Thursday, September 30, 2010

ప్రపంచములోని విచిత్రమైన భవనాలు...ఫోటోలు (చివరి పార్ట్)

Wooden Gagster House (Archangelsk, Russia)




Forest Spiral (Darmstadt, Germany)



Kunsthaus (Graz, Austria)



The Basket Building (Ohio, USA)



Wonderworks (Pigeon Forge, TN, USA)



Montreal Biosphere (Canada)



Atlantis (Dubai, UAE)



The Museum of Play (Rochester , USA)



Eden project (United Kingdom)

రోబో సినిమాతో పోటీ వద్దు....ఖలేజా, బ్రుందావనం సినిమా ల రిలీజ్ వాయిదా

సినీ పరిశ్రమ రోబో సినిమా భయంలో ఉన్నట్టుంది. రూ.180/- కోట్ల పెట్టుబడితో తీసిన రోబో సినిమా రేపు రిలీజ్ అవుతోంది. అందువలన మహేష్ బాబూ నటించిన ఖలేజా మరియూ జూనియర్ ఎన్.టి.ఆర్. నటించిన బ్రుందావనం సినిమాల రిలీజ్ ను మరో వారానికి వాయిదా వేసేరట.

వ్యాపార రీత్యా ఈ రెండు సినిమాల రిలీజ్ ను వాయిదా వేయటమే మంచిది అంటున్నారు. ఎందుకంటే రోబో సినిమాను విడుదల చేయనున్న సినిమా హాల్స్ లో రోబో సినిమా కు 5 రోజుల బుకింగ్ ఫుల్ అయ్యిందట.




రోబో సినిమాను 180 కోట్ల రూపాయల ఖర్చుతో తీస్తే, 3 సంవత్సరాల గ్యాప్ తరువాత రిలీజ్ అవబోతున్న మహేష్ బాబు సినిమా ఖలేజా ఖర్చు 45 కోట్లు, జూనియర్ ఎన్.టీ.ఆర్ సినిమా బ్రుందావనం కు అయిన ఖర్చు 30 కోట్లట.

27 కోట్ల రూపాయలకు రోబో తెలుగు సినిమాను కొనుకున్న తోటా కనకారావు గారిని అడిగితే "సినిమా కొనుక్కోవడంతో ఖర్చు ఆగిపోలేదు. ఈ సినిమా పబ్లిసిటీ ఖర్చు కూడా ఎక్కువే. కానీ రజినీకాంత్, ఏ.ఆర్. రెహమాన్, శంకర్ ల కాంబినేషన్ కాబట్టి నా పెట్టుబడి ఎక్కడికీ పోదు. 500 సినిమా హాల్స్ లో రిలీజ్ చేస్తున్నాము.ధియేటర్స్ వారు ఈ సినిమాను ఒక మెగా హిట్ సినిమాగా చెబుతున్నారు" అని అన్నారు.

నైజాం ఏరియాకు రోబో సినిమా హక్కులను కొనుకున్న పి.శ్రీనివాస్ గారు "అడ్వాన్స్ బుక్కింగ్ ఓపెన్ చేసిన వెంటనే 5 రోజులకు టికెట్లు అమ్ముడైపోయినై. రెండో వారంలో ఇంకే సినిమా రిలీజ్ అయినా పరవాలేదు. ఎందుకంటే అప్పుడు దసరా సెలవులు కనుక కలక్షన్లు బాగానే ఉంటాయి" అన్నారు.




మహేష్ బాబూ తో ఖలేజా సినిమాను తీసిన నిర్మాతలు మాత్రం కాన్ ఫిడెంట్ గా లేరట. కొమరం పులి సినిమా వలన వీరు నష్టపోయిన డబ్బును ఖలేజా సినిమా తీసుకు వస్తుందని నమ్ముతున్నారట. కొమరం పులి సినిమాకు 40 కోట్లు ఖర్చు పెడితే 15 కోట్లు మాత్రమే కలక్షన్స్ వచ్హిందట. సమయం కాని సమయములో ఖలేజా సినిమాను రిలీజ్ చేసి మరింత చేతులు కాల్చుకోవటం వారికి ఇష్టంలేదట.



30 కోట్ల రూపాయలతో జూనియర్ ఎన్.టీ.ఆర్ తో బ్రుందావనం సినిమాను తీసిన నిర్మాత కూడా రిస్క్ తీసుకో దలచుకోలేదుట. రోబోతో పోటీ పడటం వ్యాపరరీతిగా మంచిది కాదట. ఎన్నో ఆశలతో సినిమా రిలీజ్ చేస్తాం.అవన్నీ పోటిలో కొట్టుకు పోకూడదు. ఎందుకంటే రోబో సినిమా గురించి ప్రజలలో ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏర్పడింది అని అన్నారట.

నిజమే. సినిమా గురించి మాట్లాడితే ఎక్కడ చూసినా రోబో...రోబో...రోబో...అనే మాటే వింటున్నాము. విదేశీయులు కూడా ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

Wednesday, September 29, 2010

తెలివిగల ఆవు...వీడియో

తెలివైన కాకి వీడియో తరువాత తెలివిగల ఆవు...వీడియో

వీడియోలో చూస్తున్న ఈ ఆవు పంపు కొట్టుకుని మంచి నీళ్ళు తాగటం చూడండి.

"మీ పుట్టిన రోజున ఒక మొక్కను నాటండి"...50,000 మొక్కలను నాటి అమెరికా ఇకో(Eco) అవార్డ్ పొందిన బస్ కండక్టర్

పర్యావరణం పై చైతన్యం కలిగిన ఒక బస్ కండక్టర్ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటానికి తన వంతుగా ఇప్పటిదాకా 50,000 మొక్కలను (ఇందులో చాలా మొక్కలు చెట్లుగా ఎదిగినైట) నాటి "కొనియాడబడని హీరో" అనే ఇకో అవార్డును పొందేరు.

పర్యావరణం ను కలుషితం నుండి కాపాడటానికి తన వంతుగా పాటుపడటమే కాకుండా, దాని గురించి ఇతరులకూ, ముఖ్యంగా విద్యార్ధులకు అవగాహన ఏర్పడటానికి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన కోయంబత్తూర్ తమిళనాడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో బస్ కండక్టర్ గా పనిచేస్తున్న యోగనాధన్ కు అమెరికా ఫుట్ వేర్ మేజర్ టింబర్ లాండ్ వారు "కొనియాడబడని హీరో" అన్న అవార్డ్ ను బహుకరించేరు.

ఈ అవార్డు ను సినీ నటుడు జాన్ అబ్రహం మరియూ సినీ నిర్మాత మైక్ పాండే చేతుల మీదగా న్యూ ఢిల్లీలో జరిగిన ఒక ఫంక్షన్లో అందుకున్న యోగనాధన్ "ఇది మరిచిపోలేని సంఘటన. ఈ బహుమతికి నన్ను ఎన్నుకోవడం, దాన్ని జాన్ అబ్రహం చేతుల మీదగా తీసుకోవడం నేను కలలో కూడా అనుకోని ఒక సంఘటన" అని అన్నారు.

"బ్రతకడానికి ఒక చెట్టు" అనే నా ప్రాజక్ట్ మీద పనిచేస్తున్నాను. ఈ ప్రాజక్ట్ లో విద్యార్ధులను చేర్చుకోవడానికీ మరియూ వారితో కలిసి పనిచేయడానికి నా డ్యూటీ టైము పోను మిగిలిన టైమును వెచ్హిస్తున్నాను. ఈ రోజు ప్రపంచ వాతావరణం ఎంత కాలుష్య పడిందో మీ అందరికీ తెలుసు. దీని వలన మనం ఎన్నోరకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. మనకంటే మన తరువాతి జనరేషన్....అంటే మన పిల్లలు, మనవుల్లు ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. వారికి మంచి వాతావరణాన్ని అందిచవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కనుక మనమందరమూ కలిసి పోరాడాలి. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. ఇందులో భాగంగానే "బ్రతకడానికి ఒక చెట్టు" అన్న ప్రాజెక్ట్. ఈ సదవకాసాన్ని పునస్కరించుకుని మీ అందరినీ నేను కోరేదేమిటంటే ప్రతి ఒక్కరూ మీ పుట్టిన రోజు నాడు ఒక మొక్కను నాటండి. ఇలా గనుక మన భారతదేశ ప్రజలు చేస్తే మళ్ళీ మనం పచ్హని ప్రాంతాలను చూడవచ్హు. ఈ ప్రాంతాలు మన వారిని కాపాడుతాయి" అని యోగనాధన్ మాట్లాడేరు.

యోగనాధన్ గారికి ఇది 14 వ బహుమతి. ఇకో-వారియర్, ఎర్త్ మాటర్స్, సుట్రు సూయల్ సెయల్ వీరర్ అనే బహుమతులే కాకుండా మరెన్నో బహుమతులు ఇచ్హేరు.

"టింబర్ లాండ్ కంపెనీ వారు వాతావరణ కాలుష్యాన్నీ తగ్గించడానికి కావలసిన కట్టుదిట్టాలను పాటిస్తున్నట్లు తెలిసింది. అందులోనూ ముఖ్యంగా కార్బండ ఆక్సైడ్ ను గాలిలో కలువకుండా అరికట్టే పరికరాలను వాడుతున్నట్లు చెప్పేరు. వాతావరణం వారివలన కాలుష్య పడకూడదనే వారి అభిలాషకు నమస్కరిస్తూ ఈ బహుమతి అందుకుంటున్నాను" అన్నారు.

"మీ పుట్టిన రోజున ఒక మొక్కను నాటండి" అన్న ఆయన సందేశం నాకు బాగా నచ్హింది. ప్రతి ఒక్కరూ ఈ పనిచేయాలని ఆసిస్తున్నాను.

Tuesday, September 28, 2010

ప్రపంచములోని విచిత్రమైన భవనాలు...ఫోటోలు (పార్ట్-3)

The Church of Hallgrimur, Reykjavik, Iceland





Ideal Palace (France)



Cubic Houses (Kubus woningen) (Rotterdam, Netherlands)



Bibliotheca Alexandrina (Egypt)



House Attack (Viena, Austria)



Conch Shell House, Isla Mujeres, Mexico



National Theatre (Beijing, China)



The National Library (Minsk, Belarus)

Monday, September 27, 2010

హాపీ బర్త్ డే టు గూగుల్......అంతర్జాల ప్రపంచములో వారు చేసిన సాధనలు



12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, అతి వేగంగా పెరుగుతున్న అంతర్జాల ప్రపంచంలో 12 మైళు రాళ్లను దాటిన గూగుల్ కంపెనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

మైళు రాళ్ళు:

1) 1998 లో ఇద్దరు స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం విధ్యార్ధులు చే గూగుల్ ప్రారంబించబడింది.

2) 1999 వ సంవత్సరం సిలికాన్ వాలీలో లారీ పేజ్ మరియూ సెర్గే బ్రిన్ ల చే ఆఫీసు మొదలు పెట్టి గూగుల్ ఇన్ కార్పరేషన్ గా నమోదు చేసేరు.

3) 2000 జూన్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మొదటి బిలియన్ URL’s ను చేర్చి ప్రపంచంలోనే అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ గా గుర్తింపు పొందేరు.





4) అదే సంవత్సరం అక్టోబర్ నెలలో 350 మంది ప్రకటన కారులతో గూగుల్ ఆడ్ వోర్డ్స్ మొదలుపెట్టేరు.

5) 2001 లో ఇమేజ్ సెర్చ్ ఇంజెన్ మొదలుపెట్టేరు.

6) 9/11 న అమెరికాలో జరిగిన టెర్రరిస్ట్ దాడి తరువాత గూగుల్ న్యూస్ మొదలుపెట్టేరు.

7) 2003 లో పైరా లాబ్స్ దగ్గర నుండి బ్లాగర్.కాం ను కొనుకున్నారు.

8) 2004 లో జీ-మైల్ సర్వీసులు మొదలుపెట్టేరు. అదే సంవత్సరం మొదటి సారిగా షార్ లు రిలీజ్ చేసేరు.

9) 2005 ఫిబ్రవరీ లో గూగుల్ మ్యాప్స్, జూన్ లో గూగుల్ ఎర్త్ సర్వీసులు మొదలుపెట్టేరు.

10) 2006 లో యూట్యూబ్ ను కొనుకున్నారు. అదే సంవత్సరం అక్టోబర్ లో వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మొదలుపెట్టేరు.

11) 2007 లో మొబైల్ ఫోన్ లకు ప్లాట్ ఫార్మ్ డివైస్ లు విడుదల చేసేరు.

12) 2008 లో వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోం మొదలుపెట్టేరు.

అన్యులు భూలోకానికి వస్తే వారితో సంప్రదింపులు జరపటానికి మానవజాతి నాయకురాలిగా ఈమెను నియమించేరు

అంతరిక్షంలో కొన్నివేల గ్రహాలు ఉన్నాయని, వీటిలో అన్య జీవులు నివసించే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయని, ఏదో ఒక రోజు వారు భూమికి వచ్హే అవకాసం ఉన్నదని ఈ మధ్య అంతరిక్ష పరిశోధక శాస్త్రవేత్తలు మానవజాతికి హెచ్హరికలు ఇస్తున్నారు.

నాసా వారి కెప్లర్ ప్రోబ్ (Kepler Probe) చేసిన పరిశోధనలో అంతరిక్షంలో 700 కొత్త గ్రహాలు ఉన్నాయని, అందులో 140 గ్రహాలు భూమిలాగా పెద్దవిగా ఉన్నాయని తెలిసింది. ఈ పరిశోధనతో అంతరిక్ష శాత్రవేత్తలు చెబుతున్న అన్య జీవుల వాదం బలపడుతోంది.




ఏ రోజైనా అన్య జీవులు బూమి మీదకు వచ్హి "మీ నాయకుడితో మాట్లాడాలి" అని అడిగితే వారిని ఎవరి దగ్గరకు తీసుకు వెళ్లాలి, వారిని ఎవరితో మాట్లాడించాలి, వారితో ఎవరు సంప్రదింపులు జరపాలి అనే విషయంలో తికమక పడుతున్నారు. అమెరికన్ ప్రెశిడెంట్ చేస్తారని కొందరు, రష్యా అధికారులు చేస్తారని కొందరూ, యూరప్ లీడర్లని కొందరు, పోప్ చేస్తారని మరికొందరూ అంటున్నారు.

అన్యులు భూమికి వస్తే వారిని ఎవరి దగ్గరకు తీసుకు వెళ్ళాలి అనే సందేహం మనుష్యులలో రాకుండా ఉండాలని మరియూ మానవజాతిలో ఒకే నాయకుడు ఉన్నారని అన్యులు అనుకోవాలని మలేషియా దేశ అంతరిక్ష శాస్త్రవేత్త మాజ్లాన్ ఓత్మన్ అనే ఆమెను అన్యులతో మాట్లడటానికి మానవలోక నాయకురాలిగా యూనైటడ్ నేషన్స్ నియమించింది.

యునైటడ్ నేషన్స్ శాఖలలోనే అతి చిన్న శాఖ అయిన యూనైటడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ అవుటర్ స్పేస్ అఫైర్స్ (United Nations Office for Outer Space Affairs…..Unoosa ) అనే శాఖకు ఈమె అధికారిణిగా పనిచేస్తోంది.

"ఈ మధ్య జరిగిన పరిశోధనలు అన్య జీవులు అన్యగ్రహాలలొ నివసిస్తున్నాయనే నమ్మకాన్ని మరింత ఎక్కువగా బలపరుస్తోంది. అన్యులకు మాన్వత్వం చూపి మొదటి సంప్రదింపులు జరపటానికి యూనైటడ్ నేషన్స్ తయారుగా ఉండాలి. ఈ పని చేయడానికే నన్ను నియమించేరు" ఆమె తెలిపింది.

ఇది ఎలా ఉందంటే హాలీవుడ్ సినిమా "మెన్ ఇన్ బ్లాక్" లో ఒక టాప్ సీక్రెట్ ఏజెన్సీ అన్యులతో సంప్రదింపులు చేస్తారు. అన్యులలో కొంత మందికి భూమి మీద నివసించేందుకు ఆశ్రయం కలిపిస్తారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నది కూడా అదే. శాస్త్రవేత్తాలలో అధిక శాతం ఇలాంటి సంఘటన ఖచ్హితంగా జరుగుతుందని (అన్యులు భూమికి రావటం) తమ అభిప్రాయాలను యూనైటడ్ నేషన్స్ కు తెలియ పరచటంతో, యూనైటడ్ నేషన్స్ ఈ రకంగా నిర్ణయం తీసుకుంది.

Sunday, September 26, 2010

ప్రపంచములోని విచిత్రమైన భవనాలు...ఫోటోలు (పార్ట్-2)

Nautilus House (Mexico City, Mexico)





Olympic Stadium (Montreal, Canada)



Casa da musica (Porto, Portugal)



Habitat 67 (Montreal, Canada)



Rotating Tower, Dubai, UAE



Guggenheim Museum (Bilbao, Spain)



Low impact woodland house (Wales, UK)



Kansas City Library (Missouri, USA)

Saturday, September 25, 2010

తంజావూర్ సహస్రాబ్ద వుత్సవాలలొ 1000 మంది భరత నాట్య మాడిన వీడియో (మరో ముఖ్య విషయం కూడా ఉన్నది ఈ టపాలో)

ప్రముఖ భరత నాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం బ్రుందం (1000 మంది)సహస్రాబ్ద వుత్సవాలలొ భరత నాట్యం ఆడిన వీడియో.




తంజావూర్ పెద్ద గుడిలో జరిగే ఏ వుత్సవములో నైనా రాజాకీయ నాయకులు పాల్గొంటే అది వారికీ, వారి పార్టీకి మంచిది కాదని ఈ ఉత్సవాలను వచ్హే సంవత్సరానికి వాయిదా వేద్దామనుకున్నారని, దీని గురించి నేను ఇదివరకు ఒక టపాలో రాసేను.......... (జూలై 22 టపా….http://meeandarikosam.blogspot.com/2010/07/blog-post_22.html).... అలా వాయిదా వేస్తే ఇంకా పెద్ద నష్టం ఏర్పడుతుందని చెప్పటంతో ఉత్సవాలను వాయిదా వేయకుండా అనుకున్న సమయానికే జరిపేరు. ఉత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి హాజరౌతారా అన్న సందేహం చాలా మందికి ఏర్పడింది.

ఆయన వుత్సవాలకు హాజరైయేరు...కానీ గుడిలోనికే వెళ్లే అసలు ద్వారం లోనుండి వెళ్లక మరో ద్వారం నుండి లోనికి వెళ్లేరు.

తెలివైన కాకి.....వీడియో

Friday, September 24, 2010

ప్రపంచములోని విచిత్రమైన భవనాలు...ఫోటోలు (పార్ట్-1)

ప్రపంచములో 33 విచిత్రమైన భవనాల ఫొటోలని మీకు అందిస్తున్నాను. మొత్తంగా కాదు గానీ కొన్ని పార్ట్ లుగా అందజేస్తాను.

Museum of Contemporary Art (Niteroi, Rio de Janeiro, Brazil)






Atomium (Brussels, Belgium)



La Pedrera (Barcelona, Spain)



Cathedral of Brasilia (Brazil)



Lotus Temple (Delhi, India)



Stone House (Guimarães, Portugal)



The Crooked House (Sopot, Poland)



Mind House (Barcelona, Spain)

దలిత మహిళ పెట్టిన రొట్టె తిన్నదని కుక్కను వెలివేసిన గ్రామ పంచాయతి

ఒక పెద్దింటి కుక్క ఒక దలిత మహిల పెట్టిన రొట్టె ను తిన్నదని, ఆ కుక్కనూ మరియూ ఆ కుక్కకు రొట్టెను పెట్టిన మహిళనూ పంచాయతీలో నిలబెట్టి, దలిత మహిళ పెట్టిన రొట్టెను తిన్నది కాబట్టి ఆ కుక్కను అంటరాని కుక్కగా పేర్కొని, ఇక మీదట ఆ కుక్క ఆ దలిత మహిళ ఇంట్లోనే పెరగాలని పంచాయతీ పెద్దలు తీర్పు ఇచ్హేరు. అంతటితో ఆగక పెద్దింటి పెంపుడు కుక్క అని తెలిసికూడా ఆ కుక్కకు తన దగ్గరున్న రొట్టెను పెట్టినందుకు ఆ దలిత మహిళకు రూ.15,000 జరిమానా విధించేరు. "షెరూ" అని పిలువబడే ఆ కుక్కను దలిత మహిళ నివసిస్తున్న దలిత కాలనీలో కట్టేసేరు.

అంటరానితనం భారతదేశంలో ఇంకా ఆచరించబడుతోందని అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. మానవులు దీనిని అర్ధం చేసుకుంటారు...మరి జంతువులు దీనిని ఎలా అర్ధం చేసుకుంటాయో?

భోపాల్ నగర సరిహద్దు గ్రామాలలో ఒకటైన మానిక్ పూర్ గ్రామంలో నివసిస్తున్న రాంపాల్ సింగ్ అనే ఒక పెద్ద, డబ్బుగల రాజ్ పుట్ రైతు ఇంట్లో వారు ఆ కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్కకు "షెరూ" అని పేరు పెట్టేరు. ఆ పెద్దింట్లో సకల సౌకర్యాలతో పెరుగుతున్నది ఆ కుక్క. రాంపాల్ సింగ్ కు రాజకీయ పలుకుబడి కూడా ఉన్నదట.

వారం రోజుల క్రితం సునీతా జటవ్ అనే దలిత మహిళ, పొలంలో పనిచేస్తున్న తన భర్తకు భోజనం తీసుకు వెళ్లింది. తన భర్త కడుపునిండా తిన్న తరువాత ఒక రొట్టె మిగిలిపోయింది. అప్పుడు అక్కడ తిరుగుతున్న కుక్కను చూసి, ఆ రొట్టెను ఆ కుక్కకు పెట్టింది. రాంపాల్ సింగ్ ఈ ద్రుశ్యం చూసేడు.కోపంగా దలిత మహిల దగ్గరకు వచ్హి "దలిత మహిళవని తెలిసి కూడా నా కుక్కకు రొట్టె పెట్టటానికి నీకు ఎంత ధైర్యమే" అని అరచి, బూతులు తిట్టేడట. విషయం పెద్దదవ కూడదని ఆ దలిత మహిళ నోరు విప్పలేదట. ఆ విషయం అక్కడితో ముగిసిందని అనుకుందట.

"కానీ ఇలా పంచాయతీ పెట్టి, మాకు జరిమానా వేసి, ఆ కుక్కను మేమే పెంచుకోవాలని తీర్పు చెప్పడం అన్యాయం" అని సునీత తన తమ్మున్ని తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఫిర్యాదు తీసుకోకుండా "నువ్వెందుకు పెద్దింటి కుక్కకు రొట్టె పెట్టేవు" అని తిట్టి పంపించేసేరట.

దలితుల సహాయార్ధం కోసమే పెట్టబడిన SC/ST అట్రొసిటీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట. వారు పట్టించుకోకపోయేసరికి కలెక్టర్ కు ఫిర్యాదు చేసిందట. అక్కడ గూడా సునీతకు న్యాయం జరగలేదట.

అంటరాని తనం ఏ రూపంలో కనబడ్డా అది నేరమే...SC/ST అట్రొసిటీస్ వారు కేసు నమోదు చేసేరు. కేసు విచారణకు అధికారులను పంపుతున్నామని కలెక్టర్ తెలిపేరు.

తనకు ద్రోహం జరుగుతున్నా ఆ కుక్క మాత్రం అటు రాంపాల్ సింగ్ కుటుంబం వారు కనబడినా, ఇటు సినీత కనబడ్డా తోక ఊపుతునే ఉందట.

Thursday, September 23, 2010

కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్ల లోపాలు భారతదేశ ప్రతిష్టను దిగజారుస్తోందా?

కామన్వెల్త్ క్రీడలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి దేశ ప్రతిష్టను మరింత అధిక పరుచుకోవాలని ప్రయత్నించిన భారతదేశానికి అవమానం ఎక్కువౌతోంది. దీనికి ఎవరు కారణమో తెలియదు గానీ, వారి వలన భారతదేశ ప్రతిష్ట దిగజారడం మాత్రం చాలా దురద్రుష్టకరం.

ఒకటా, రెండా...కామన్వెల్త్ క్రీడల కోసం ఏర్పాట్లు మొదలైన దగ్గర నుండి ఈ క్రీడల ఏర్పాట్లలో ఎన్నో అపశ్రుతులు తల ఎత్తుతూనే ఉన్నాయి. అవినీతి కుంభకోణాలతో మొదలైన అపశ్రుతి ఈ రోజు ఈ క్రీడలలో పాల్గొన వలసిన ప్రముఖ క్రీడాకారులు ఈ పోటీలలో నుండి విరమించుకునేంతవరకు వచ్హింది.

క్రీడలు మొదలైనా, ప్రముఖ క్రీడాకారులు పాల్గొనరు కాబట్టి, పోటీలు నిర్వహించినా అందులో గొప్పతనము ఉండదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అసలు క్రీడలు జరుగుతాయా? లేక క్రీడలను వాయిదా వేస్తారా అని కొందరిలో అనుమానాలు రేకెత్తుతుంటే, క్రీడలను రద్దు చేయండని కొందరూ, వాయిదా వేయండని కొందరూ అంటున్నారు. మేము కట్టిన టాక్స్ డబ్బుతో నిర్వహిస్తున్న ఈ క్రీడలను వాయిదా వేస్తే మేము మళ్ళీ ఈ క్రీడలకోసమే ప్రత్యేకం గా టాక్స్ కట్ట వలసి వస్తుందేమో....వాయిదా వేయకూడదు...ఎలాగైనా క్రీడలు పూర్తి అవ్వాలి అని కొందరంటున్నారు. వీరంతా ఇలా అనడానికి చాలా కారణాలున్నాయి.

ఏడు సంవత్సరాల క్రితం ఈ క్రీడలను నిర్వహించటానికి అనుమతి దొరికింది.ఇంత వ్యవధి దొరికినా క్రీడలు జరుగవలసిన స్టేడియాలు ఇంకా పూర్తిగా తయారవలేదట.

ఓపెనింగ్ సెర్మనీ ఎలా జరగాలో ఇంకా నిర్ధారించలేదట. చైనా వారు వారి దేశంలో జరిపిన ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ కి రెండు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసేరట.

ఢిల్లీ నగరంలో డెంగ్ వ్యాధి ఎక్కువగా ఉన్నదట. ఈ వ్యాధి నివారణకు ఎటువంటి ప్రణాళిక చేపట్టలేదట. దీని వలన పలు దేశాలు తమ క్రీడా కారులకు జాగ్రత్త నోట్ ఇచ్హేరట.

క్రీడా గ్రామం శుభ్రంగా లేదట. ఎక్కడ చూసినా ఉమ్ములూ, మూత్ర విసర్జణ మరియూ పొగాకు మరకలతో కనబడుతోందట.

1.7 లక్షల టికెట్లకు,కేవలం 20,000 టికెట్లే మాత్రమే అమ్ముడైనైయట. ఢిల్లీ నగర ప్రజలు ఈ క్రీడలు చూడటానికి ఆశక్తి చూపటంలేదట. టీ.వీ ప్రశారాలలో ఖాళీ స్టాండ్లు కనబడతాయని, స్పాన్సార్స్ మరియూ ప్రకటన కర్తలూ ఉత్శాహం చూపటం లేదట.

మంగళవారం నాడు నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలగా, బుధవారం నాడు ఒక స్టేడియం లోని ఫాల్స్ సీలింగ్ కొంత బాగం కింద పడిపోయింది.

పలు దేశాలు క్రీడలలో పాల్గొనడం పై పునరాలోచనలు చేస్తున్నాయి.

మరెన్ని అవాంతరాలు రానున్నాయో...క్రీడలు ఎలా జరుపుతారో ఎవరికీ అర్ధం కావటంలేదు. కానీ కోట్లకొలది డబ్బు మాత్రం ఖర్చు పెడుతున్నారు.

పారిస్ హిల్టన్ (Paris Hilton) మరియూ లిండేస్ లోహన్ (Lindsay LOhan) ల అడిక్షన్ లను గుణ పరుస్తాను.....భారత యోగి

ముంబై నగరంలో ఉంటున్న ఒక యోగి పారీస్ హిల్టన్ మరియూ లిండేస్ లోహన్ లను వారి దురలవాట్ల బానిసత్వం నుండి మరియూ వారు పడుతున్న మానసిక, శారీరక భాధల నుండి మందులు ఉపయోగించకుండా వారికి విముక్తి కలిగించి వారిని గుణ పరుస్తానని తెలిపేరు. దీనికి వారి దగ్గర నుండి ఫీజు కూడా తీసుకోను అని తెలిపేరు.

వీర్ బాల్ హరా అనే ఈయన్ను అందరూ వీర్ జీ అని పిలుస్తారుట. ఈయన మామూలు యోగి కాదు. భారత ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జెనెరల్ గా పని చేసి రిటైర్ అయ్యేరు. ఈయన తన 40 యవ ఏట వరకూ నాస్తీకుడుగా ఉన్నారట. అయితే ఈయన తన 41 సంవత్సరంలో తనలో ఏదో జ్యోతి ఉన్నదని గ్రహించేరట. గత 23 సంవత్సరాలుగా తనలో ఉన్న జ్యోతి గురించి అన్వేషణ చేసేరట. ఆ తరువాత తనలో ఉన్నదేమిటో గ్రహించేరట. దాని ప్రయోజనాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించి అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారట.

హాలీ వుడ్ సెలెబ్రెటీ లు మత్తు మందులకూ, ఆల్కహాల్ కూ, స్మోకింగ్ కూ బానిసైపోయి వాటి నుండి బయట పడలేక మానసిక ఒత్తిడులకు గురౌతూ శరీరక కష్టాలు పడుతున్న దాని గురించి తెలుసుకున్నారట. వారిని వీటి నుండి రక్షించి వారిని పూర్తిగా గుణ పరుస్తానని, దీనికి వారు తనకు ఎటువంటి ఫీజు ఇవ్వక్కరలేదని తెలిపేరు. ఎందుకంటే భగవత్ గీత లో ఏదీ ఎదురుచూడ కుండా సేవ చేస్తేనే ఫలం లభిస్తుంది అని చెప్పిన దానినే తాను లక్ష్యముగా తీసుకున్నారట.

“నేను ప్రాణాయామా మూలంగానే వారిని గుణ పరుస్తాను. ఇది మాములు ప్రాణాయామాల లాగా ఉండదు. నేను చేయించే ప్రాణాయామా ప్రత్యేకమైనది, చాలా కష్టమైనది...కానీ చేయ గలిగినదే. ఈ ప్రాణాయామా పద్దతివలనే ఈ వయస్సులో కూడా నేను ఆరొగ్యంగా ఉంటున్నాను. 40 ఏళ్ళకు ముందు నాలో ఉన్న బలం, ఓపిక, ఉత్సాహం మరియూ పాసిటివిటీ కంటే ఇప్పుడు ఇవి నాలో చాలా అధికంగా ఉంది” అని తెలిపేరు.

”నాలో ఉంటున్న, పెరుగుతున్న వీటిని ఇతరులకు పంచి వారిలో కూడా ఉత్సాహం నూ, పాసిటివిటీ నూ తీసుకురవాలనేదే నా కోరిక”

అమెరికా దేశంలోని నివేదా లో ఉన్న యూనివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిసం ప్రెశిడెంట్ రాజన్ జెడ్ గారు “వీర్ జీ గారు తనలో ఉన్న శక్తి ని తెలుసుకోవటానికి చేసిన ప్రక్రియా అన్వేషణలు వర్నించలేము. ఆయన కష్ట పడిన దానికి ఈ రోజు విజయం చేకూరింది. తనలోని శక్తిని ఇతరులకు పంచుతాననడం ఆయన లోని సేవా గుణాన్ని తెలుపుతోంది” అన్నారు.

“ఎందుకు హాలివుడ్ సెలెబ్రటీ లని ఎంచుకున్నారు” అని అడిగితే “ఎందుకంటే వారు ప్రపంచంలోని చాలా మందిలో ఉత్సాహాన్నీ, నవ్వునూ తీసుకువస్తున్నారు. అందుకని వారిలో (సెలెబ్రిటి లలో) వారు పడుతున్న మానసిక బాధలను తొలగించి వారిలో ఉత్సాహాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను” అన్నారు.

"చావు (ఒక్క ఆక్సిడెంట్లో తప్ప) మనం మనలో ఉన్న ఓపిక, ఉత్సాహాన్ని వదులుకుని పిలిస్తేనే వస్తుంది" అన్నారు.

Wednesday, September 22, 2010

అమెరికాలో ఉద్యోగ అవకాసాలు కల్పిస్తున్నాము గానీ అమెరికా నుండి ఉద్యోగాలను తీసుకువెళ్లడంలేదు. ....భారత ఐ.టీ కంపెనీలు

అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగటానికి భారత ఐ.టీ కంపెనీలే కారణమని అమెరికన్ ప్రెశిడెంట్ బారక్ ఒబామా చెప్పటాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది నాస్కాం ( NASSCOM). "భారత ఐ.టీ కంపెనీలు అమెరికాలో భారీ ఎత్తున ఉద్యోగ అవకాసాలను కల్పించినయే గానీ, వారు చేయ గలిగిన ఉద్యోగాలను భారతీయులకు తరలించలేదు. అమెరికాలో ప్రతిభ గల వారి సంఖ్య తక్కువగా ఉన్నది కాబట్టి, ప్రతిభ గల వారిని మాత్రమే భారతదేశం నుండి తీసుకుంటున్నాము" అని నాస్కాం తెలిపింది.

"అమెరికా దేశ ఆర్ధీక అభివ్రుద్దికి భారత ఐ.టీ కంపెనీల దోహదం ఏమీలేదని చెప్పిన దాంట్లో ఎంత మాత్రమూ నిజం లేదు. గత 3 సంవత్సరాలలో అధిక జీతం కలిగిన 2,50,000 ఉద్యోగాలను అమెరికాలో కల్పించేము" అని అమీత్ నివ్ సర్కార్ (నాస్కాం) తెలిపేరు.

"ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలో 7000 ఉద్యోగ అవకాసాలు కల్పించేము...కానీ అమెరికా యోక్క ప్రొటక్షనిస్ట్ ప్రణాళిక పద్దతులైన H1-B వీసా ఫీజు పెంపుదల, H1-B వీసాలు ఇవ్వడములో ఆంక్షలు ఉద్యోగ మరియూ ఆర్ధీక అభివ్రుద్దికి అంతరాయం కలిగిస్తోంది" అని కామర్స్ మినిస్టర్ ఆనంద్ శర్మ తెలిపేరు.

ఇన్ ఫోసిస్ నార్త్ అమెరికాలో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇందులో 1300 మంది అమెరికన్ దేశీయులు. ఈ కంపెనీ ఈ సంవత్సరం మరో 1000 మంది అమెరికన్లను తీసుకోవాలని ప్రణాళిక వెసింది. అలాగే టి.సి.ఎస్ కంపెనీ ఈ మధ్య 1350 ఉద్యోగాలు ఇచ్హింది .

"అమెరికాలొ ప్రతిభ గల వారు తక్కువగా ఉండటంతొ, ప్రతిభ గల వారిని భారతదేశం నుండి తీసుకురావలసి ఉంది. మేము తక్కువ జీతాలు ఇవ్వడం కోసమే భారతీయులను తీసుకువస్తున్నామని కొందరు చెబుతున్నారు. ఇది నిజం కాదు. ప్రతిభా వంతులైన భారతీయులకు అమెరికన్లతో సరిసమానంగా జీతాలిస్తున్నాము. మేము అమెరికన్లకు ఎక్కువ జీతాలివ్వటానికి సిద్దంగా ఉన్నా అక్కడ ప్రతిభ గల వారు తక్కువగా ఉన్నారు" ఇన్ ఫోసిస్ సీనియర్ HR తెలిపేరు.

కాగ్నిసెంట్ టెక్నాలజీ సల్యూషన్స్ సంస్థ CEO ఫ్రాన్ సిస్కో డిశోసా కూడా ఈ మాటే చెప్పేరు. "అవసరాన్ని బట్టి మేము భారతీయులను తీసుకువస్తున్నాము...అమెరికన్ దేశీయులకూ ఉద్యోగాలిస్తున్నాము" అని ఆయన తెలిపేరు. TCS, Genpact మరియూ Wipro కూడా అమెరికన్ దేశీయులకు ఉద్యోగాలివ్వదలుచు కున్నట్లు తెలిపినై.

"అవుట్ సోర్సింగ్ వలన భారత దేశ మొక్కటే లాభ పడుతోందా? లేదే...అమెరికా కూడా లాభ పడుతోంది. అమెరికా వారు ఖర్చు పెడుతున్న ప్రతి డాలర్ కూ 12 శాతం నుండి 14 శాతం వరకు లాభం వస్తోంది. ఇంతే కాకుండా భారత ఐ.టీ కంపెనీలు ప్రతి సంవత్సరం అమెరికన్ ప్రభుత్వానికి సోషియల్ సెక్యూరిటీ కోసం ఒక బిలియన్ డాలర్లు ఇస్తున్నారు" నాస్కాం తెలిపింది.

ఈ విషయాలన్నిటినీ అమెరికన్ ప్రభుత్వానికి అందజేసేరు.

Tuesday, September 21, 2010

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గారి ఫన్నీ (FUNNY SPEECH) స్పీచ్ వినండి....వీడియో

ఫోనులో ఆడమనిషిలాగా మాట్లాడినతని మోహంలో పడి రూ.7 లక్షలు మోసపోయేడు ఇతను

ఈ మధ్య మనుష్యుల ఆకారాలే అవతలి వారిని మోసం చేస్తుంటే, ఒక మనిషి ఫోనులో మాట్లాడే ఆడ గొంతును విని మోసపోవటం ఆశ్చర్యం కాదనుకుంటా. "ప్రేమ గుడ్డిది" అని అంటారు. మరి ఇతని ప్రేమను ఏమనాలో.

చెన్నైలో ఉన్న ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీలో మెనేజర్ గా పని చేస్తున్న 29 ఏళ్ళున్న ఒకతను తనని ఒకతను ఆడగొంతుకతో 4 సంవత్సరాలుగా ఫోన్లో మాట్లాడి, ప్రేమిస్తున్నానని చెప్పి తనను రూ.7 లక్షల దాకా మోసం చేసేడని పోలీసులకు ఫిర్యాదు చేసేడు.

4 సంవత్సరాలుగా ఫోన్లో మాట్లడటమే గానీ ఆమె ను ఎప్పుడూ నేరుగా చుసిందిలేదుట. కానీ అమె కష్టాలలో ఉన్నానని చెప్పినప్పుడల్లా ఆమె పంపిన మనిషి దగ్గర ఆమె అడిగినంత డబ్బు ఇచ్హి పంపేవాడట. చివరిగా ఇతను ఆ ఆడగొంతుకకు ఫోన్ చేసినప్పుడు, మరొకరెవరో ఫోన్ ఎత్తి ఇతను అడిగిన ఆడమనిషి పేరుతో ఎవరూ లేరని, ఆ ఫోన్ నెంబర్ తనదని, ఈ ఫోను తన తమ్ముడు కూడా వాడతాడని ఒక మగ మనిషి తెలిపేరట. మోసపోయేనని తెలుసుకున్న ఇతను తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేడు.

4 ఏళ్ళ క్రితం ఒకానొక పండుగ రోజు టెలికమ్యూనికేషన్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న ఇతనికి, ఇతనికి తెలియని సెల్ ఫోన్ నెంబర్ నుండి ఎస్.ఎం.ఎస్ మూలంగా పండుగ శుభాకాంక్షల గ్రీటింగ్ వచ్హింది. పంపినది ఎవరు అని ఇతను రిప్లై చేసి అడిగేడు. ఆ నెంబర్ నుండి ఒక ఆడ మనిషి తన పేరు చెప్పి ఇతన్ని పరిచయం చేసుకుంది. ఆ రోజు నుండి ప్రతి రోజూ ఇతనూ, ఆమె ఫోన్లో మాట్లాడుకోవటం జరిగింది. మాటలు ప్రేమకు దారితీసింది. ఇతను ఆమె ను కలుసుకోవాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆమె ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేదట.

ఆమె తనను తప్పించుకు తిరుగుతున్నా ఇతనికి అనుమానం రాలేదు. కానీ ఆమె తన తండ్రి మంచాన ఉన్నాడని, ఆయన్ను చూసుకోవడానికి ఇంకెవరూ లేరని, ఆయన చికిత్సకు తన దగ్గర డబ్బు లేదని ఆమె చెప్పిన కల్పిత మాటలకు ఇతను కరిగిపోయేడు. ఆమె అడిగినప్పుడల్లా, ఆమె అడిగినంత డబ్బు ఆమె పంపిన మనిషి కి ఇచ్హి పంపేడు.

ఈమెను పెళ్లి చేసుకోవాలని తనకు వచ్హిన సంభందాలను కాదన్నాడట. చివరికి, ఒకతను ఆడగొంతుకతో మాట్లాడి తనని మోసంచేసేడని తెలుసుకున్న తరువాత సిగ్గుతో తలదించుకున్నాడట. ధైర్యం తెచ్హుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసి అతని దగ్గరున్న ఆ ఆడగొంతుక ఫోన్ నెంబర్ ను వారికి ఇచ్హేడట.

Monday, September 20, 2010

2012 లో భూమికి రాబోయే ప్రమాదాన్ని ఎలాగైనా ఆపాలి....భారత ఆశ్ట్రోఫిసిక్స్ శాస్త్రవేత్త సుందర రామన్

మయాన్ క్యాలండర్ ప్రకారం 2012 లో భూమి అంతమవుతుందని చెబుతున్నారు. దీనిని ఆధారంచేసుకుని హాలీవుడ్ "2012" అనే సినిమాను తీసేరు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో మయాన్ క్యాలండర్ తెలిపిన విషయం వలన మరియూ 2012 సినిమాలో చూపిన విషయాల వలన కొంత అలజడి కలిగింది. అలాంటిదేమి జరగదని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు తెలిపిన తరువాత ప్రజలలో ఏర్పడిన అలజడి తగ్గింది. ఈ మధ్య అదే శాస్త్రవేత్తలు తెలుపుతున్న కొన్ని విషాయాలను బట్టి, 2012 లో భూమికి ఏదో జరగబోతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆశ్ట్రోఫిసిక్స్ హెడ్ ప్రొఫసర్ సుందర రామన్ ఖాయపరిచేరు.

2012 లో భూమి అంతమవుతుందని చెప్పడాన్ని మాత్రం కల్పితంగా అంగీకరించినా, డిసెంబర్ 21, 2012 న సూర్యుడు ఉదయించేటప్పుడు భూమికి ప్రమాదమున్నదని తెలిపేరు.

ఆ రోజు సూర్య గ్రహంలో ఏర్పడబోయే అసాధారణ చైతన్యం వలన సూర్య గ్రహంలో సౌర ధుమారాలు ఏర్పడతాయట. ఈ సౌర ధుమారాల వలన ఏర్పడే రసాయన వడగాల్పుల వలన కమ్యూనికేషన్ నెట్ వర్క లూ మరియూ పవర్ గ్రిడ్ లు మాడి మసి అయిపోతాయని తెలిపేరు.

"ఆ రోజు ఏర్పడబోయే సౌర జ్వాలలను ఆర్పడానికి మరియూ చల్లార్చడానికి ప్రయత్నాలు చేపట్టాలి. లేకపోతే ప్రపంచము లోని అన్ని నగరాలూ,మార్కెట్లూ, ప్రభుత్వ పరికరాలూ ఇంతకు ముందు ఎన్నడూ కనీ వినీ ఎరుగని గందరగోళానికి గురి అవుతాయి. ఆ సౌర జ్వాలల నుండి విడుదలయ్యే రసాయనాల వలన పవర్ గ్రిడ్ లు, కమ్యూనికేషన్ సర్వీసులూ, సెటిలైట్ లూ,అంతరిక్ష నౌకలూ మరియూ విమానలూ విపరీతంగా నష్ట పోతాయి" అని ఆయన తెలిపేరు.

1989 లో ఇలాంటి సౌర జ్వాలల నుండి వెలువడిన రసాయనాల వలన కెనడా దేశం లోని క్యూబిక్ ప్రాంతం 9 రోజులు చీకటిలో గడిపిన దాన్ని ప్రపంచ శాస్త్రవేత్తలకు గుర్తు చేసేరు. ఆ నాడు కెనడాలో ఏర్పడిన సౌర రసాయనాల శక్తి ఒక బిలియన్ మెగా టన్నుల టి.ఎన్.టి శక్తి గలిగింది. ఇప్పుడు రాబోవు సౌర రసాయనాల శక్తి టీ.వీ స్టేషన్లనూ, మొబైల్ ఫోన్ లనూ మరియూ జి.పి.ఎస్ పరికరాలను దెబ్బతీస్తుందని తెలిపేరు.

నాసా వారి నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ కు చెందిన మౌసమీ దిక్పతి డిసెంబర్ 21,2012 న సౌర ధుమారం వలన ఏర్పడే వడగాల్పు రసాయనాలు భూమిని తాకుతాయని ధ్రువీకరించేరు.

Sunday, September 19, 2010

తల్లిని వెతుక్కుంటూ వచ్హిన కుమారుని హ్రుదయం

తన కుమారుని మొదటి సంవత్సర వర్ధంతి రోజున, తన కొడుకుకు నచ్హిన వంటలు చేసి, ముద్దలు కలిపి, తన చేతితో అభినయ నోటికి అందించి ఆమె తింటుంటే ఆ తల్లి కళ్ల నుండి వచ్హిన కన్నీటిని ఆనందభాష్పాలనే చెప్పాలి. ఎందుకంటే తాము అతి ప్రేమగా చూసుకునే ఒకరు చనిపోతే, ఒక సంవత్సరం తరువాత వారికి తామే స్వయంగా అన్నం తినిపించడం ఎవరికి సాధ్య పడుతుంది...ఒక్క ఈమెకు తప్ప. దీన్నీ నిజమైన అద్రుష్టముగా చెప్పాలి.

నాగ పుష్ప అనే ఈ తల్లి, తన 17 సంవత్సారాల కొడుకు సభ్రీష్ ను ఒక రోడ్డు ప్రమాదంలో కోల్పోయింది. ఒక్కగానొక్క కొడుకు ఎదిగిన వయస్సులో అలా ఆక్సిడెంట్లో చనిపోవడం ఏ తల్లీ తట్టుకోలేదు. నాగపుష్ప కు కూడా అదే పరిస్తితి.

ఐ.టీ డిప్లమో చదువుతున్న సభ్రీష్ ను వేగంగా వెడుతున్న ఒక కారు ఢీ కొన్నది. నెత్తుటి మడుగులో పడున్న సభ్రీష్ ను సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేరు. ఆసుపత్రికి చేరుకున్న సభ్రీష్ తల్లితండ్రులతో సభ్రీష్ ను బ్రైన్ డెడ్ గా నిర్ధారించి ఏమీ చేయలేమని చెప్పేరు అక్కడి డాక్టర్లు. చెట్టంత కొడుకు పోయిన భాధను తట్టుకుంటూ అతని తల్లితండ్రులు సభ్రీష్ ను చెన్నై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్హేరు. తమ కొడుకును బ్రతికించుకోలేమని తెలుసుకున్న వారు సభ్రీష్ అవయవాలను (హ్రుదయం, కిడ్నీ, కళ్ళు మరియూ లివర్) వెంటనే దానం చేసేరు.

23 సంవత్సరాలున్న అభినయ హ్రుదయానికి సంభంధించిన, వైద్యం చేయలేని వ్యాధితో భాధ పడుతూ ఆ ఆస్పత్రిలోనే ఉంటోంది. ఆమెకు ఎవరైనా హ్రుదయం దానం చేస్తే ఆమె కు గుండె మార్పిడి చేస్తామని చెప్పేరు. అభినయకు, సభ్రీష్ గుండె అమర్చేరు. అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలో ఒకే సారి అన్ని అవయవాలను మార్పిడి చేయటం అదే మొదటి సారి.

నెమ్మదిగా కోలుకున్న అభినయ, తనకు గుండె దానం చేసిన వారి వివరాలను తెలుసుకుంది. వారికి తన హ్రుదయ పూర్వక ధన్యవాధాలు తెలుపుకోవాలని నిర్ణయించుకుని సభ్రీష్ ఇంటికి వచ్హింది. ఆ రోజే సభ్రీష్ మొదటి సంవత్సర వర్ధంతి అని అభినయకు తెలీదు.

అభినయకు తన కొడుకు గుండె అమర్చేరని తెలుసుకున్న సభ్రీష్ తల్లి తన కొడుకే స్వయం గా తన వర్ధంతి రోజు తన దగ్గరుకు వచ్హేడని సంతోషంతో ఉబ్బితబ్బిబైంది. అభినయను దగ్గరకు తీసుకుని తానే స్వయంగా అన్నం తినిపిస్తానని చెప్పింది. "అలాగే అమ్మా" అని అభినయ అన్నప్పుడు తన కొడుకే తనని "అమ్మా" అని పిలిచినట్లనిపించిది.

తమ కొడుకు చనిపోయిన తరువాత ఒక పిల్లవాడిని దత్తత తీసుకోవాలనుకున్న ఆ తల్లితండ్రులు "ఇక మీదట నేను వస్తూనే ఉంటానని" అభినయ వారికి వాగ్ధానం చేసిన తరువాత వారు దత్తత ఆలోచనని వదులుకున్నారట.

తమ కొడుకు చనిపోయినా, ఆ భాధను దిగ మింగుకొని అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్న ఆ తల్లితండ్రులకు జోహార్లు అంటే సరిపోదు. తమకు సన్నిహితంగా ఉంటున్న వారు చనిపోతే వారి అవయవాలను ఇతరులకు దానం చేసి వారికి సరి కొత్త జీవతానిచ్హి సంతోషపడండి అనె విషయాన్ని ఇతరులకు తెలియజేసిన వీరు నిజమైన ఆదర్శ దంపతులు.

Saturday, September 18, 2010

"ఫైర్" వాటర్ ఫాల్ (“FIRE” WATER FALL)...అరుదైన, అపురూపమైన ఫోటోలు

ఈ క్రింద మీరు చూస్తున్న ఫోటోలలోని వాటర్ ఫాల్ నీరు మామూలు నీరే. ఆ పడుతున్న నీటి మీద సూర్య రస్మి ఒక నిర్ణీత కోణంలో పడటం వలన ఆ నీరు నిప్పు రంగులో కనబడుతోంది. ఈ అరుదైన, అపురూపమైన ద్రుశ్యాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోని చివరి రెండు వారాలలో మాత్రమే చూడగలరట.....అమెరికాలోని కాలిఫోర్నియా లో ఉన్న ఎల్ కాపిటన్ (El Capitan) అడవి ప్రాంతం కొండలలో, కొండ పైన ఉన్న మంచు గడ్డలు కరిగి ఏర్పడే ఈ ఫైర్ వాటర్ ఫాల్ ను చిత్రీకరించడానికి చాలా కష్టపడ్డారట.














Friday, September 17, 2010

మంచి నీళ్ళను కాచి తాగటమే ఉత్తమం...ఎందుకంటే మార్కెట్ లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్స్ ఉత్తమమైనవి కావట!

మంచి నీటిని కాచి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నీటిలోని హానికరమైన క్రిములను నాశనం చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు చాలా మంది మంచి నీటిని కాచి ఉపయోగించుకునే వారు. కానీ ఈ మధ్య మార్కెట్లోకి చాలా రకాల వాటర్ ప్యూరిఫైయర్స్ రావడంతో ప్రజలు వాటిని కొని ఉపయోగిస్తున్నారు. "మా వాటర్ ప్యూరిఫైయర్ వాడండి...జీరో బక్టీరియా నీరు తాగండి...ఆరోగ్యంగా ఉండండి" అంటూ పలు పెద్ద కంపెనీలు ఒకరిమీద ఒకరు పోటీ పడుతూ వ్యాపార ప్రకటనలు ఇస్తూ వారి వారి ప్రాడక్ట్స్ ను అమ్ముకుంటున్నారు. ప్రజలు వీరు చెప్పింది నమ్మి వారికి తోచిన వాటర్ ప్యూరిఫైయర్స్ కొనుక్కుని వాడుకుంటున్నారు.

