Monday, September 27, 2010

హాపీ బర్త్ డే టు గూగుల్......అంతర్జాల ప్రపంచములో వారు చేసిన సాధనలు12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, అతి వేగంగా పెరుగుతున్న అంతర్జాల ప్రపంచంలో 12 మైళు రాళ్లను దాటిన గూగుల్ కంపెనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

మైళు రాళ్ళు:

1) 1998 లో ఇద్దరు స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం విధ్యార్ధులు చే గూగుల్ ప్రారంబించబడింది.

2) 1999 వ సంవత్సరం సిలికాన్ వాలీలో లారీ పేజ్ మరియూ సెర్గే బ్రిన్ ల చే ఆఫీసు మొదలు పెట్టి గూగుల్ ఇన్ కార్పరేషన్ గా నమోదు చేసేరు.

3) 2000 జూన్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మొదటి బిలియన్ URL’s ను చేర్చి ప్రపంచంలోనే అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ గా గుర్తింపు పొందేరు.

4) అదే సంవత్సరం అక్టోబర్ నెలలో 350 మంది ప్రకటన కారులతో గూగుల్ ఆడ్ వోర్డ్స్ మొదలుపెట్టేరు.

5) 2001 లో ఇమేజ్ సెర్చ్ ఇంజెన్ మొదలుపెట్టేరు.

6) 9/11 న అమెరికాలో జరిగిన టెర్రరిస్ట్ దాడి తరువాత గూగుల్ న్యూస్ మొదలుపెట్టేరు.

7) 2003 లో పైరా లాబ్స్ దగ్గర నుండి బ్లాగర్.కాం ను కొనుకున్నారు.

8) 2004 లో జీ-మైల్ సర్వీసులు మొదలుపెట్టేరు. అదే సంవత్సరం మొదటి సారిగా షార్ లు రిలీజ్ చేసేరు.

9) 2005 ఫిబ్రవరీ లో గూగుల్ మ్యాప్స్, జూన్ లో గూగుల్ ఎర్త్ సర్వీసులు మొదలుపెట్టేరు.

10) 2006 లో యూట్యూబ్ ను కొనుకున్నారు. అదే సంవత్సరం అక్టోబర్ లో వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మొదలుపెట్టేరు.

11) 2007 లో మొబైల్ ఫోన్ లకు ప్లాట్ ఫార్మ్ డివైస్ లు విడుదల చేసేరు.

12) 2008 లో వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోం మొదలుపెట్టేరు.

No comments:

Post a Comment