Wednesday, September 29, 2010

"మీ పుట్టిన రోజున ఒక మొక్కను నాటండి"...50,000 మొక్కలను నాటి అమెరికా ఇకో(Eco) అవార్డ్ పొందిన బస్ కండక్టర్

పర్యావరణం పై చైతన్యం కలిగిన ఒక బస్ కండక్టర్ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటానికి తన వంతుగా ఇప్పటిదాకా 50,000 మొక్కలను (ఇందులో చాలా మొక్కలు చెట్లుగా ఎదిగినైట) నాటి "కొనియాడబడని హీరో" అనే ఇకో అవార్డును పొందేరు.

పర్యావరణం ను కలుషితం నుండి కాపాడటానికి తన వంతుగా పాటుపడటమే కాకుండా, దాని గురించి ఇతరులకూ, ముఖ్యంగా విద్యార్ధులకు అవగాహన ఏర్పడటానికి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన కోయంబత్తూర్ తమిళనాడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో బస్ కండక్టర్ గా పనిచేస్తున్న యోగనాధన్ కు అమెరికా ఫుట్ వేర్ మేజర్ టింబర్ లాండ్ వారు "కొనియాడబడని హీరో" అన్న అవార్డ్ ను బహుకరించేరు.

ఈ అవార్డు ను సినీ నటుడు జాన్ అబ్రహం మరియూ సినీ నిర్మాత మైక్ పాండే చేతుల మీదగా న్యూ ఢిల్లీలో జరిగిన ఒక ఫంక్షన్లో అందుకున్న యోగనాధన్ "ఇది మరిచిపోలేని సంఘటన. ఈ బహుమతికి నన్ను ఎన్నుకోవడం, దాన్ని జాన్ అబ్రహం చేతుల మీదగా తీసుకోవడం నేను కలలో కూడా అనుకోని ఒక సంఘటన" అని అన్నారు.

"బ్రతకడానికి ఒక చెట్టు" అనే నా ప్రాజక్ట్ మీద పనిచేస్తున్నాను. ఈ ప్రాజక్ట్ లో విద్యార్ధులను చేర్చుకోవడానికీ మరియూ వారితో కలిసి పనిచేయడానికి నా డ్యూటీ టైము పోను మిగిలిన టైమును వెచ్హిస్తున్నాను. ఈ రోజు ప్రపంచ వాతావరణం ఎంత కాలుష్య పడిందో మీ అందరికీ తెలుసు. దీని వలన మనం ఎన్నోరకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. మనకంటే మన తరువాతి జనరేషన్....అంటే మన పిల్లలు, మనవుల్లు ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. వారికి మంచి వాతావరణాన్ని అందిచవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కనుక మనమందరమూ కలిసి పోరాడాలి. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. ఇందులో భాగంగానే "బ్రతకడానికి ఒక చెట్టు" అన్న ప్రాజెక్ట్. ఈ సదవకాసాన్ని పునస్కరించుకుని మీ అందరినీ నేను కోరేదేమిటంటే ప్రతి ఒక్కరూ మీ పుట్టిన రోజు నాడు ఒక మొక్కను నాటండి. ఇలా గనుక మన భారతదేశ ప్రజలు చేస్తే మళ్ళీ మనం పచ్హని ప్రాంతాలను చూడవచ్హు. ఈ ప్రాంతాలు మన వారిని కాపాడుతాయి" అని యోగనాధన్ మాట్లాడేరు.

యోగనాధన్ గారికి ఇది 14 వ బహుమతి. ఇకో-వారియర్, ఎర్త్ మాటర్స్, సుట్రు సూయల్ సెయల్ వీరర్ అనే బహుమతులే కాకుండా మరెన్నో బహుమతులు ఇచ్హేరు.

"టింబర్ లాండ్ కంపెనీ వారు వాతావరణ కాలుష్యాన్నీ తగ్గించడానికి కావలసిన కట్టుదిట్టాలను పాటిస్తున్నట్లు తెలిసింది. అందులోనూ ముఖ్యంగా కార్బండ ఆక్సైడ్ ను గాలిలో కలువకుండా అరికట్టే పరికరాలను వాడుతున్నట్లు చెప్పేరు. వాతావరణం వారివలన కాలుష్య పడకూడదనే వారి అభిలాషకు నమస్కరిస్తూ ఈ బహుమతి అందుకుంటున్నాను" అన్నారు.

"మీ పుట్టిన రోజున ఒక మొక్కను నాటండి" అన్న ఆయన సందేశం నాకు బాగా నచ్హింది. ప్రతి ఒక్కరూ ఈ పనిచేయాలని ఆసిస్తున్నాను.

1 comment: