే వారు 4 అవాయ్డ్ చేయాలి). అలా కాకుండా ఏదైనా ఒక నెంబర్ ఒక సారి కంటే ఎక్కువ ఉంటే ఎలా ఉంటుందో తెలిపేరు.........1 ఎక్కువగా ఉంటే చేసే ఉద్యోగంలో సమస్యలు వస్తాయి...2 ఎక్కువగా ఉంటే సన్నిహితులతో సమస్యలు వస్తాయి...3 ఎక్కువగా ఉంటే క్రియేటివ్ గా ఉంటారు గానీ కుటుంబాన్ని పట్టించుకోరు...4 ఎక్కువగా ఉంటే ఎక్కువ అనలటికల్ గా ఉంటారు...5 ఎక్కువగా ఉంటే ఉద్యోగ విషయంలో బ్యాలన్స్ గా ఉండరు...6 ఎక్కువగా ఉంటే ఎన్ని అవకాసాలు వచ్హినా వాటిని ఉపయోగించుకోరు...7 ఎక్కువగా ఉంటే దాంపత్య జీవితంలో కలతలు ఎక్కువగా ఉంటాయి...8 ఎక్కువగా ఉంటే ప్రతి విషయాన్ని ఎక్కువగా అలోచిస్తారు...9 ఎక్కువగా ఉంటే వారిని వారే పట్టించుకోరు.

చదువులో బాగా రావాలనుంటే 4,9,2......క్రియేటివ్ గా ఉండదలుచుకుంటే 1,3,9 ......రాజకీయాలలో చేరాలనుకుంటే 4,3,8 నెంబర్లు వారి మొబైల్ నెంబర్లో ఉండేటట్లు చూసుకోవాలి అని చెప్పేరట.

ఇసుక మట్టితో ఆర్ట్.....వీడియో