Monday, September 27, 2010

అన్యులు భూలోకానికి వస్తే వారితో సంప్రదింపులు జరపటానికి మానవజాతి నాయకురాలిగా ఈమెను నియమించేరు

అంతరిక్షంలో కొన్నివేల గ్రహాలు ఉన్నాయని, వీటిలో అన్య జీవులు నివసించే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయని, ఏదో ఒక రోజు వారు భూమికి వచ్హే అవకాసం ఉన్నదని ఈ మధ్య అంతరిక్ష పరిశోధక శాస్త్రవేత్తలు మానవజాతికి హెచ్హరికలు ఇస్తున్నారు.

నాసా వారి కెప్లర్ ప్రోబ్ (Kepler Probe) చేసిన పరిశోధనలో అంతరిక్షంలో 700 కొత్త గ్రహాలు ఉన్నాయని, అందులో 140 గ్రహాలు భూమిలాగా పెద్దవిగా ఉన్నాయని తెలిసింది. ఈ పరిశోధనతో అంతరిక్ష శాత్రవేత్తలు చెబుతున్న అన్య జీవుల వాదం బలపడుతోంది.




ఏ రోజైనా అన్య జీవులు బూమి మీదకు వచ్హి "మీ నాయకుడితో మాట్లాడాలి" అని అడిగితే వారిని ఎవరి దగ్గరకు తీసుకు వెళ్లాలి, వారిని ఎవరితో మాట్లాడించాలి, వారితో ఎవరు సంప్రదింపులు జరపాలి అనే విషయంలో తికమక పడుతున్నారు. అమెరికన్ ప్రెశిడెంట్ చేస్తారని కొందరు, రష్యా అధికారులు చేస్తారని కొందరూ, యూరప్ లీడర్లని కొందరు, పోప్ చేస్తారని మరికొందరూ అంటున్నారు.

అన్యులు భూమికి వస్తే వారిని ఎవరి దగ్గరకు తీసుకు వెళ్ళాలి అనే సందేహం మనుష్యులలో రాకుండా ఉండాలని మరియూ మానవజాతిలో ఒకే నాయకుడు ఉన్నారని అన్యులు అనుకోవాలని మలేషియా దేశ అంతరిక్ష శాస్త్రవేత్త మాజ్లాన్ ఓత్మన్ అనే ఆమెను అన్యులతో మాట్లడటానికి మానవలోక నాయకురాలిగా యూనైటడ్ నేషన్స్ నియమించింది.

యునైటడ్ నేషన్స్ శాఖలలోనే అతి చిన్న శాఖ అయిన యూనైటడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ అవుటర్ స్పేస్ అఫైర్స్ (United Nations Office for Outer Space Affairs…..Unoosa ) అనే శాఖకు ఈమె అధికారిణిగా పనిచేస్తోంది.

"ఈ మధ్య జరిగిన పరిశోధనలు అన్య జీవులు అన్యగ్రహాలలొ నివసిస్తున్నాయనే నమ్మకాన్ని మరింత ఎక్కువగా బలపరుస్తోంది. అన్యులకు మాన్వత్వం చూపి మొదటి సంప్రదింపులు జరపటానికి యూనైటడ్ నేషన్స్ తయారుగా ఉండాలి. ఈ పని చేయడానికే నన్ను నియమించేరు" ఆమె తెలిపింది.

ఇది ఎలా ఉందంటే హాలీవుడ్ సినిమా "మెన్ ఇన్ బ్లాక్" లో ఒక టాప్ సీక్రెట్ ఏజెన్సీ అన్యులతో సంప్రదింపులు చేస్తారు. అన్యులలో కొంత మందికి భూమి మీద నివసించేందుకు ఆశ్రయం కలిపిస్తారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నది కూడా అదే. శాస్త్రవేత్తాలలో అధిక శాతం ఇలాంటి సంఘటన ఖచ్హితంగా జరుగుతుందని (అన్యులు భూమికి రావటం) తమ అభిప్రాయాలను యూనైటడ్ నేషన్స్ కు తెలియ పరచటంతో, యూనైటడ్ నేషన్స్ ఈ రకంగా నిర్ణయం తీసుకుంది.

3 comments:

  1. /వారితో ఎవరు సంప్రదింపులు జరపాలి అనే విషయంలో తికమక పడుతున్నారు/
    ఇందులో తికమక ఎందుకు? తెలుగు బ్లాగుల్లో ఆ ఒకడితో(ఆ ఒక్కరు ఎవరన్నది మీకెరుకే -మీ ఇష్టం) పావుగంట మాట్లాడిస్తే సరి. అ గ్రహవాసి మరీ భూమివైపు కన్నెత్తి చూసే సాహసం చేయడు. :))))

    ReplyDelete
  2. రెహ మాను గారు,

    http://asainskaburlu.blogspot.com/2010/07/blog-post_26.html

    లింకును పరికింపుడు :)

    ReplyDelete