"మార్కెట్లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్స్ లో అధికమైనవి ఉత్తమమైనవి కావు...అవి నీటిలోని హానికరమైన బాక్టీరియాలనూ, వైరస్ లనూ పూర్తిగా తొలగించటం లేదు" అని పూనే లో ఉన్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తెలిపినట్లు ఒక ప్రముఖ దిన పత్రిక ప్రకటించిది.

ఈ వార్త విని చాలామంది షాక్ తిన్నారు. ఎందుకంటే పేరున్న అతి పెద్ద కంపెనీలు తమ వ్యాపార ప్రకటనలలో తమ వాటర్ ప్యూరిఫైయర్స్ నీటిలోని క్రిములను పూర్తిగా తొలగిస్తాయని చెప్పడంతో చాలమంది వాటిని కొని వాడుకుంటున్నారు.

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారు మార్కెట్ లో ఉన్న వివిధ రకాల వాటర్ ప్యూరిఫైయర్స్ ను పరిశోధించేరట. "ఆక్సినేటడ్ కార్బన్ ఫిల్టర్స్, సెరామిక్ కాండిల్ ఫిల్టర్స్, సెడిమెంట్ ఫిల్టర్స్, ఐయోడిన్ రెసిన్ గ్రావిటీ ఫిల్టర్స్, పోలియస్టర్ ఫిల్టర్స్, అల్ట్రా ఫిల్టర్ ఇర్రేడియేషన్, రివర్స్ ఆస్మోసిస్ మరియూ హోలో ఫైబర్ మెంబ్రైన్ ఫిల్టర్స్ గల ప్యూరిఫైయర్స్ ను నీటిలో ఎక్కువగా ఉండే "హెపటైటీస్ E వైరస్" నీటితో పరిశోధించేము. వివిధ రకాల పరిశోధనా విధాలను ఉపయోగించి పరిశోధించేము. మార్కెట్ లో ఉన్న ప్రతి కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్స్ నూ పరిశోధించేము. ఏ ఒక్క ప్యూరిఫైయ్యరూ ఈ వైరస్ ను పూర్తిగా ఫిల్టర్ చేయలేదు" అని తెలిపేరు.

"బాక్టీరియాల కంటే వైరస్ లు ఎక్కువ కాలం నీటిలో ఉంటాయి. కాబట్టి మనదేశంలో వాటర్ ప్యూరిఫైయర్స్ ను తయారుచేయడానికి కేంద్రం ఒక నిర్దేశిత పద్దతిని ద్రువీకరించాలి. ఆ పద్దతి ప్రకారమే అందరూ వాటర్ ప్యూరిఫైయర్స్ ను తయారు చేయాలి. ఈ విషయాన్ని మేము కేంద్రానికి తెలియపరుస్తాము" అని తెలిపేరు.

ఒకటి రెండు పెద్ద కంపెనీలు "మేము తయారు చేసిన వాటర్ ప్యూరిఫైయర్స్ అంతర్జాతీయ నిర్దేశిత పద్దతిలోనే తయారు చేసేము" అని చెబుతున్నారు. అయితే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారు "మేము పరిశోధించిన పద్దతి అంతర్జాతీయ పరిశోధనా పద్దతి ప్రకారమే" అని చెబుతున్నారు.

ఏది మంచిదో కాదో అని తెలుసుకునే కష్టం లేకుండా మంచి నీటిని మన పద్దతిలో కాచి తాగితే మంచిదేమో.

10 సంవత్సరాలుగా నిరాహారదీక్ష చేస్తున్న ఈమెకు శాంతి బహుమతి

10 సంవత్సరాలుగా నిరాహారదీక్ష చేస్తున్న ఈమెకు రవీంద్రనాద్ ఠాగూర్ శాంతి బహుమతి ఇచ్హేరు. ఈ బహుమతితో పాటు ఆమెకు 1 లక్ష డాలర్లు అందించేరు.

ఐరం షర్మీలా చానూ అనే పేరుగల ఈమె మానవ హక్కుల కై పోరాడే కార్య కర్త. మనిపూర్ లో విప్లవకారుల మీద కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వైకరిని ఖండిస్తూ 10 సంవత్సారల క్రితం నిరాహారదీక్ష మొదలుపెట్టింది. ఈ రోజు దాకా అమె నిరాహారదీక్ష కొనసాగుతోంది.

ఆమె శాంతియుతం గా పోరాడే విధానాన్ని గమనించి, ఆమె పట్టుదలతో 10 సంవత్సరాలుగా చేస్తున్న నిరాహారదీక్షను గుర్తించి ఆమెకు ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజిమెంట్ వారు ఈమెకు రవీంద్రనాధ్ ఠాగూర్ శాంతి బహుమతిని ఇవ్వాలని నిర్ణయించుకుని ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేసేరు.

మనిపూర్ లో విప్లవకారులను అనిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ.ఎఫ్.ఎస్.పి.ఏ (AFSPA) అనే చట్టాన్ని తీసుకు వచ్హింది. ఈ చట్టం క్రింద రక్షక దళాలు విప్లవకారుడని అనుమానపడిన వారిని కాల్చి చంపవచ్హు. అలా కాల్చి చంపిన రక్షక దళాల మీద ఎటువంటి చర్య తీసుకోబడదు. అక్టోబర్ 2000 సంవత్సరములో 10 మంది మనిపురీ యువకులను విప్లవకారులని చెప్పి రక్షక దళాలు కాల్చి చంపేసేరు. ఈ చట్టాన్ని రక్షక దళాలు దుర్వినియోగం చేస్తున్నారని ఐరన్ లేడీ ఆఫ్ మనిపూర్ అని పిలువబడే ఈమె కేంద్రం ఆ చట్టాన్ని వెంటనే ఉప సం హరించుకోవాలని నిరాహారదీక్ష మొదలుపెట్టింది. ఈమె చేపట్టిన నిరాహార్దీక్షను భంగ పరచాలని, ఆమె ను ఖైదుచేసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ఆమె కు బలవంతం గా సలైన్ ఎక్కీంచేరు. మాయ మాటలు చెప్పేరు. వారి మాటలకు లొంగక ఆసుపత్రిలోనే ఆమె తన నిరాహారదీక్షను కొనసాగించింది. ఎంత ప్రయత్నంచేసినా ఆమె మాటవినడంలేదని, ఆమెకు శ్వాశ నాలల ద్వారా ఆహారం ఎక్కించటం చేసేరు. 10 సంవత్సారాలుగా పచ్హి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఆమె పోరాడుతూనే ఉన్నది.

."నిజాయతీగా, పట్టుదలగా, శాంతియుతంగా పోరాడుతున్న ఈమెకు ఈ బహుమతి అందిచడానికి మేము ఎంతో గర్వ పడుతున్నాము" అని ఐ.ఐ.పి.ఎం డైరెక్టర్ కె.చౌదరి గారు తెలిపేరు.

."ఈ బహుమతులకోసం నేను పోరాడటంలేదు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ చేస్తున్న ఈ నిరాహారదీక్ష నా పోరాటం గెలిచేంతవరకూ కొనసాగుతుంది. నా పోరాటం గెలుస్తుందా, లేదా అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు" అని ఆమె చెప్పింది.