Friday, September 24, 2010

దలిత మహిళ పెట్టిన రొట్టె తిన్నదని కుక్కను వెలివేసిన గ్రామ పంచాయతి

ఒక పెద్దింటి కుక్క ఒక దలిత మహిల పెట్టిన రొట్టె ను తిన్నదని, ఆ కుక్కనూ మరియూ ఆ కుక్కకు రొట్టెను పెట్టిన మహిళనూ పంచాయతీలో నిలబెట్టి, దలిత మహిళ పెట్టిన రొట్టెను తిన్నది కాబట్టి ఆ కుక్కను అంటరాని కుక్కగా పేర్కొని, ఇక మీదట ఆ కుక్క ఆ దలిత మహిళ ఇంట్లోనే పెరగాలని పంచాయతీ పెద్దలు తీర్పు ఇచ్హేరు. అంతటితో ఆగక పెద్దింటి పెంపుడు కుక్క అని తెలిసికూడా ఆ కుక్కకు తన దగ్గరున్న రొట్టెను పెట్టినందుకు ఆ దలిత మహిళకు రూ.15,000 జరిమానా విధించేరు. "షెరూ" అని పిలువబడే ఆ కుక్కను దలిత మహిళ నివసిస్తున్న దలిత కాలనీలో కట్టేసేరు.

అంటరానితనం భారతదేశంలో ఇంకా ఆచరించబడుతోందని అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. మానవులు దీనిని అర్ధం చేసుకుంటారు...మరి జంతువులు దీనిని ఎలా అర్ధం చేసుకుంటాయో?

భోపాల్ నగర సరిహద్దు గ్రామాలలో ఒకటైన మానిక్ పూర్ గ్రామంలో నివసిస్తున్న రాంపాల్ సింగ్ అనే ఒక పెద్ద, డబ్బుగల రాజ్ పుట్ రైతు ఇంట్లో వారు ఆ కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్కకు "షెరూ" అని పేరు పెట్టేరు. ఆ పెద్దింట్లో సకల సౌకర్యాలతో పెరుగుతున్నది ఆ కుక్క. రాంపాల్ సింగ్ కు రాజకీయ పలుకుబడి కూడా ఉన్నదట.

వారం రోజుల క్రితం సునీతా జటవ్ అనే దలిత మహిళ, పొలంలో పనిచేస్తున్న తన భర్తకు భోజనం తీసుకు వెళ్లింది. తన భర్త కడుపునిండా తిన్న తరువాత ఒక రొట్టె మిగిలిపోయింది. అప్పుడు అక్కడ తిరుగుతున్న కుక్కను చూసి, ఆ రొట్టెను ఆ కుక్కకు పెట్టింది. రాంపాల్ సింగ్ ఈ ద్రుశ్యం చూసేడు.కోపంగా దలిత మహిల దగ్గరకు వచ్హి "దలిత మహిళవని తెలిసి కూడా నా కుక్కకు రొట్టె పెట్టటానికి నీకు ఎంత ధైర్యమే" అని అరచి, బూతులు తిట్టేడట. విషయం పెద్దదవ కూడదని ఆ దలిత మహిళ నోరు విప్పలేదట. ఆ విషయం అక్కడితో ముగిసిందని అనుకుందట.

"కానీ ఇలా పంచాయతీ పెట్టి, మాకు జరిమానా వేసి, ఆ కుక్కను మేమే పెంచుకోవాలని తీర్పు చెప్పడం అన్యాయం" అని సునీత తన తమ్మున్ని తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఫిర్యాదు తీసుకోకుండా "నువ్వెందుకు పెద్దింటి కుక్కకు రొట్టె పెట్టేవు" అని తిట్టి పంపించేసేరట.

దలితుల సహాయార్ధం కోసమే పెట్టబడిన SC/ST అట్రొసిటీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట. వారు పట్టించుకోకపోయేసరికి కలెక్టర్ కు ఫిర్యాదు చేసిందట. అక్కడ గూడా సునీతకు న్యాయం జరగలేదట.

అంటరాని తనం ఏ రూపంలో కనబడ్డా అది నేరమే...SC/ST అట్రొసిటీస్ వారు కేసు నమోదు చేసేరు. కేసు విచారణకు అధికారులను పంపుతున్నామని కలెక్టర్ తెలిపేరు.

తనకు ద్రోహం జరుగుతున్నా ఆ కుక్క మాత్రం అటు రాంపాల్ సింగ్ కుటుంబం వారు కనబడినా, ఇటు సినీత కనబడ్డా తోక ఊపుతునే ఉందట.

10 comments:

 1. తనకు ద్రోహం జరుగుతున్నా ఆ కుక్క మాత్రం అటు రాంపాల్ సింగ్ కుటుంబం వారు కనబడినా, ఇటు సినీత కనబడ్డా తోక ఊపుతునే ఉందట.
  _____________________________________________

  :)) దాన్నే విశ్వాసం అంటారు

  ReplyDelete
 2. అబ్బే భారతదేశంలో అస్సలు కుల వివక్ష లేనిదే! మీరు మరీనండీ బాబూ!

  ReplyDelete
 3. జాతి కుక్క 10వేలదాకా విలువ చేస్తుంది. రూపాయ రొట్టెముక్కకు 10వేల బహుమానమా! అన్యాయం. ఎరువుల మిక్సింగ్ లో కూడా ఇంత లాభం రాదు.

  ReplyDelete
 4. అబ్బే భారతదేశంలో అస్సలు కుల వివక్ష లేనిదే! మీరు మరీనండీ బాబూ!
  _____________________________________________________

  మరే, ఇది బ్రాహ్మణికల్ అభిజాత్యం అయ్యుంటుంది.
  ఎక్కడ దళిత పీడిత సంఘటనలు వినపడ్డా అక్కడ మనముంటామే?
  ఒక చెత్త కామెంట్ పెట్టాం కదా ఇక కవితలు రాస్కోవచ్చు హాప్పీగా.

  ReplyDelete
 5. Plain sad to see.
  India sure deserves a kathi.

  ReplyDelete
 6. హ్మ్..దురదృష్టకరం. ఇటువంటి ఉదాహరణలు చాలానే కనిపిస్తాయి. అయితే.. ఇవి కనబడగానే అదుగో దేశం మొత్తం ఇంతే అనో, లేక ఇటువంటివి కనబడని రోజున అసలు వివక్ష అనేదే లేదనో చేసే శుష్క వాదనలతో ఉపయోగం తక్కువ.

  చాలా మార్పొచ్చింది అనేది గుర్తిస్తూ, రావల్సిన మార్పు ఇంకా చాలా ఉంది అనేది గ్రహించగలిగితే సమాజానికి మేలు జరుగుతుంది.

  ఇటువంటి పరిస్థితులుండడం అత్యంత బాధాకరం. కాకపోతే ఒకప్పుడు నార్మల్ అనిపించిన ఇటువంటి సంఘటనలు, ఇప్పుడు దేశం లోని మెజారిటీ ప్రజల దృష్టిలో అబ్ నార్మల్ గా కనిపిస్తున్నాయనేది నాలాంటి ఆశా వాదులకి ఊరట కలిగించే అంశమే.

  ReplyDelete
 7. బుడుగు గారూ మీరు చాలా డిప్రెషన్లో ఆ మాటలు అన్నట్టున్నారు.
  వీకెండ్ అన్నట్టూ కొన్నిచోట్ల జరిగే సంఘటనలని చూపించి ఇండియా అంతా ఇంతే అనడం భావ్యమా?

  India sure deserves a kathi.
  _______________________________

  దళిత జాతిని ఉద్ధరించడానికే కత్తి పుట్టినట్టుగా ఉంది మీరనేది చూస్తుంటే :)
  Good joke!!!!

  ReplyDelete
 8. దళిత అన్న పదం ఎక్కడ కనపడినా కత్తి గారు ముందుంటారు. వారం రొజుల్లో కవిత రావడం ఖాయం.

  ReplyDelete
 9. mee kasi amtha kakkeyamdi.., mari imtha mamdaa okari meedaku. ఈ comments lo chala mamdi imkaa agravarnalaa bhavajaalam matthulomchi vrasaaru.

  ReplyDelete